breaking news
SIMs director
-
ఎట్టకేలకు రాజీనామా
సాక్షి, తిరుపతి, చిత్తూరు: ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కొనసాగాలా.. వద్దా.. అనే సందిగ్దంలో ఉన్న స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. పదవి లో ఉన్నన్ని రోజులు ఆయనపై వివిధ ఆరో పణలు వచ్చాయి. పాలన అంతా మాజీ సీఎం చంద్రబాబు బంధువుల చేతిలో పెట్టారని.. దీంతో వారు ఆడిందే ఆటగా మారిపోయిందని.. ఖజానాను వివిధ రూపాల్లో కొల్లగొట్టారని విమర్శలున్నాయి. వీరి ఆగడాలు అధికారులను సైతం తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయని తెలి సింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా డైరెక్టర్ వారిని అదుపులో పెట్టలేకపోవడంతో తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రతి అంశం వివాదాస్పదంగా మారింది. పలువురు స్విమ్స్ అధికారులు సైతం అడ్డదిడ్డంగా వ్యవహరించారు. చంద్రబాబు బంధువుల వారి మాటలకు అడ్డుచెప్పే సాహసం డైరెక్టర్ కూడా చేయలేకపోయారని బహిరంగంగా విమర్శలు వచ్చాయి. ఔట్సోర్సింగ్ నియామకాల నుంచి వైద్యులు, టెక్నీషి యన్ల నియామకాలు పరిపాలనా విభాగ పదోన్నతులు, వైద్యపరికరాల కొనుగోళ్లు, మెడికల్ షాపు నిర్వహణ వంటి వాటిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జవహార్‌రెడ్డిని అమరావతిలో కలసి బుధవారం రాత్రి రాజీనా మాను అందించారు. స్విమ్స్ ఇన్చార్జ్ డైరెక్టర్‌గా, వీసీగా స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అలోక్ సచన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు అందాయి. -
స్విమ్స్ డైరెక్టర్.. లుంగి డాన్స్!
►టీటీడీ ఆడిటోరియంలో స్టెప్పులు తిరుపతి : టీటీడీకి చెందిన సంస్థలో అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి పాదాల చెంత కొలువై, దేవస్థానం ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో సాక్షాత్తు డైరెక్టర్ తన హోదా మరచి ఓ కార్యక్రమంలో ‘లుంగి డ్యాన్స్’ అనే పాటకు చిందులేయడం వివాదా స్పదమైంది. ఆయన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో, చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల స్విమ్స్ ఉద్యోగుల పిల్లల సంరక్షణ కేంద్రం వార్షికోత్సవాన్ని శ్రీపద్మావతి ఆడిటోరియంలో నిర్వ హించారు. ముఖ్య అతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినులతో కలసి స్టెప్పు లేయడం చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో అసభ్యకరమైన, పాశ్చాత్య సంస్కృతికి చెందిన కార్యక్రమాలకు స్థానం లేదు. ఆ సంస్థ వైన్స్ చాన్స్‌లర్, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారే ఈ విషయాన్ని విస్మరించి, వేదికపై శ్రీవారి విగ్రహం ఎదుటే ఏమాత్రం సంకోచించకుండా స్టెప్పులేశారు. పాలనాపరంగానూ ఆరోపణలు ఎన్ఆర్ఐ అయిన డాక్టర్ రవికుమార్ అధికార పార్టీకి చెందిన వైద్య శాఖ మంత్రికి సన్నిహితుడు. ఏడాది క్రితం డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆరంభంలో కొన్ని పాలనా పరమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తర్వాత అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకమైన నిర్ణయాలను సైతం అధికార పార్టీకి చెందిన అధికారులకు అప్పగించడం, తరచూ సెలవులో విదేశాలకు వెళ్లడంతో స్విమ్స్‌లో పాలన అటకెక్కింది. సీనియర్లను కాకుండా తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తికి ఫర్ఫ్యూజనిస్ట్గా శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించారు. ఫైనాన్స్ కమిటీ అప్రూవల్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి లేకుండానే ఈ నియామకం పట్ల సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 151 జీవో ప్రకారం కనీస వేతనాలు చెల్లించడం లేదు. ఓ మహిళకు కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధి కల్పించి క్వార్టర్స్ కేటాయించడంపై విమర్శ లున్నాయి. దీనిపై స్విమ్స్ డైరెక్టర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.