breaking news
silver crown
-
బి. జయకు సిల్వర్ క్రౌన్!
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినిమాలో ఒక విశిష్ఠ స్థానాన్ని పొందిన ప్రముఖ మహిళా దర్శకురాలు జయ బి. గారిని ‘సిల్వర్ క్రౌన్’ పురస్కారంతో సత్కరిస్తున్నామని ‘అక్కినేని–ఫాస్’ ఫిల్మ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డా‘‘ కె. ధర్మారావు తెలిపారు. 2017 సంవత్సరానికి గాను ఈ అవార్డును అందజేస్తున్నారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో జరగనున్న కార్యక్రమంలో జయ బి.ని సత్కరించనున్నారు. ‘అక్కినేని–ఫాస్’ అవార్డుల్లో ఉత్తమ చిత్రాలుగా ‘ప్రేమమ్, శతమానం భవతి, ఫిదా, నిన్ను కోరి, వైశాఖం’ (2016 సెప్టెంబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకున్నారు)లను ఎంపిక చేశారు. నటుడు సాయికుమార్‌ను ప్రత్యేకంగా సత్కరించనున్నారు. -
వేంకటేశ్వరస్వామికి వెండి కిరీటం సమర్పణ
భీమవరం (ప్రకాశంచౌక్) : భీమవరం జువ్వలపాలెం రోడ్డులో వేంచేసియున్న పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారికి దాతలు నామన రామారావు– సుధ దంపతులు రూ.2 లక్షల విలువగల మూడు కిలోల వెండి కిరీటం సమర్పించారు. అలాగే బొక్కా కృష్ణమోహనరావు–నాగరత్నం దంపతుల కుమారుడు బొక్కా వెంకటేశ్వర్లు(అమెరికా)స్వావిువారికి రూ.లక్ష విలువైన రెండు కిలోల వెండి పాదాలు బహూకరించారు. వీటిని అర్చకులు స్వామివారికి అలంకరించారు. కార్యక్రమంలో ధర్మకర్త మంతెన రామ్‌కుమార్‌రాజు, ఆలయ ఈవో రుద్రరాజు గంగా శ్రీదేవి పాల్గొన్నారు. -
దేవుడికి వెండి కిరీటాలు సమర్పించిన బిచ్చగాడు