breaking news
sibling
-
'అపూర్వ బంధం'.. తోబుట్టువుల ప్రేమ.. అనుబంధాలకు ప్రతీక..!
ప్రపంచంలో ప్రతి అనుబంధం ప్రత్యేకమైనది. అయితే, కొన్ని బంధాలు మన హృదయంలో శాశ్వత స్థానం ఏర్పరచుకుంటాయి. అలాంటి ఓ అపురూపమైన బంధం – సోదర సోదరీమణుల అనుబంధం. ఈ బంధాన్ని గౌరవించేందుకు, జరుపుకునేందుకు ప్రతి ఏప్రిల్ 10న మనం "సిబ్లింగ్ డే" ను నిర్వహిస్తాం. ఇది కేవలం ఒక ఇంటర్నేషనల్ సెలబ్రేషన్ కాదు, మన వ్యక్తిత్వ వికాసం, మన భావోద్వేగ పరిణతిలో తోబుట్టువుల పాత్రను గుర్తించి గౌరవించాల్సిన రోజు.మన భారతీయ కుటుంబ వ్యవస్థలో సోదర సోదరీమణుల బంధానికి గౌరవప్రదమైన స్థానం ఉంది. జీవితంలో మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే మొదటి బంధం అమ్మానాన్నలతో అయితే, రెండోది తోబుట్టువులతో ఉన్న అనుబంధం. సోదర బంధం అనేది కేవలం కుటుంబ సంబంధం మాత్రమే కాదు, అది మన మానసిక అభివృద్ధిలో ఒక మూల స్థంభం. తోబుట్టువు అంటే కేవలం మనతో పుట్టిన వ్యక్తి కాదు, మన వ్యక్తిత్వాన్ని అద్దంలా చూపించే వ్యక్తి.సోదర సంబంధాల మానసిక ప్రభావంఇతరులతో సురక్షితమైన అనుబంధం ఏర్పరచుకోవడం (secure attachment) మానసిక నిర్మాణంలో చాలా ముఖ్యమైన అంశం. అది తల్లిదండ్రులతో ప్రారంభమైతే, తోబుట్టువులు దాన్ని స్థిరపరుస్తారు. బాల్యంలో తోబుట్టువులతో ఉన్న అనుబంధం జీవితంలో బలహీనతల్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.ఒక తమ్ముడు అన్న బాటలో నడుస్తాడు, ఒక అక్క చెల్లెల్ని అల్లారుముద్దుగా పెంచుతుంది. ఈ అనుబంధం conflicting emotionsను సహజసిద్ధంగా ఎదుర్కొనటానికి ఒక విస్తృత ప్రయోగశాలలా మారుతుంది. అదే జీవితానికి సరిపడా సంస్కారాన్ని అందించే తొలి వేదిక.అనుబంధాల తొలి కిరణాలుబాల్యం అనేది మనసు మీద మొదటి ముద్ర వేసే దశ. ఈ దశలో తోబుట్టువులతో కలసి గడిపిన క్షణాలు – మన జీవితానికి పునాదిలా ఉంటాయి. చిన్నప్పుడు అమ్మ చేతినుంచి తొలి ముద్ద కోసం పోటీ పడిన సంఘటనలు, అమ్మానాన్నను ఫేవరెట్ అనిపించుకునే కుతూహలాలు, కలిసి తినడం, ఆడటం, తిరగడం – ఇవన్నీ కలిసి మనలో భావోద్వేగ నిబంధనలు (emotional rules) రూపుదిద్దుకుంటాయి. తోబుట్టువులు మనకు పాఠశాలలో చదవని పాఠాలు నేర్పుతారు. సహనం, సహకారం, పోటీ, సమన్వయం, పంచుకోవడంలాంటివి సహజసిద్ధంగా నేర్పుతారు. ఈ విలువలే ఎమోషనల్ హెల్త్ కు మూలం.సైకాలజీ దృష్టిలో, ఇది Social Referencing Phase. పిల్లలు తోబుట్టువుల ద్వారా – ఎలా స్పందించాలి? ఎలా సహనం వహించాలి? ఎలా స్పందన కనబర్చాలి? అనే మౌలిక విలువలు నేర్చుకుంటారు.విభేదాలు – మనస్సు ఎదిగే అవకాశాలువాస్తవానికి, తోబుట్టువుల మధ్య విభేదాలు లేకపోవడం అసాధ్యం. బాల్యంలో తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అలుగుతాం, మాట్లాడకుండా ఉండిపోతాం. కానీ ఆ విభేదాల్ని ఎలా నిర్వహించామన్నదే మన భావోద్వేగ సామర్థ్యాన్ని (emotional intelligence) నిర్ధారిస్తుంది. మంచి సోదర బంధం ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎదురయ్యే ఘర్షణలను సులువుగా నిర్వహించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని అధ్యయనాలు చెప్తున్నాయి.ముఖ్యంగా కౌమారంలో, అంటే టీనేజ్ లో వ్యక్తిత్వం విస్తరించటం మొదలవుతుంది. ఈ సమయంలో siblings మనకు ఒకరిపై ప్రేమ, ఒకరిపై అసూయ, ఒకరిపై గౌరవం, మరొకరిపై స్వార్థం అనే విరుద్ధ భావాల్ని అనుభవించే అవకాశం ఇస్తారు. ఇది complex emotions ని సరిగా అర్థం చేసుకునే దశ. ఇదే emotional literacy కు శిక్షణ అందించే వేదిక.అనుబంధాల పునర్నిర్మాణంవృద్ధాప్యానికి దగ్గరయ్యే దశలో – siblings మనసులోని మాటను పంచుకునే ఆత్మీయులుగా మారిపోతారు. తల్లిదండ్రులు మిగలకపోయినా, తోబుట్టువులే మనకు మిగిలే స్నేహితులు. జీవితపు అనుభవాలు, భిన్న దారుల్లో నడిచిన ప్రయాణాలు వేరువేరైనా, చివరకు చిన్ననాటి జ్ఞాపకాల చల్లదనమే మనల్ని మళ్ళీ కలిపేస్తుంది. సైకాలజీ పరంగా ఇది Emotional Reconnection Phase. ఇది మన attachment history ని తిరిగి సవరించే అవకాశం. గతంలో జరిగిన దోషాలను అంగీకరించి, ప్రేమతో మళ్ళీ కలిసే బంధాన్ని పునఃస్థాపించుకోవచ్చు.ఈ రోజు ఏం చేయాలి? ఇప్పుడు జీవితాలన్నీ వేగంగా మారుతున్నాయి. ఉద్యోగాలు, వ్యక్తిగత బాధ్యతలు, టెక్నాలజీ వల్ల కొందరిలో మానవ సంబంధాలు పెళుసుబారాయి. అనేకమంది తోబుట్టువులతో విభేదాల వల్ల దూరమైపోయి గిల్ట్ (guilt), శూన్యత (emptiness), లేదా మానసిక వ్యథను అనుభవిస్తూ ఉంటారనేది సైకాలజిస్ట్ గా నేను గమనించిన విషయం. అలాంటివారు ఈ రోజును భావోద్వేగం పునరాగమనానికి (emotional reconciliation) అవకాశంగా వినియోగించుకోవాలి. అందుకే ఈరోజు... • మీ సోదరుడికి / సోదరికి ఒక ఆత్మీయ సందేశం పంపండి.• చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేయండి.• సంబంధం తెగిపోయి ఉంటే, పునఃసంధానానికి ప్రయత్నించండి.• మీ బిడ్డల్లోనూ సోదర బంధం పట్ల గౌరవం పెరగాలంటే – మీరు మీ సోదర సంబంధాన్ని ఎలా నిర్వహిస్తున్నారో వాళ్లు గమనిస్తుంటారని తెలుసుకుని మసలుకోండి.ఒక చెల్లెలి ప్రేమకు ప్రపంచ నివాళిక్లౌడియా ఎవర్ట్, న్యూయార్క్కి చెందిన మహిళ, తన సోదరి లిజా మరియు సోదరుడు అలాన్ను చిన్న వయసులోనే కోల్పోయారు. ఆ కోల్పోయిన బంధాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రతి ఏప్రిల్ 10 (లిజా పుట్టిన రోజు)ను సిబ్లింగ్ డేగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. 1995లో Sibling Day Foundation ను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఈ భావనను వ్యాపింపజేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ రోజును ఒక ప్రేమ సూచికగా, బంధాలను గుర్తచేసుకునే రోజుగా పాటిస్తోంది. సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి..
జన సంచారం తక్కువగా ఉన్న ఒక వంతెన పైన రెండు కుక్కలు ఆడుకుంటూ ఉండగా ఒక కుక్క పొరపాటున పక్కనే ఉన్న సంపులో పడిపోయింది. దీంతో రెండో కుక్కకు ఏమి చెయ్యాలో పాలుపోక, తన సోదరుడిని ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక సహాయం కోసం చుట్టూ చూసింది. సంయమనంతో అలోచించి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మనిషిని సాయం కోరింది. అటుగా వెళ్తోన్న ఒక వ్యక్తిని అడ్డుకుని మొరుగుతూ.. తోక ఆడిస్తూ.. తన సమస్యని చెప్పే ప్రయత్నం చేసింది ఆ శునకం. మొదట అదేమీ పట్టించుకోని ఆ వ్యక్తి అలాగే ముందుకు నడుచుకుంటూ పోతుండగా ఆ కుక్క మాత్రం పట్టిన పట్టు విడవకుండా అతడిని వెంబడించింది. దీంతో ఎదో జరిగిందని గ్రహించిన ఆ వ్యక్తి అక్కడే ఆగి వెనక్కు చూశాడు. వెంటనే ఆ కుక్క అతడిని ఆ సంపు వద్దకు తీసుకుని వెళ్లగా మానవత్వంతో ప్రమాదంలో చిక్కుకున్న కుక్కని బయటకు తీసి రక్షించాడు. అనంతరం సంపు పైన మూతను అమర్చి తన దారిన వెళ్తున్న ఆ వ్యక్తిని రెండు కుక్కలు కృతఙ్ఞతలు చెబుతూ వెంబడించాయి. థాంక్ యూ మనిషి.. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. "తన సోదరుడిని కాపాడుకునేందుకు మనిషి సాయం కోరిన కుక్క.. మీరు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు.. థాంక్ యూ మనిషి.. " అని మూగజీవాల ధృక్కోణంలో కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. Dog seeks help from a random person to rescue his brother. They were happy and grateful for the help. Thank you, hooman...🙏❤️ pic.twitter.com/v0FHIIgZXd — 𝕐o̴g̴ (@Yoda4ever) June 30, 2023 ఇది కూడా చదవండి: వాగ్నర్ గ్రూపులోని 21000 మందిని మట్టుబెట్టాం.. జెలెన్స్కీ -
అమానుషం
ఓబులవారిపల్లె : ఆస్తి పంపకాల్లో మనస్పర్థలు రావడంతో రక్తం పంచుకుపుట్టిన తోబుట్టువునే కడతేర్చిన హృదయ విదారక ఘటన ఓబులవారిపల్లె మండలం గాదెల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. గాదెల గ్రామంలో కారం గంగయ్య, వెంకటమ్మలకు రత్నమ్మ, రాజమ్మ, బుజ్జమ్మ అనే ముగ్గురు సంతానం. మగ బిడ్డలు లేకపోవడంతో వారినే కొడుకులుగా భావించి ముగ్గురు కుమార్తెలను అదే గ్రామంలో ఇచ్చి పెళ్లిళ్లు చేశారు. గ్రామంలో తనకున్న 1.20 ఎకరాలు భూమిని కూడా ముగ్గురు కుమార్తెలకు పంచారు. కొద్ది రోజుల క్రితం గంగయ్య మృతి చెందాడు. భర్త మృతితో భార్య వెంకటమ్మ.. పెద్ద కుమార్తె రత్నమ్మ వద్ద ఉంటోంది. బీదరికంలో ఉన్న మరో కూతురు రాజమ్మ(40) తన కూతురు వివాహ ఖర్చు కోసం తల్లి వెంకటమ్మ వద్ద నున్న బంగారం తీసుకుని కుదువ పెట్టింది. భూమిని పంచుకున్న తోబుట్టువులు తల్లి వద్ద ఉన్న బంగారం కోసం తరచూ గొడవపడేవారు. ఈ నేపథ్యంలో కుదువ పెట్టిన బంగారం కోసం రాజమ్మతో అక్క రత్నమ్మ, చెల్లెలు బుజ్జమ్మ కొద్ది రోజుల క్రితం గ్రామంలో నిలదీశారు. బంగారం రాకపోవచ్చని భావించి రాజమ్మ భూమిని స్వాధీనం చేసుకున్నారు. తన భూమిని తన అక్కా, చెల్లెలు లాక్కున్నారని, తిరిగి తనకు ఇప్పించాలని నాలుగు రోజుల క్రితం రాజమ్మ ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భూమి తిరిగి ఇస్తే రూ.20 వేలు.. అక్క, చెల్లెలుకు ఇస్తానని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు ఈ సమస్యను విచారిస్తుండగానే మంగళవారం సాయంత్రం రత్నమ్మ, బుజ్జమ్మలు ఆగ్రహించి ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజమ్మపై దాడికి తెగబడ్డారు. పోలీసు స్టేషన్లో కేసు పెడతావా... నీ అంతు చూస్తామంటూ గ్రామ పొలిమేర చివరి వరకు ఈడ్చుకెళ్లి తీవ్రంగా కొట్టారు. గొంతుపై కాలువేసి తొక్కారు. దాడిని అడ్డుకోబోయిన గ్రామస్తులను తీవ్ర పదజాలంతో దూషించారు. తనపై దాడి చేశారని రాజమ్మ స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదు చేసింది. దాడి చేసిన వారిని పిలిపించి విచారిస్తామని పోలీసులు చెప్పడంతో బాధితురాలు ఇంటికెళ్లింది. తీవ్ర గాయాలతో ప్రథమ చికిత్స చేయించుకుని నిద్రపోయిన రాజమ్మ బుధవారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో భర్త ఆంజనేయులు స్థానికుల సహాయంతో రైల్వేకోడూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు దర్యాప్తులో ఉంది. పోలీసుస్టేషన్ ఎదుట బంధువులు ధర్నా రైల్వేకోడూరు ఆర్బన్ : రాజమ్మ మృతికి కారణమైన వారిని శిక్షించాలని ఆమె బంధువులు బుధవారం రైల్వేకోడూరు పోలీసుస్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. తామిచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుల ఒత్తిడితోనే ఫిర్యాదు తీసుకోలేదని నినదించారు. ఈ సంఘటన తమ పరిధిలోకి రాదని ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్కు వెళ్లాలని పోలీసులు సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని సీఐ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.