breaking news
Shreya reddy
-
ఘనంగా శ్రేయ–ఉజ్వల్ల వివాహం
సాక్షి, చెన్నై: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి, మాలిని దంపతుల కుమార్తె శ్రేయరెడ్డి, అంజన–గోవింద్ బిలాని దంపతుల కుమారుడు ఉజ్వల్ల వివాహం గురువారం చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో కనుల పండువగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ప్రముఖ సినీ నటి త్రిష, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు హాజరై వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వధూవరులు శ్రేయ–ఉజ్వల్లతో మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు..చిత్రంలో తమిళనాడు సీఎం విజయ్, సినీనటి త్రిష, ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు నూతన దంపతులు సుఖ సంతోషాలతో, ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఈ వివాహానికి విచ్చేయడంతో లీలా ప్యాలెస్ సందడిగా మారింది. కాగా, వైఎస్ జగన్ చెన్నైకి విచ్చేశారని తెలియడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జాకీర్ హుసేన్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు లీలా ప్యాలెస్ వద్ద స్వాగతం పలికారు. అభిమానులు దారి పొడవునా పువ్వుల వర్షం కురిపిస్తూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బంధువులు, మిత్రులు, పార్టీ వర్గాలను ఆప్యాయంగా పేరు పేరునా పలకరిస్తూ వేదిక వద్దకు వెళ్లారు. ఈ వివాహ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. -
శ్రేయారెడ్డి రీ ఎంట్రీ
నటి శ్రేయా రెడ్డి గుర్తున్నారా? ఆ మధ్య తిమిరు (తెలుగులో పొగరు) చిత్రంలో ప్రతినాయకిగా దుమ్మురేపిన నటి ఈమె. అంతకు ముందు తమిళంలో హీరోయిన్‌గానూ అంతకంటే ముందు తెలుగులోనూ నటించిన శ్రేయా రెడ్డి నటుడు విశాల్ అన్నయ్య విక్రమ్‌ను పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. కొంత కాలం అమెరికాలో ఉన్న శ్రేయా రెడ్డి ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారు. ఈమె మళ్లీ నటనపై దృష్టిసారించడం విశేషం. ఆండవ కానూన్ అనే చిత్రంలో శ్రేయా రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు సుశీంద్రన్ శిష్యుడు వడివేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా తన రీఎంట్రీ గురించి శ్రేయారెడ్డి తెలుపుతూ ఆండవ కనూన్ (దేవుని చట్టం) చిత్రంలో నటిద్దామా? వద్దా? అన్న శంకతోనే అంగీకరించానన్నారు. ఎందుచేతనంటే ఆ పాత్ర అంత క్రిటికల్‌గా ఉంటుందన్నారు. తేని నేపథ్యంలో సాగే గ్రామీణ కథా చిత్రం అని తెలిపారు. అయితే చిత్ర కథ విన్న విశాల్, విక్రమ్‌తో పాటు పలువురు తనను నటించమని ప్రోత్సహించారని అన్నారు. ఇందులో తన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు. దర్శకుడు వడివేల్‌కు కథపై చాలా పట్టు ఉందని ఆయన చిత్రీకరణ విధానం చూస్తుంటే అర్ధం అయ్యిందని అన్నారు. చిత్రంలో నూతన జంట హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని వారికి గత 90 రోజులుగా నటనలో శిక్షణ ఇస్తున్నారని చెప్పారు.


