రామ్‌గోపాల్ వర్మ షో మ్యాన్
రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్ మార్చారు. దర్శకుడిగా తెరవెనకకు పరిమితమైన వర్మ ఇప్పుడు తెరపైకి హీరోగా రానున్నారు. ఆయన హీరోగా ‘షో మ్యాన్’ టైటిల్‌తో ఓ చిత్రం రూపొంందుతోంది. ‘మ్యాడ్ మాన్స్టర్’ అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో సుమన్ విలన్‌గా నటిస్తున్నారు. నూతన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ కార్పొరేట్ సంస్థతో కలిసి భీమవరం టాకీస్‌పై ప్రోడక్షన్ 120గా తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వర్మతో ‘ఐస్‌క్రీమ్–1, ఐస్‌క్రీమ్–2’ చిత్రాలను రామసత్యనారాయణ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘షో మ్యాన్’ ట్రైలర్‌ను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.