breaking news
Shortage of teaching staff
-
1,200 మంది విద్యార్థులకు 10 మందే ఫ్యాకల్టీ!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గతేడాది డిసెంబర్లో ప్రారంభమైన డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఇప్పటికీ మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, పరిపాలనా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. భూవిజ్ఞాన శాస్త్రం, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, పర్యావరణ శ్రస్తాలతోపాటు ఇంజనీరింగ్ విభాగాల్లో నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయగా ప్రస్తుతం అధ్యాపకుల కొరత విద్యా బోధనకు ప్రధాన అడ్డంకిగా మారింది.యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్ విభాగాల్లో సుమారు 1,200 మంది విద్యార్థులకు బోధించేందుకు 128 మంది అధ్యాపకులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ ప్రస్తుతం మంజూరైన అధ్యాపక పోస్టులు 33 మాత్రమే. వారిలోనూ 15 మందే వర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారిలో ఐదుగురు కాకతీయ యూనివర్సిటీకి డిప్యుటేషన్‌పై వెళ్లడంతో రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య 10కి తగ్గింది. అవసరమైన సిబ్బందితో పోలిస్తే ప్రస్తుతం ఉన్న అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం సవాల్‌గా మారింది. భూవిజ్ఞాన శ్రస్తానికి అధ్యాపకులేరి? యూనివర్సిటీలో అత్యంత కీలకమైన భూవిజ్ఞాన శాస్త్ర విభాగానికి ఒక్క అధ్యాపకుడు కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రత్యేకంగా ఎర్త్ సైన్సెస్ విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన సంస్థలోనే సంబంధిత సబ్జెక్టులకు బోధకులు లేకపోవడం విద్యార్థులను ఆందోళన కు గురిచేస్తోంది. ప్రస్తుతం 10 మంది రెగ్యులర్ అధ్యాపకులు, ఏడుగురు కాంట్రాక్టు లెక్చరర్లతోనే వర్సిటీలో బోధన కొనసాగుతోంది.ప్రైవేటు కళాశాలల నుంచి గెస్ట్ లెక్చరర్లు, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు చెందిన భూవిజ్ఞాన శాస్త్ర నిపుణులు, ప్రభుత్వ విభాగాల సిబ్బందిని బోధనకు వినియోగిస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో విద్యా కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ పూర్తిస్థాయి అధ్యాపక వ్యవస్థకు ఇవి ప్రత్యామ్నాయం కాలేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల పలు వర్సిటీలకు ప్రభుత్వం 500 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతించింది. అందులో ఎర్త్ యూనివర్సిటీకి మాత్రం ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదు. పూర్తిస్థాయి పరిపాలనా వ్యవస్థ లేకపోవడంతో విద్యా కార్యక్రమాల నిర్వహణ, నియామకాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో వేగం తగ్గుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తక్షణమే దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విద్యావేత్తలు, విద్యార్థులు కోరుతున్నారు. కొత్త దిశ అందించే వర్సిటీ అన్ని వనరులున్న ప్రాంతంలో ఎర్త్ యూనివర్శిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందుకు అనుగుణంగా ఏడాది క్రితం వ్యూహాత్మక విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న కోర్సులపై సమగ్ర వివరాలు రూపొందించాం. ఈ కోర్సులను పూర్తి స్థాయిలో అందిస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇది తెలంగాణాకు దిశా నిర్ధేశం చేసే విశ్వవిద్యాలయం. – ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ సీటు వచ్చినా చేరలేదు ఎర్త్ వర్సిటీలో సీటు వచ్చినా చేరలేకపోయా. ప్రభుత్వం చెప్పింది ఒకటి. వాస్తవంగా అక్కడ ఉన్న పరిస్థితి వేరు. వర్సిటీలో మౌలిక వసతులు, బోధకులు లేరు. ఈ పరిస్థితుల్లో విద్యా సంవత్సరం వృథా అవుతుందనే ఉద్దేశంతోనే చేరలేదు. – సుమంత వర్మ, విద్యారి్థ, కొత్తగూడెం -
సర్టిఫికెట్ల పరిశ్రమలుగా ఐటీఐలు
వాకాడు : నైపుణ్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఐటీఐలు సర్టిఫికెట్ల పరిశ్రమల్లా మారుతున్నాయి. జిల్లాలో ఏడు ప్రభుత్వ , 30కు పైగా ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 78 ప్రభుత్వ, 418 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా లక్ష మందికిపైగా విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఐటీఐల్లో పిట్టర్, మోటార్ మెకానిక్, ఎలక్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కోపా, వంటి వివిధ ట్రేడుల్లో శిక్షణ అందిస్తారు. అయితే బోధనా సిబ్బంది కొరతతో కోర్సులు మొక్కుబడిగా మారుతున్నాయి. 80 శాతం హాజరు ఉంటేనే విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలి. కానీ కొన్ని ప్రైవేట్ సంస్థల్లో అసలు విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరుకాకున్నా, వారి స్టైఫండ్, కొంత నగదు తీసుకుని హాజరువేసి పాస్ చేస్తున్నారు. విద్యార్థులు ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే సంబంధిత విభాగాల్లో సమర్థవంతంగా పనిచేయగలుగుతారన్న అంశాన్ని అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఐటీఐ సర్టిఫికెట్ పొందిన విద్యార్థులు ఉద్యోగాలకు వెళ్లే సరికి నైపుణ్యాలేమితో వెనకబడిపోతున్నారు. కొరవడిన ఆర్జేడీల పర్యవేక్షణ ఐటీఐలపై ఆర్జేడీల పర్యవేక్షణ కొరవడింది. ఐటీఐల పర్యవేక్షణకు తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నంలో నలుగురు ఆర్జేడీలు ఉన్నారు. ఏటా వీరు ఐటీఐలను రెండు సార్లు పరిశీలించాల్సి ఉంది. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి తగిన పరికరాలు, స్థలం అన్ని ప్రమాణాల మేర ఉన్నాయో లేదో పరిశీలించాలి. సంస్థల్లో విద్యుత్ వాడకాన్ని పరిశీలించినా విద్యార్థులకు శిక్షణ ఏ మేరకు ఇస్తున్నారో తేలిపోతుంది. ఐటీఐల్లో ప్రవేశాలు, రికార్డుల నిర్వాహణ, విద్యార్థుల హాజరు, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, నిబంధనల మేర ప్రాక్టికల్స్ చేయిస్తున్నారా..అన్న అంశాలను ఆర్జేడీలు పరిశీలించాల్సి ఉంది. అయితే వీరు కుర్చీలకే పరిమితమై తనిఖీలు చేసినట్లు సంతకాలు చేస్తుండడంతో అవతవకలకు ఆస్కారం ఏర్పడుతోంది. వాకాడులో బోధనా సిబ్బంది కొరత వాకాడు ఐటీఐలో మూడేళ్లుగా 9 మంది బోధన సిబ్బందికి గానూ ఒక్కరు లేకపోవడం విశేషం. ఇక్కడ 120 సీట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం 80 శాతం మేర సీట్లు బర్తీ అయ్యాయి. బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు చేరేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కొందరు చేరినా తమ టీసీలను వెనక్కితీసుకుని వెళుతున్నారు. బోధనా సిబ్బంది నియామకానికి సం బంధించి ప్రభుత్వానికి తరచూ ప్రతిపాదనలు పంపుతున్నా పట్టించుకోకపోవ డం దారుణం. ఐటీఐలో పరికరాలు, గదులు కొరత లే నప్పటికీ బోధనా సి బ్బంది లేకపోవడం అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది. శిక్షకులు లేక మానుకున్నా వాకాడు ఐటీఐలో ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ ట్రేడ్‌లో చేరా. రెండు నెలలు రోజూ కోట నుంచి చార్జీలు పెట్టుకుని వెళ్లిన కళాశాలలో శిక్షణ ఇచ్చే వారు లేకపోవడంతో ఏమి నేర్చుకోలేదు. శిక్షకుల విషయం అడిగితే రోజూ హాజరు వేసుకుంటే చాలు సర్టిఫికెట్ ఇస్తామన్నారు. దీంతో ఏడాది వృథా అయినా ప్రయోజనం లేదని మానుకున్నాను. - చైతన్య, విద్యార్థి, కోట


