breaking news
shipyard limited
-
ఆంగ్లో ఈస్టర్న్ భారీ నియామకాలు
ముంబై: నౌకల నిర్వహణలో ఉన్న హాంగ్‌కాంగ్ కంపెనీ ఆంగ్లో ఈస్టర్న్ గ్రూప్ భారత్‌లో కొత్తగా 2023 డిసెంబర్ నాటికి 1,000 మంది నావికులను నియమించుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ పరిశ్రమకు శిక్షణ పొందిన మానవ వనరులను అందించే ప్రధాన సరఫరాదార్లలో భారత్ ఒకటి. ఆంగ్లో ఈస్టర్న్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఆంగ్లో ఈస్టర్న్ షిప్ మేనేజ్మెంట్ ఇండియాకు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కత, కొచ్చి, లక్నో, చండీగఢ్‌లో కార్యాలయాలు ఉన్నాయి. నావికా శిక్షణ కేంద్రం సైతం భారత్‌లో కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం దేశంలో కంపెనీకి 21,000 మంది సిబ్బంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 27,000. థర్డ్ పార్టీ షిప్ మేనేజ్మెంట్ కింద సంస్థ ఖాతాలో 600 నౌకలు కొలువుదీరాయి. 300 బల్క్ ట్యాంకర్స్, 200 ట్యాంకర్స్, 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. ప్రపంచంలో నౌకల పరంగా తొలి స్థానంలో, సిబ్బంది పరంగా రెండవ స్థానంలో గ్రూప్ నిలిచిందని ఆంగ్లో ఈస్టర్న్ షిప్ మేనేజ్మెంట్ ఇండియా ఎండీ మనీశ్ ప్రధాన్ తెలిపారు. -
ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ : 25 వయసు: 25 ఏళ్లు దాటకూడదు. విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఫైనాన్స్, నేవల్ ఆర్కిటెక్ట్, ఐటీ, హెచ్ఆర్. అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జనవరి 20 వెబ్సైట్: www.cochinshipyard.com ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ తాత్కాలిక పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ట్రైనింగ్ డిపార్ట్మెంట్: మేనేజర్ డిప్యూటీ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ - డీజీసీఏ లైజన్ ట్రైనింగ్ కో ఆర్డినేటర్ క్లరికల్/సపోర్ట్ స్టాఫ్ -ట్రైనింగ్ ఫ్లైట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ ఆపరేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ - ఇన్- ఫ్లైట్ సర్వీసెస్ మేనేజర్ - షెడ్యూలింగ్ మేనేజర్- ఫ్లైట్ ఆపరేషన్స్ అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. www.airindiaexpress.in హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల నియామకం కోసం దరఖాస్తులు కోరుతోంది. రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ విభాగాలు: మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్. అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎంపిక: గేట్ 2014 స్కోరు ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 2 వెబ్సైట్: www.hindustanpetroleum.com/