breaking news
Shilpa Layout Flyover
-
హైదరాబాదీలకు అందుబాటులో మరో ఫ్లైఓవర్
సాక్షి,హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్ఆర్) నుంచి కొండాపూర్ వరకు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ప్రయాణించే వారికి సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. శిల్పా లేఔట్ రెండో ఫేజ్ ఫ్లైఓవర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. దీంతో నగర ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వెళ్లే వారికి ఎంతో సౌలభ్యం కలగనుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. ఇదీ ప్రాజెక్ట్ ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) కింద రూ.178 కోట్లతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఆరు లేన్లతో ఉన్న దీని పొడవు 1.2 కిలోమీటర్లు. వెడల్పు 24 మీటర్లు. ఇప్పటికే గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్ 2గా ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం కలిసి వస్తుంది. త్వరితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఎస్సార్డీపీ (SRDP) కింద నిర్మించిన ఫ్లై ఓవర్లలో ఇది 23వది. ఈ ఫ్లై ఓవర్‌ను త్వరితగతిన పూర్తిచేసేందుకు శ్రద్ధ చూపుతున్న కమిషనర్ కర్ణన్ దీంతోపాటు ఫలక్‌నుమా, శాస్త్రిపురంల ఆర్ఓబీలు సైతం త్వరగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను కోరారు. ఈ రెండు ఆర్‌ఓబీలతో ఎస్సార్డీపీ కింద చేపట్టిన పనులు 39 పూర్తవుతాయి. హై సిటీగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాజెక్టుల పనులను హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) కింద చేస్తున్నారు. దీని ద్వారా రూ. 7032 కోట్ల వ్యయంతో కొత్తగా 58 పనులు చేపట్టనున్నారు. అందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, 4 ఆర్ఓబీలు, 3 ఆర్యూబీలతోపాటు పది మార్గాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులున్నాయి. వీటిల్లో కొన్ని పనుల్ని వచ్చే నెలలో చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ (GHMC) పేర్కొంది.చదవండి: ఫతేనగర్ వంతెన మెట్ల కూల్చివేత -
శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్.. 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు
సాక్షి, గచ్చిబౌలి: శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి గచచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుకు రయ్.. రయ్‌మని వెళ్లవచ్చు. శిల్పా లేవుట్‌లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్‌తో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తక్కువ సమయం పడుతుంది. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను నెలకొల్పడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లైఓవర్లతో వాహనదారులకు ఎంతో ఊరట లభిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డీపీ నిర్మించిన 17వ ఫ్లైఓవర్‌గా శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఏర్పాట్లు ఇలా.. ♦ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగగానే, ఐకియా వెనుక రోడ్డులో శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్‌కు చేరుకోవాలి. ♦ ఫ్లై ఓవర్ ఎక్కిన వాహనాలు ఓల్డ్ ముంబై జాతీయ రహదారిపై దిగొచ్చు. దిగువ ర్యాంప్ ద్వారా ఔటర్‌పై కూడా దిగవచ్చు. ♦ ఔటర్ నుంచి వచ్చే వాహనాలు ఎగువ ర్యాంప్ ద్వారా నేరుగా ఫ్లై ఓవర్ పైకి వెళతాయి. గచ్చిబౌలి జంక్షన్‌లోనూ ఫ్లై ఓవర్ పైకి వాహనాలు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. ♦ ఫ్లై ఓవర్ ముగియగానే, లెఫ్ట్ తీసుకొని డెలాయిట్ రోడ్డులో మైండ్ స్పేస్ ఫ్లైఓవర్‌పైకి చేరుకోవచ్చు. సాఫీగా ప్రయాణం.. సికింద్రాబాద్, కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల నుంచి వాహనాలు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి ప్రసాద్ ఐ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45కు వెళతాయి. ♦ అక్కడ కేబుల్ బ్రిడ్జి నుంచి నేరుగా కోహినూర్ హోటల్ , మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. ఐకియా వెనుక నుంచి వెళ్లి రైట్ టర్న్ తీసుకుంటే శిల్ప లేఅవుట్లోని ఫ్లై ఓవర్ పై నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవచ్చు. ♦ జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనదారులు శంషాబాద్ విమానాశ్రయం, బెంగళూర్ జాతీయ రహదారితో పాటు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట్, శంకర్పల్లి, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్చెరు వైపు వెళ్లవచ్చు. ♦ ఫ్లైఓవర్ నుంచి ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారికి దిగే వెసులుబాటు కల్పించారు. దీంతో రాయదుర్గం, మెహిదీపట్నం వైపు వెళ్లేందుకు వీలుంటుంది. ♦ శంషాబాద్ విమానాశ్రయం, పటాన్చెరు, కోకాపేట్, ఫ్లైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి వాహనదారులు నేరుగా శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ ద్వారా ఇట్టే జూబ్లీహిల్స్ చేరుకోవచ్చు. జంక్షన్లపై తగ్గనున్న ఒత్తిడి ♦ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు గచి్చ»ౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్ స్పేస్ జంక్షన్‌కు వెళుతుంటాయి. లేదా గచి్చ»ౌలి జంక్షన్ నుంచి అంజయ్యనగర్‌లో రైట్ టర్న్ తీసుకొని రాంకీ రోడ్డులో వెళ్లి మైండ్ స్పేస్ ప్లై ఓవర్‌కు చేరుకునేవి. ♦ శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో అటు బయోడైవర్సిటీ, ఇటు అంజయ్యనగర్ వైపు వెళ్లాల్సిన పని లేదు. ♦ దీంతో గచ్చిబౌలి జంక్షన్లో వాహనాల తాకిడి తగ్గనుంది. అంతే కాకుండా బయోడైవర్సిటీ జంక్షన్‌లోనూ తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ వ్యయం రూ.466 కోట్లు ►పొడవు 2,810 మీటర్లు (2.81 కిలోమీటర్లు) ►లైన్లు నాలుగు లేన్ల బై డైవర్షనల్ ఫ్లై ఓవర్ ►మెయిన్ ఫ్లైఓవర్ 956 మీటర్లు ►ఎగువ ర్యాంప్ 456.64 మీటర్లు ►దిగువ ర్యాంప్ 399.95 మీటర్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ట్రాఫిక్ చిక్కులకు చెక్.. శిల్పా లేఔట్ ఫ్లై ఓవర్ నేడు ప్రారంభం
-
Hyderabad: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. ఐటీ కారిడార్‌లో ఇక రయ్ రయ్!
సాక్షి, హైదరాబాద్: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ చిక్కులు తప్పించడంతో పాటు జూబ్లీహిల్స్ మీదుగా ఓఆర్ఆర్ వెళ్లేందుకు ఎంతో అనువైన శిల్పా లే ఔట్ ఫ్లై ఓవర్‌ను శుక్రవారం మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 45 నుంచి ఐకియా మీదుగా ఈ కొత్త ఫ్లై ఓవర్ ద్వారా నేరుగా ఓఆర్ఆర్కు.. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికీ ఈజీగా చేరుకోవచ్చు. దీనిద్వారా గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి. గచ్చిబౌలి జంక్షన్లో రద్దీ సమయంలో పదివేల వాహనాలు (పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్ నాలెడ్జి సెంటర్(హెచ్‌కేసీ), పరిసరాల్లోని ఐటీ కంపెనీలకు ఎంతో సదుపాయం. హైటెక్ సిటీ, హెచ్‌కేసీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల మధ్య మంచి కనెక్టివిటీతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు (పంజగుట్ట), ఔటర్ రింగ్‌రోడ్డుకు(గచ్చిబౌలి) కూడా ఇది మంచి కనెక్టివిటీ అని అధికారులు తెలిపారు. చదవండి: హైదరాబాద్‌లో లగ్జరీ వాహనాల క్రేజ్.. రోడ్లపై రూ.కోటి నుంచి రూ.7 కోట్ల ఖరీదైన కార్లు గడచిన ఆరేళ్లలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా జీహెచ్ఎంసీ పూర్తిచేసిన 17వ ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు వ్యయం.. భూసేకరణ, టీడీఆర్‌లతో సహా రూ.466 కోట్లు. ఫ్లై ఓవర్ పొడవు 2,810 మీటర్లు. నాలుగు లేన్లు.. రెండువైపులా ప్రయాణించవచ్చు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఎయిర్‌పోర్ట్‌కు సాఫీగా జర్నీ
సాక్షి, హైదరాబాద్: శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయని, తుది మెరుగులు దిద్ది ఈ నెలాఖరులో ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చాక ఐటీ ప్రాంతానికి రాకపోకలు మరింత సులభం కానున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, ఔటర్ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకపోగా, కొత్త ఫ్లై ఓవర్ అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సైతం సాఫీ ప్రయాణం సాధ్యం కానుందని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: కదిలే ఇల్లు! ధర తక్కువ...ఎక్కడికైనా తీసుకుపోవచ్చు) దీనివల్ల జూబ్లీహిల్స్, పంజగుట్టల నుంచి గచ్చిబౌలి మీదుగా పటాన్చెరు కోకాపేట్, నార్సింగి, అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వెళ్లేందుకు.. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాఫీ ప్రయాణం సాధ్యం కానుందని పేర్కొన్నారు.