breaking news
Shelley
-
World Athletics Championships 2022: షెల్లీ... జగజ్జేత మళ్లీ
యుజీన్ (అమెరికా): మూడు పదుల వయసు దాటినా... ఒక మగబిడ్డకు తల్లి అయినా... విజయకాంక్ష ఉంటే అత్యున్నత వేదికపై అదరగొట్టడం సుసాధ్యమేనని జమైకా మేటి అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ నిరూపించింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 35 ఏళ్ల షెల్లీ ఆన్ ఫ్రేజర్ ఎవరికీ సాధ్యంకాని ఘనతను నమోదు చేసింది. మహిళల 100 మీటర్ల విభాగంలో షెల్లీ రికార్డుస్థాయిలో ఐదోసారి పసిడి పతకం సొంతం చేసుకుంది. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఒకే ఈవెంట్లో ఐదు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి అథ్లెట్‌గా షెల్లీ కొత్త చరిత్ర లిఖించింది. సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల ఫైనల్లో షెల్లీ 10.67 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి జగజ్జేతగా నిలిచింది. జమైకాకే చెందిన షెరికా జాక్సన్ (10.73 సెకన్లు) రజతం, ఎలైని థాంప్సన్ హెరా (10.81 సెకన్లు) కాంస్యం గెలుపొందారు. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి మహిళల 100 మీటర్ల విభాగంలో ఒకే దేశానికి చెందిన ముగ్గురు అథ్లెట్స్ ఖాతాలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు చేరాయి. గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల విభాగంలోనూ జమైకా క్లీన్‌స్వీప్ చేసింది. ‘టోక్యో’లో షెరికా స్వర్ణం, షెల్లీ రజతం, ఎలైని థాంప్సన్ కాంస్యం సాధించారు. ►5: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 100 మీటర్ల విభాగంలో షెల్లీ నెగ్గిన స్వర్ణాలు. 2009 (బెర్లిన్), 2013 (మాస్కో), 2015 (బీజింగ్), 2019 (దోహా) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ షెల్లీకి పసిడి పతకాలు లభించాయి. ►12: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వివిధ విభాగాల్లో షెల్లీ నెగ్గిన మొత్తం పతకాలు. అత్యధిక పతకాలు నెగ్గిన అథ్లెట్స్ జాబితాలో షెల్లీ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అలీసన్ ఫెలిక్స్ (అమెరికా; 19 పతకాలు), మెర్లీన్ ఒట్టి (జమైకా; 14 పతకాలు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
తుఫానులో పెళ్లి.. ముద్దు సీన్ అదుర్స్
టెక్సాస్: పెళ్లి అంటే ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఓ పెద్ద వర్షం వచ్చి వెళ్లినట్లుంటుంది హడావుడి. సాధారణంగా పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లకయితే ఇరు కుటుంబ పెద్దలు మాత్రమే కష్టపడుతూ హైరానాపడుతూ ఉంటారు. ఇక పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు మాత్రం కొంత ఉత్సాహంతో మిత్రులతో ఆ విషయాన్ని పంచుకుంటూ సందడిగా కనిపిస్తారు. అదే పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అయితే మాత్రం పెద్దలకంటే రెట్టింపు ఉత్సాహంతో ఆ జంట పరుగులు పెడుతుంటారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన షెల్లీ, క్రిస్ హాలాండ్ అనే జంటది కూడా ఈ కోవకు చెందిన వివాహమే. సెప్టెంబర్ 2న జరగాల్సిన వారి వివాహం కోసం దాదాపు ఆరునెలలు ప్లాన్ చేసుకున్నారు. ఒక్కొక్కటి శ్రద్ధగా సమకూర్చుకొని రెడీ అయిపోయారు. కానీ, వారి ఆశలు అడియాశాలయ్యాయి. అంగరంగ వైభవంగా, అతిధుల మధ్య జరుపుకోవాల్సిన వివాహం ఓ నలుగురికే పరిమితమైంది. ఓ విందు భోజనం లేదు.. ఓ ఆటపాట లేదు. కానీ, వారు పెళ్లి చేసుకున్న విధానం మాత్రం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. అరకొరగా జరిగిన ఆ వివాహానికి సంబంధించిన ఓ ఫొటోను ఆ జంట ఫేస్బుక్లో పంచుకోగా దాదాపు 20వేల షేర్లు, నాలుగు లక్షలమంది ప్రతిస్పందనలు వచ్చాయి. ఇంతకీ వారి పెళ్లికి ఏ అడ్డంకి ఎదురైందనుకుంటున్నారా.. హార్వీ. మొన్నటికి మొన్న వచ్చిన పెను తుఫాను అమెరికాలో పలు నగరాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. దీని ప్రభావం షెల్లీ దంపతుల వివాహం పై పడింది. 'నేను, నా భర్త ఆరు నెలలుగా చేసుకున్న ప్రణాళిక మొత్తం తుఫాను హార్వీ వల్ల నాశనమై పోయింది. మా వివాహ కేకు, వివాహ చోటు, క్యాటరింగ్, బంధువులు, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా నష్టం జరిగింది' అంటూ హాలాండ్ తన ఫేస్బుక్లో పేర్కొంటూ ఓ పెళ్లి ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో దాదాపు మొకాళ్ల వరకు నీళ్లు రాగా పెళ్లి కొడుకు షెల్లీ నవ వధువు అయిన క్రిస్ హాలండ్‌ను పైకి ఎత్తుకోగా ఇద్దరు గాఢ చుంబనంలో మునిగిపోయారు. ఎంత ఉధృతంగా ఎన్ని హార్వీలు వచ్చినా మిమ్మల్ని మాత్రం విడదీయలేవని చెబుతున్నామంటూ ఈ ఫొటో చూసిన వారంతా స్పందించారు.