breaking news
sheikh farid
-
రిజర్వేషన్లు రద్దు చేసే మోడీకి పవన్ మద్దతా ?
తెనాలిఅర్బన్, న్యూస్‌లైన్: బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కులమతాల ప్రాతిపదికన అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటిస్తుంటే, ఆ పార్టీ తరఫున ప్రధాని రేసులో ఉన్న నరేంద్రమోడీకి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మద్దతు పలకటమేమిటని ఇమానే మజ్లిస్ యువజన కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వైఖరిని నిరసిస్తూ శివాజీచౌక్‌లో ఆయన ఫ్యాన్స్ మైనారిటీ విభాగం యువకులతో కలిసి శుక్రవారం నిరసన ప్రదర్శన చేశారు. ‘మోడీ హఠావో-దేశ్‌కు బచావో’ ‘పవన్ హఠావో-మైనారిటీస్ బచావో’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఫరీద్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా పవన్ కల్యాణ్‌పై పెంచుకున్న అభిమానాన్ని, ఆయన మోడీకి మద్దతు తెలపడంతో 15 నిముషాల్లో హరించిపోయిందన్నారు. పవన్ వ్యాఖ్యలు ముస్లిం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు. మోడీకి పవన్ ఎందుకు మద్దతు పలుకుతున్నారో కూడా స్పష్టత లేదని పేర్కొన్నారు. గోద్రా అల్లర్లపై పెదవి విప్పని పవన్, ఇప్పుడు మోడీ నాయకత్వాన్ని ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇమానే మజ్లిస్ యువజన కమిటీ గౌరవాధ్యక్షుడు షేక్ నశీం, రఫీ, మునీర్, ఖలీల్, సుభాని, నాగూర్, సైదా, భేగ్, ఖాదిర్, కరిముల్లా, అస్లం తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిపై స్కూల్ నిర్వాహకుడి ఘాతుకం
కోయంబత్తూరు: క్రమశిక్షణ పేరిట విద్యార్థిపై ఓ స్కూల్ నిర్వాహకుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు అతడు తగిన మూల్యం చెల్లించుకోవాలసి వచ్చింది. విద్యార్ధుల పట్ల ఉపాధ్యాయులు, నిర్వాహకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో పాఠశాలకు వెళ్లాలంటేనే విద్యార్ధులు భయంతో వణికిపోతున్నారు. తాజాగా తమిళనాడులో కోయంబత్తూరులో పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడనే కారణంతో ఓ పాఠశాల నిర్వాహకుడు విద్యార్థిని ఇస్త్రీపెట్టితో కాల్చిన వైనం స్థానికంగా కలంకలం సృష్టించింది. విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూలు నిర్వాహకుడి తీరుపై ఆగ్రహించారు. అ నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు స్కూల్ నిర్వాహకుడు షేక్ ఫరీద్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.