breaking news
Sharp Sword
-
స్టీల్ కత్తి కంటే 3 రెట్లు పదునైందట! దేనితో తయారు చేశారో తెలుసా..
చెక్క కత్తి (ఓన్లీ మేడ్ విత్ వుడ్)... దీనితో మాంసం, కూరగాయలు.. ఇంకా గట్టి పదార్థాలు కూడా కట్ చేయొచ్చు. చెక్కతో తయారు చేసిన కత్తేమిటీ, గట్టి పదార్థాలను కట్ చేయడమేంటి..? మీ అనుమానం ఇదేనా! నిజంగానే చెక్కతో తయారు చేసిన కత్తి అండీ!! అచ్చం స్టెయిన్లెస్ స్టీల్ కత్తి మాదిరి. నిజం చెప్పాలంటే.. స్టీల్ కత్తి కంటే కూడా మూడు రెట్లు పదునైనది .. యూనిర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఈ విధమైన కత్తిని తయారు చేసింది. ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు మామూలు కలపను గట్టిపడే ప్రక్రియను వినియోగించి ఈ కత్తిని తయారు చేశారట. దీంతో సాధారణ చెక్క కంటే 23 రెట్లు బలంగా తయారైంది. ఇది పర్యావరణానికి కూడా మంచిదట. ఈ చెక్క కత్తి విశేషాలు ప్రొఫెసర్ టెంగ్ లీ మాటల్లో.. చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే.. ‘స్టీమింగ్ లేదా కంప్రెషన్ వంటి వుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ శతాబ్దాలుగా ఆచరనలో ఉన్నాయి. ఐతే కొంచెం ఒత్తిడి తగలగానే విరిగిపోతాయి. ఐతే సాధారణంగా ఒక చెట్టులో 40-50 శాతం నారతో కలప ఏర్పడుతుంది. మిగిలిన భాగమంతా హెమిసెల్యులోజ్, లిగ్నిన్ అని పిలువబడే బైండర్ ఉంటుంది. అది నార బలాన్ని తగ్గిస్తుంది. నార నిర్మాణాన్ని దెబ్బతీయకుండా చెక్కలో బలహీనమైన భాగాలను తొలగించడం ద్వారా చెక్క కత్తిని అభివృద్ధి చేశాం. ఈ విధంగా తయారు చేసిన కత్తి, తేమ తగిలిన తర్వాత కూడా దాని పదును చెదరకుండా ఉండేందుకు మినరల్ ఆయిల్‌తో పూత పూశాము. ప్రక్రియ చెక్క తుప్పులను ఉక్కులాగా, పదునుగా చేయగలదని, తుప్పు నిరోధకతను కలిగి ఉంటుందని’ ఆయన పేర్కొన్నారు. వంటగదిలో కట్టింగ్ బోర్డ్, చాప్ స్టిక్‌లు, రోలింగ్ పిన్ వంటి చాలా కాలంగా వినియోగించే చెక్క ముక్కలను కూడా ఈ ప్రక్రియ ద్వారా పదునుపెట్టి కత్తులుగా మార్చొచ్చట. అసలు ఇంతవరకూ ఎప్పుడైనా ఊహించామా చెక్కతో తయారు చేసిన కత్తులు కూడా ఉంటాయని.. ఈ చెక్క కత్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి.. -
ఆకాశంలోకి దూసుకెళ్లిన చైనా 'లిజియన్'
చైనా మానవ రహిత యుద్ద విమానం 'లిజియన్'ను అభివృద్ధి చేసింది. ఆ లిజియన్ను గురువారం ఇక్కడ విజయవంతంగా ప్రయోగించింది. లిజియన్ అంటే చైనీయుల భాషలో పదునైన కత్తి అని అర్థం.దాంతో లిజియన్ ఆకాశంలో కత్తిలా దూసుకుపోయింది. దీంతో మానవరహిత యుద్దవిమానాన్ని ఆసియా ఖండంలో తయారు చేసిన మొట్టమొదటి దేశం చైనాగా ఖ్యాతిగాంచింది. చైనా తూర్పు, పశ్చిమ ప్రాంతంలోని సముద్రంలో జరగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు లిజియన్ ఉపకరిస్తుందని, అలాగే చైనాకు పొరుగుదేశాల మధ్య నెలకొన్న ప్రాదేశిక సరిహద్దు వివాదాలపై బీజింగ్ నాయకులకు లిజియన్ ఒక చక్కటి సాధనమని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చెందిన మాజీ జనరల్ వెల్లడించారని హాంకాంగ్‌కు చెందిన వార్తా పత్రిక వెల్లడించింది. చైనా దేశంలోని అధునిక సైనిక అద్బుత పాటవానికి లిజియన్ ప్రతీక అని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మేజర్ జనరల్ ఝు గుంగ్యు వెల్లడించారు. అభివృద్ధితో ముందుకు దూసుకువెళ్తున్న దేశాల అధునిక విజ్ఞానాన్ని చైనా అందిపుచ్చుకుందనటానికి ఉదాహరణ లిజియన్ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మానవ రహిత యద్ధ విమానాలు యూఎస్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు రూపొందించాయని ఆయన గుర్తు చేశారు. లిజియన్ యూఎస్ మిలటరీలోని ఎక్స్-78బి ద్రోణ్‌ను పోలి ఉంటుందని తెలిపారు.