breaking news
seven year old boy death
-
విషాదం: యమపాశమైన చున్నీ
బంజారాహిల్స్(హైదరాబాద్): సరదాగా ఊయల ఊగడానికి మంచానికి కట్టిన చున్నీ ఓ బాలుడి పాలిట యమపాశమైంది. పనిమీద బయటకు వెళ్తూ బాలుడిని ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్లిన తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. చున్నీ మెడకు చుట్టుకొని అనుమానాస్పద స్థితిలో ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ మండలం ఎల్లసఖి గ్రామానికి చెందిన అంజలి, నర్సింహ దంపతులు టైలర్‌గా పని చేస్తూ యూసుఫ్‌గూడ యాదగిరినగర్ చర్చి లేన్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మల్లికార్జున్(7) మూడో తరగతి చదువుతున్నాడు. నిత్యం సరదాగా అల్లరిచేసే మల్లికార్జున్ ఇంట్లో కంటే ఎక్కువగా బయటికి పరుగులు తీస్తుంటాడు. (చదవండి: ప్రియుడి మోజులో.. సెల్‌ఫోన్ చార్జింగ్ వైరుతో..) గురువారం ఉదయం 11 గంటలకు అంజలి, నర్సింహ దంపతులు ఆస్పత్రికి వెళ్లే క్రమంలో కొడుకులిద్దరినీ ఇంట్లో ఉంచి బయటి నుంచి తాళం వేసి వెళ్లారు. అన్నం తిన్న తరువాత చిన్నకొడుకు నిద్రించాడు. మల్లికార్జున్ మాత్రం మంచానికి, కిటికీ ఊచలకు చున్నీని కట్టి ఊయల ఊగసాగాడు. ప్రమాదవశాత్తు మంచం పైనుంచి జారడంతో చున్నీ మెడకు చుట్టుకుంది. నిద్రిస్తున్న సోదరుడు లేచి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. బయటి నుంచి తాళం వేసి ఉండటంతో కిటికీకి చున్నీతో వేలాడుతున్న మల్లికార్జున్‌ను దింపాల్సిందిగా తమ్ముడికి సైగలు చేశారు. దీంతో మెడకు చుట్టుకున్న చున్నీని విప్పగా మల్లికార్జున్ కిందకు జారిపడ్డాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని బాలుడిని సెంచరీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ఇదిలాఉండగా తన కొడుకు ఐరన్ పైప్‌కు చున్నీతో మెడకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెళ్లి సందడిలో మృత్యుఘోష) -
స్నేహితులతో కలిసి బిర్యానీ తింటుంటే దుర్ఘటన
న్యూఢిల్లీ: స్నేహితులతో కలిసి బిర్యానీ తింటున్న ఏడేళ్ల బాలుడు దురదృష్టవశాత్తు మృత్యువాత పడ్డాడు. ప్రహరీ గోడ మీద కూలి చనిపోయాడు. సివిక్ కార్పొరేషన్ చర్య ఈ దుర్ఘటనకు కారణమైంది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడగా వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఢిల్లీలోని జందేవాలన్ కు సమీపంలోగల ఫైజే రోడ్డులో ఎంసీడీ కాంప్లెక్స్ ఉంది. దీనికి ప్రహరీ నిర్మిస్తున్నారు. అదే సమయంలో సివిక్ కార్పొరేషన్ అధికారులు ఆ గోడకు అడ్డుగా ఉందని ఒక చెట్టును నరికించడం మొదలుపెట్టారు. దీంతో ఆ కొమ్మలు నరికే క్రమంలో కొన్ని గోడపై పడి అది కాస్త అక్కడే ఉన్న షాపులో బిర్యానీ తింటున్నవారిపై పడటంతో ఏడేళ్ల బాలుడు చనిపోయాడు. మిగితావారు గాయపడ్డారు. మరో విషాదం ఏమిటంటే ఆ బాలుడు తండ్రి అదే గోడ నిర్మాణ పనులకు వచ్చాడు. చనిపోయిన తన కుమారుడిని చూసి తీవ్రంగా విలపించాడు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.