breaking news
Service apartments
-
సర్వీస్ అపార్ట్ మెంట్... గలీజ్ కల్చర్.. అర్ధరాత్రి పెద్ద శబ్దాలు, ఫుల్ మందు
-
హోటలే ఇల్లు.. సిటీలో నయా ట్రెండ్!
నగరంలో ఒకటి రెండు రోజులు ఉండాలంటే హోటల్ గదులు, నెలల తరబడి ఉండాలంటే ఇల్లు అద్దెకు తీసుకునే ధోరణికి భిన్నంగా.. రోజులు, నెలల తరబడి ఉండడానికి కూడా స్టార్ హోటల్‌కే ఓటేసే ధోరణి పెరిగింది. విభిన్న రంగాల వారు పనుల నిమిత్తం నగరంలో తాత్కాలిక బస కావాలని ఆశించడం అంతకంతకూ పెరుగుతుండడంతో స్టార్ హోటళ్లలో అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఊపందుకుంది. – సాక్షి, సిటీబ్యూరోహోటల్ గదులను విస్తరించడం కొత్త విషయం కాకపోవచ్చు కానీ గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ తాజాగా మరో 42 అపార్ట్మెంట్లను అందుబాటులోకి తీసుకురావడం ఇప్పుడు చెప్పుకోదగ్గ విశేషం. దీంతో కలిపి ఆ హోటల్లో మొత్తం 98 అపార్ట్మెంట్లకు చేరడం గమనార్హం. మొత్తం 228 సాధారణ గదులు ఉంటే దాదాపు అందులో సగం అపార్ట్మెంట్లు ఉండడం గమనార్హం. ప్రస్తుతం నగరంలో ఊపుమీదున్న హోటల్–అపార్ట్మెంట్ ట్రెండ్‌కి ఇదో చిన్న ఉదాహరణ. పన్నెండేళ్ల క్రితమే.. దాదాపు 12 ఏళ్ల క్రితం బంజారాహిల్స్‌లోని స్టార్ హోటల్ పార్క్ హయత్ సర్వీస్ అపార్ట్మెంట్లకు శ్రీకారం చుట్టింది. దాదాపు ఇంటిని తలపించే సింగిల్, డబుల్ బెడ్ గదులతో ఉండే ఈ అపార్ట్మెంట్లు అప్పట్లో కేవలం కార్పొరేట్ ఉద్యోగుల అవసరాలను మాత్రమే తీరుస్తూ ఉండేవి. రానురానూ విభిన్న రంగాల నుంచీ ఈ తరహా హోటల్ అవసరాలకు డిమాండ్ పెరిగింది. ఐటీతో పాటు డేటా సెంటర్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, సినిమా, టీవీ తదితర రంగాల నుంచి వీటికి ఆదరణ పెరిగింది. దీంతో ఐదారేళ్లుగా నగరంలో నెలకొల్పే ప్రతీ స్టార్ హోటల్లోనూ ఈ తరహా అపార్ట్మెంట్లు తప్పనిసరిగా మారాయి. ఏమిటీ సర్వీస్డ్ అపార్ట్మెంట్లు? ఇవి పేరుకు తగ్గట్టుగా ఉండే సాదా సీదా అపార్ట్మెంట్లు కాదు. వాషింగ్ మెషీన్, డిష్వాషర్, తాగునీరు, కిచెన్ తదితర రోజువారీ జీవనానికి అవసరమైన సౌకర్యాలతో పాటు అవసరాన్ని బట్టి చెఫ్స్, హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండటమే వీటి ప్రత్యేకత. హోటల్ సరీ్వస్‌తో పాటు ఇంటి సౌకర్యాలు కూడా కలగలిపి ఉంటాయన్నమాట. ఇటీవల ఓ స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన కొత్త అపార్ట్మెంట్లలో 35 చదరపు మీటర్ల స్టూడియో, 61 చదరపు మీటర్ల వన్ బెడ్రూమ్, 88 చదరపు మీటర్ల టు బెడ్రూమ్ ఉన్నాయి. అంతేకాకుండా గార్డెన్ వ్యూ, సిటీ వ్యూ, ఆర్ఆర్ఆర్ వ్యూస్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన పోషకులు వీరే.. నగరంలో ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు, కొత్తగా కంపెనీలో చేరే ఉద్యోగులు, విదేశీ కంపెనీల ప్రాజెక్టులపై నెలల తరబడి పనిచేసే నిపుణులు, జీసీసీ ఉద్యోగులు, సినిమా అనుబంధ రంగాలకు పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు, కొత్తగా హైదరాబాద్‌కు బదిలీపై శాశ్వత ఇల్లు చూసుకునే వరకు ఉన్నతోద్యోగులు.. వీటికి ప్రధాన పోషకులుగా మారారు.ఖరీదైనా.. కావాల్సిందే.. ఆయా హోటళ్లలో వన్ బెడ్రూం అపార్ట్మెంట్ 90 చదరపు మీటర్లు, టు బెడ్రూం టెర్రస్ అపార్ట్మెంట్ 145 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్ ప్లాట్‌ఫాంలో తేదీ, గది రకాన్ని బట్టి స్టూడియోలకు రోజుకు సుమారు 10,000 నుంచి రూ.16,000, వన్ బెడ్రూం అపార్ట్మెంట్లకు రూ 12,000 నుంచి రూ.20,000 ధరల్లో ఉన్నాయి. పన్నులు, భోజనం, ప్రత్యేక ఆఫర్లు, సీజన్, ఎన్ని రోజులు/నెలలు బస చేస్తారు? అనే వాటి ఆధారంగా ప్యాకేజీల ధరలు మారుతాయి. ఏదేమైనా నగరంలో ‘హోటల్.. హోమ్’ అనే కొత్త సంస్కృతి పుట్టుకొస్తోందని చెప్పవచ్చు. -
రూ.200 కోట్లతో ఓక్వుడ్ హోటల్!
శంషాబాద్‌లో ఏర్పాటు; వచ్చే ఏడాది పనులు షురూ... - రెండేళ్లలో దేశంలో మరో 4 ప్రాజెక్ట్‌లు - ఓక్వుడ్ డెరైక్టర్ మిచెల్ ప్రైజ్ - లగ్జరీ సర్వీస్ అపార్ట్మెంట్ ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సర్వీస్ అపార్ట్మెంట్లు, కార్పొరేట్ హౌసింగ్ రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఓక్వుడ్.. హైదరాబాద్‌లో తన తొలి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. లాస్ ఏంజిల్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఓక్వుడ్... రాష్ట్రానికి చెందిన కపిల్ గ్రూప్‌తో కలిసి ఐటీ హబ్‌గా పేరొందిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ‘ఓక్వుడ్ రెసిడెన్సీ కపిల్ హైదరాబాద్’ పేరిట సర్వీస్ అపార్ట్‌మెంట్‌ను మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఓక్వుడ్ దక్షిణ, ఆగ్నేయాసియా డెరైక్టర్ మిచెల్ ప్రైజ్ విలేకరులతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే... - హైదరాబాద్కొచ్చే అంతర్జాతీయ విమానాలు చాలా వరకు రాత్రిళ్లే ఇక్కడికి చేరుకుంటాయి. ఆ సమయంలో లగ్జరీ సదుపాయాలతో పాటు భద్రత కలిగిన అపార్ట్మెంట్ దొరకడం కష్టం. ఒకవేళ ఉన్నా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల్లోకి వెళ్లాలి. అంటే సిటీలోకి వెళ్లాలి. మళ్లీ ఉదయం మీటింగ్‌లకు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్య. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపించేదే ‘ఓక్వుడ్ రెసిడెన్సీ కపిల్ హైదరాబాద్’. వెస్ట్రన్ స్టయిల్ కిచెన్స్, టీవీ, ఏసీ, స్విమ్మింగ్ పూల్, జిమ్, లాంజ్, బార్ అండ్ రెస్టారెంట్ వంటి 7 స్టార్ హోటల్స్‌లో ఉండే ప్రతి ఒక్క ఆధునిక వసతులూ ఇందులో పొందవచ్చు. - ఇందులో మొత్తం 158 లగ్జరీ రెసిడెన్సీ యూనిట్లుంటాయి. యూనిట్ల విస్తీర్ణాలు 380 చదరపు అడుగుల నుంచి 1,069 చదరపు అడుగుల వరకూ ఉన్నాయి. ఇక ఒక రాత్రి బస చేయడానికి రూ.5వేల నుంచి 18 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. గ్రేడ్-ఏ కస్టమర్లకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పటివరకు ఓక్వుడ్ సంస్థ దేశంలో బెంగళూరు, ముంబై, పుణె నగరాల్లో 5 ప్రాజెక్ట్‌లను నిర్మించింది. హైదరాబాద్‌లోని ప్రాజెక్ట్ 6వది. ఆసియాలో 28వ ప్రాజెక్ట్. - రూ.200 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో శంషాబాద్‌లో ఓక్వుడ్ కపిల్ అంతర్జాతీయ హోటల్‌ను నిర్మించనున్నాం. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వచ్చే ఏడాది నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. రెండేళ్లలో దేశంలో మరో 4 ప్రాజెక్ట్‌లు నిర్మిస్తాం. అయితే వీటిని ఇప్పటికే ఉన్న నగరాల్లో కాకుండా.. ఢిల్లీ, గుర్గావ్, చెన్నై నగరాల్లో నిర్మిస్తాం. 2017లో ముంబైలో మరో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం. - ఇప్పటివరకు ప్రీమియర్, రెసిడెన్సీ, అపార్ట్మెంట్ అనే మూడు రకాల బ్రాండ్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. కానీ, 2016లో కొత్తగా మరో బ్రాండ్‌తో కొనుగోలుదారుల ముందుకురానున్నాం. ఈ తొలి ప్రాజెక్ట్‌ను సింగపూర్‌లో నిర్మించనున్నాం. త్వరలో ఇండియాలో కూడా కొత్త బ్రాండ్‌తో ప్రాజెక్ట్‌లను నిర్మిస్తాం.


