breaking news
Selling the land
-
పత్రాలు మార్చి..జనాన్ని ఏమార్చి..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్నాళ్లుగా సాగుతున్న భూమాఫియా అక్రమాలకు ఇదో ఉదాహరణ. అమాయకులు, స్థానికంగా లేనివారి, వివాదాలున్న స్థలాలను గుర్తించడం.. నకిలీ ఆధార్‌కార్డులు, తప్పుడు వ్యక్తులను చూపించి, ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు చేయిస్తూ.. స్థలాలను కాజేయడం విచ్చలవిడిగా సాగుతోంది. కొందరు రియల్టర్లు, రాజకీయ నాయకులు, అడ్వొకేట్లు, అధికారులు కుమ్మక్కై ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. బాధితులు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా లాభం ఉండటంలేదని వాపోతున్నారు. భూములపై ఆశలు వదిలేసుకోవాలని, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో భూమాఫియా ఆగడాలు మరింతగా పెరుగుతున్నాయి. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో నకిలీ ఆధార్‌కార్డులు, వ్యక్తులతో గుట్టుచప్పుడు కాకుండా భూములను కాజేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సదరు నిందితులపై కఠిన చర్యలేమీ తీసుకోకపోవడంతో భూమాఫియా మరింతగా రెచ్చిపోతోందని.. నారాయణపేట జిల్లాలో అదే తరహా అక్రమాలకు పాల్పడిందని స్థానికులు చెప్తున్నారు. ఈ తప్పుడు రిజిస్ట్రేషన్లపై బాధితులు ఫిర్యాదులు చేస్తుండటంతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ భూమి వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ అయినట్టు అసలు యజమానులు గుర్తించేలోగా అక్రమార్కులు అన్నీ చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వి విధ శాఖల అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. డబ్బు, రాజకీయ పలుకుబడితో అసలు యజమానులను బెదిరించి తప్పుకునేలా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సరిహద్దుల్లోని భూములే టార్గెట్.. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని జడ్చర్ల కేంద్రంగా ఓ భూ మాఫియా ముఠా తెరపైకి తీసుకొచ్చిందని.. తర్వాత ఈ ముఠా కార్యకలాపాలు మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు విస్తరించాయని బాధితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏపీ, కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోని భూములను, ముఖ్యంగా స్థానికంగా ఉండని వారి భూములను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. ఈ ముఠా పలువురు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, సిబ్బంది సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ తంతు ముగిస్తోందని తెలిసింది. నారాయణపేట జిల్లాలో ఈ ముఠాకు కృష్ణా మండలం హిందూపూర్‌కు చెందిన ఓ దళారి అన్నీ తానై సహకరిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ, అసైన్మెంట్, కోర్టు కేసుల్లో ఉన్న భూముల రికార్డులు ఆ దళారీ వద్ద ఉన్నాయని.. వాటి ఆధారంగానే అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఒకటొకటిగా వెలుగులోకి.. ∙నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ఉజ్జెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టా భూమిని ఇతరులకు అమ్మినట్టు భూమాఫియా రికార్డులు సృష్టించింది. దాదాపు వందేళ్లుగా సాగు చేసుకుంటున్న సదరు కుటుంబానికి తెలియకుండా.. ఇతరుల పేర్లపై భూమి రిజిస్ట్రేషన్ కావడం విస్మయం కలిగిస్తోంది. ∙గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో గతంలో కొనుగోలు చేసి ఖాళీగా ఉంచిన భూములపై భూమాఫియా ముఠా కన్నేసింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉ న్న భూముల వివరాలు సేకరించిన అక్రమార్కులు.. స్థానికంగా లేని వారిని గుర్తించి, వారిని పోలిన పేర్లతో ఉన్నవారితో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయిం చుకున్నట్టు సమాచారం. వేర్వేరు చోట్ల సుమారు 12 ఎకరాల భూమి నలుగురి పేరిట చేతులు మారినట్టు తెలిసింది. ∙మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మసిగండ్ల శివారులో నార్య పేరు మీద సర్వే నంబర్ 180లో మూడెకరాల భూమి ఉంది. కొన్నేళ్ల కిందే ఆయన చనిపోయారు. కానీ మూడు నెలల క్రితం కొందరు ఆయన పేరుతోనే ఉన్న మరో వ్యక్తిని తీసుకొచ్చి ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించారు. ఆ వ్యవహారంలో ç రూ.30 లక్షల వరకు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. అధికారులు ఆ రిజిస్ట్రేషన్‌ను పెండింగ్‌లో పెట్టినా.. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడెబల్లూరుకి చెందిన దళిత రైతు కర్కు వెంకమ్మ (భర్త కర్కు బస్వరాజ్)కు మాగనూరు మండలం లక్ష్మీపూర్ గ్రామశివారులో మూడు సర్వే నంబర్ల పరిధిలో దాదాపు ఐదెకరాల భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన ముఠా.. 2020లో సర్వే నంబర్ 55/ఈ/1లోని 2.38 ఎకరాలు, సర్వే నంబర్ 56/ఈలోని 2 ఎకరాలు కలిపి 4.38 ఎకరాల భూమిని కాజేసింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన ఓ అంగన్ వాడీ టీచర్‌ను భూయజమానిగా, నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం మల్లెపల్లికి చెందిన లింగప్పను కొనుగోలుదారుగా సృష్టించింది. నకిలీ ఆధార్‌కార్డులను తయారు చేసి, ఫోర్జరీ సంతకాలు, వేలిముద్రలతో రిజిస్ట్రేషన్ చేయించేసింది. సర్వే నంబర్ 55/ఈ/2/1లో ఉన్న ఒక గుంట భూమి మాత్రమే వెంకమ్మ పేరిట మిగిలింది. అయితే ఇటీవల తమకు రైతుబంధు డబ్బులు రాకపోవడంతో.. వెంకమ్మ 2021 జూన్ 26న మాగనూరు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి ఆరా తీసింది. రికార్డులను పరిశీలించిన తహసీల్దార్.. భూమిని అమ్మేశాక రైతుబంధు ఎలా వస్తుందనడంతో హతాశురాలైంది. పాములతో కరిపిస్తామని బెదిరిస్తున్నారు మక్తల్‌కు చెందిన ఓ అడ్వొకేటు, ఓ ప్రజాసంఘం నాయకుడు, ఇద్దరు రాజకీయ నాయకులు కలిసి మా భూమిని మాకు కాకుండా చేశారు. నా పేరు మీద ఉన్న భూమిని అక్రమంగా లింగప్ప పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇదేమిటని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నరు. ఆఫ్రికా కోబ్రాలను తీసుకొచ్చి మమ్మల్ని కరిపిస్తమని భయపెడుతున్నరు. వెంటనే కలెక్టర్ పట్టించుకుని లింగప్ప పేరుతో ఇచ్చిన పట్టాదారు పాసుబుక్ రద్దు చేయాలి. మాకు న్యాయం చేయాలి.– కర్కు వెంకమ్మ–బస్వరాజ్, బాధిత రైతు దంపతులు, గుడెబల్లూరు, కృష్ణా, నారాయణపేట నన్ను కొట్టి.. పంట నాశనం చేశారు.. మాకున్న 11 ఎకరాల్లో 3 ఎకరాల భూమిని ఏడాది క్రితం నాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. అప్పటి తహసీల్దార్‌కు డబ్బులిచ్చి పట్టా చేసుకున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లిన. ఇంకా తీర్పు రాలేదు. ఇటీవల నా పొలంలో వరి నాట్లు వేసుకుంటే.. కొందరు వచ్చి నన్ను కొట్టి, ట్రాక్టర్‌తో పంటను నాశనం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – కుర్వ బస్వరాజ్, బాధిత రైతు, తంగిడి, కృష్ణా, నారాయణపేట చీటింగ్ కేసు నమోదైంది లక్ష్మీపూర్‌లో కర్కు వెంకమ్మకు సంబంధించిన 4.38 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన మా దృష్టికి వచ్చింది. సదరు భూయజమాని ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్లో దాసరి వెంకటమ్మ, లింగప్పలపై చీటింగ్ కేసు నమోదైంది. – తిరుపతి, తహసీల్దార్, మాగనూర్ -
అమ్మేసిన భూములను ఆక్రమించుకోవడమా!?
ధ్వజమెత్తిన గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి పారిశ్రామికాభివృద్ధి జరగాలంటూ మరోవైపు అడ్డుకుంటారా? మీ హెరిటేజ్ కోసం కొన్న భూములూ అలాగే ఇచ్చేస్తారా? జగన్ ఇంటి ముందు ధర్నా చేసింది రైతులు కాదు.. టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్: అమ్మేసిన భూములను ఆక్రమించుకోవాలని రైతులను ప్రోత్సహించడం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటిల నీతికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. విభజన నేపథ్యంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని ఓ వైపు ఉపన్యాసాలిస్తూ మరో వైపు ఫ్యాక్టరీలను అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం జగన్ ఇంటి వద్ద ధర్నా చేయడానికి వచ్చిన వారు రైతులు కానేకాదని, వారంతా ఒక సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలని తెలి పారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చి న హామీలను నెరవేర్చనందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీస్తుంటే సహించలేక ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకే సరస్వతీ పవర్ కంపెనీ పట్ల కక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ►రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో సతమ తం అవుతున్నారు. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదు. గద్దె నెక్కగానే చేసిన ఐదు సంతకాల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండటంతో దీని నుంచి దృష్టి మళ్లించేందుకే సరస్వతీ పవర్ కంపెనీ వ్యవహారాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ►భారతి సిమెంట్స్‌లో లాభాలు వస్తే వాటిని రైతులకు పంపిణీ చేసిన రైతు బాంధవుడు జగన్. చంద్రబాబు గాని, రామోజీ గాని భూములను తీసుకున్న పేద రైతులకు ఏనాడైనా తమ కంపెనీల్లో వచ్చిన లాభాలను పంచి ఇచ్చారా? ►మాచవరం మండలంలో సున్నపురాయి విస్తారంగా ఉన్నందున సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అయితే ఒక్క సరస్వతీ పవర్ వ్యవహారంలోనే విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు సోదరుడు కూడా మా ప్రాంతంలో ఐదారేళ్ల నుంచీ సిమెంటు ఫ్యాక్టరీ కోసం భూములు కొన్నారు. భవ్య, అంబుజ కంపెనీలు కూడా భూములు కొన్నాయి. కానీ జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికే ఒక్క సరస్వతీ విషయంలోనే రాద్ధాంతం చేస్తున్నారు. ►చంద్రబాబు హెరిటేజ్ కోసం కొనుగోలు చేసిన భూములను, టీడీపీ నేతలు విజయవాడలో రాజధాని పేరుతో తక్కువ ధరకు కొన్న భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తారా? ►సరస్వతీ పవర్ కంపెనీ వల్ల తమకు ఎలాంటి నష్టం కలుగలేదని, తాము అడిగిన దానికన్నా ఎక్కువ ధర ఇచ్చి భూములు కొన్నారని, ఫ్యాక్టరీ రావడానికి అడ్డుపడొద్దని వేడుకోవడానికి రైతులు వస్తే వారిని కనీసం కలవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడక పోవడం నిజంగా శోచనీయం. అదే జగన్ ఇంటి వద్ద ఘెరావ్ చేయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఓ సామాజిక వర్గం వారిని మాత్రం పిలిచి మరీ మాట్లాడారు. రైతులు కాని వారికి ప్రాధాన్యత నిచ్చిన చంద్రబాబు నిజమైన రైతులను కలవకుండా లాఠీ చార్జి చేయించారు.