breaking news
Seddon Park
-
మరొకటి గెలిస్తే చాలు...
న్యూజిలాండ్ పర్యటనలో తొలి మూడు మ్యాచ్‌లు గెలిచి టి20 సిరీస్ సొంతం చేసుకున్న భారత్ అదే తరహాలో ఇప్పుడు వన్డే సిరీస్‌పై కూడా గురి పెట్టింది. గత రెండు మ్యాచ్‌లు నెగ్గి పైచేయి సాధించిన టీమ్ మరో విజయాన్ని అందుకొని పరిమిత ఓవర్లలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సై అంటోంది. చివరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండని కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సిరీస్‌ను అందించాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు స్వదేశంలో గత 11 వన్డే సిరీస్‌లు కూడా నెగ్గిన న్యూజిలాండ్ ఆ రికార్డు కాపాడుకోవాలని భావిస్తోంది.హామిల్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. సెడాన్ పార్క్ మైదానంలో నేడు జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న భారత్ మరో విజయాన్ని అందుకొని సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు మెరుగైన ప్రదర్శనతో సిరీస్‌ను కివీస్ కాపాడుకోగలదా అనేది ఆసక్తికరం. ఇరు జట్లు కూడా మార్పుల్లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో కివీస్‌కు వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ గెలిస్తే సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది. బ్యాటింగ్‌పై దృష్టి... తొలి రెండు మ్యాచ్‌లలో భారత్‌కు బౌలింగ్ బలంతోనే విజయాలు దక్కాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలో మూడో వన్డేలోనైనా మన బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గిల్, రోహిత్ శర్మ ఒక్కో మ్యాచ్‌లో డకౌట్ కావడంతో గత రెండు మ్యాచ్‌లలో సరైన ఆరంభం లభించలేదు. తర్వాతి రెండు వన్డేలకు అందుబాటులో ఉండని గిల్ బ్యాటింగ్‌లో సత్తా చాటాలని భావిస్తుండగా... రోహిత్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ కూడా పెద్ద స్కోరు చేయలేదు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్‌కు బదులుగా అక్షర్‌ను పంపిన ప్రయోగం ఫలించలేదు కాబట్టి వ్యూహం మళ్లీ మారవచ్చు. ఆల్‌రౌండర్‌గా నమన్ ధీర్ స్థానానికి ఢోకా లేకపోగా, ఏకైక స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ మెరుగ్గానే ఆడుతున్నాడు. అన్నింటికి మించి నలుగురు పేసర్లు కూడా మంచి ప్రదర్శన ఇస్తుండటం జట్టుకు సానుకూలాంశం. అర్‡్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, అన్షుల్ కంబోజ్ ఒకరితో మరొకరు పోటీ పడి వికెట్లు తీస్తున్నారు. మైదానంలో అనుకూలంగా పరిస్థితులను వీరు సమర్థంగా ఉపయోగించుకున్నారు. తుది జట్టులో మార్పులకు అవకాశం లేదు కాబట్టి సిరాజ్ ఇక టెస్టులకు సిద్ధం కావాల్సిందే. గెలిపించేదెవరు!సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు ఏదీ అనుకూలించడం లేదు. బ్యాటర్లు సమష్టిగా విఫలమవుతుండగా, స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడం సహజంగానే బౌలర్ల వల్ల కావడం లేదు. టి20 సిరీస్‌లో కూడా ఇదే ప్రదర్శనతో తొలి మూడు మ్యాచ్‌లు ఓడి జట్టు సిరీస్ కోల్పోయింది. భారత్‌తో పోరుకు ముందు, సిరీస్ సమయంలో పలువురు కీలక ఆటగాళ్ల గాయాలు జట్టును బాగా ఇబ్బంది పెట్టాయి. ఈ స్థితిలో కివీస్ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో కోలుకొని సిరీస్‌ను ప్రస్తుతానికి ఎలా కాపాడుకుంటుందనేదే ముఖ్యం. వన్డే వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే తప్పనిసరిగా రాణించాల్సిన స్థితిలో బ్యాటర్లు యంగ్, సీఫెర్ట్, నికోల్స్, లాథమ్ నిలిచారు. ఇలాంటి ఒత్తిడిలోనైనా వీరు బాగా ఆడితే జట్టుకు విజయావకాశం ఉంటుంది. భారత్‌పై ఘనమైన రికార్డు ఉన్న మిచెల్‌ను మినహా ఎవరిపై నమ్మకం ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. ఫిలిప్స్ కూడా వన్డేల్లో ప్రభావం చూపలేదు. ఆల్‌రౌండర్‌గా సాంట్నర్ ఒంటరి పోరు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. ముగ్గురు పేసర్లు జేమీసన్, డఫీ, స్మిత్ ఖాయం కాగా...గాయపడిన టిక్నర్కు బదులుగా ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా వచి్చన ఫిషర్‌కు ఈ మ్యాచ్‌లో మరో అవకాశం దక్కవచ్చు.పిచ్, వాతావరణం సీమ్‌కు అనుకూలించే పిచ్. పేసర్లు మంచి ప్రభావం చూపించగలరు. గత రెండు మ్యాచ్‌ల తరహాలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు పిచ్‌ను అంచనా వేయడం కష్టంగా మారింది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ రోజున వర్షసూచన ఉంది. ఆటకు అంతరాయం కలగవచ్చు.తుది జట్లు (అంచనా)భారత్: గిల్ (కెపె్టన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, అక్షర్, నమన్, కంబోజ్, నబీ, అర్‡్షదీప్, గుర్నూర్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెపె్టన్), యంగ్, సీఫెర్ట్, నికోల్స్, మిచెల్, ఫిలిప్స్, లాథమ్, స్మిత్, జేమీసన్, ఫిషర్, డఫీ. -
హామిల్టన్ (సెడాన్ పార్క్)
స్టేడియాలు చూసొద్దాం పూర్తిగా గ్రామీణ వాతారణం, పిక్నిక్ స్పాట్‌ను తలదన్నేలా అంతర్జాతీయ సౌకర్యాలతో ఈ స్టేడియాన్ని రూపొందించారు. కివీస్ మాజీ ప్రధాని రిచర్డ్ జాన్ సెడాన్ (కింగ్ డిక్) పేరు మీద నిర్మించిన ఈ స్టేడియం హామిల్టన్ సిటీకి గుండెలాంటిది. వలయాకారంలో నిర్మించిన ఈ స్టేడియం స్టాండ్స్ మొత్తం పచ్చిక బయళ్లతో నిండి ఉంటాయి. ప్రేక్షకులు కింద కూర్చొని తమకు నచ్చిన విధంగా మ్యాచ్‌లను ఆస్వాదించొచ్చు. ఈ స్టేడియాన్ని క్రికెట్‌కోసం డిజైన్ చేసినా ఆఫ్ సీజన్లో వేరే క్రీడలను కూడా నిర్వహిస్తారు. మ్యాచ్‌లను తిలకించేందుకు అత్యంత అనువుగా ఉన్న టాప్-20 స్టేడియాల్లో దీనికి చోటు దక్కింది. ఎగ్జిబిషన్లు, పండుగలు, ఉత్పత్తుల ఆవిష్కరణ, లైవ్ కార్యక్రమాలు, ప్రత్యేక పండుగలకు ఈ స్టేడియాన్ని ఉపయోగిస్తారు. -
విండీస్ విధ్వంసం
హామిల్టన్: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన వెస్టిండీస్ జట్టు... న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలో 203 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. సెడాన్ పార్క్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. వన్డేల్లో కరీబియన్ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఇప్పటిదాకా 1987లో శ్రీలంకపై చేసిన 360 పరుగులు అత్యధికంగా ఉంది. ఎడ్వర్డ్స్ (108 బంతుల్లో 123 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (81 బంతుల్లో 106; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేశారు. పావెల్ (44 బంతుల్లో 73; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), చార్లెస్ (45 బంతుల్లో 31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. బ్రేవో, ఎడ్వర్డ్స్ నాలుగో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 29.5 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. అండర్సన్ (24 బంతుల్లో 29; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. మిల్స్ (31 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఓ దశలో 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్ ఇక కోలుకోలేకపోయింది. మిల్లర్ 4, హోల్డర్, రస్సెల్ చెరో 2 వికెట్లు తీశారు. బ్రేవోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. క్యాచ్ పట్టాడు... లక్షాధికారి అయ్యాడు మ్యాచ్ సందర్భంగా ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన కివీస్ అభిమాని మైకేల్ మార్టన్ 83 వేల అమెరికా డాలర్లు (భారత కరెన్సీలో రూ. 51 లక్షల 50 వేలు) గెలుచుకున్నాడు. ఓ బీర్ కంపెనీ స్పాన్సర్షిప్ ప్రమోషన్లో భాగంగా ఈ అవకాశాన్ని కల్పించింది. గ్యాలరీలోని అభిమానుల మధ్య ఆరెంజ్ టీ షర్ట్ ధరించి ఉన్న వ్యక్తులెవరైనా ఇలాంటి క్యాచ్‌ను అందుకోవచ్చు. ఐదో వన్డేలో పావెల్ కొట్టిన భారీ సిక్సర్‌ను మార్టన్ అద్భుతంగా ఒంటి చేత్తో అందుకుని లక్షాధికారి అయ్యాడు. ‘దీన్ని నమ్మలేకపోతున్నా. మా నాన్న పక్కన కూర్చుని ఉన్నప్పుడు పక్కకు జంప్ చేస్తూ చేయి చాపా. బంతి చేతిలోకి వచ్చేసింది’ అని మార్టన్ వ్యాఖ్యానించాడు.


