సర్వీస్ రెగ్యులైజేషన్కు సమాచారం పంపుకోవాలి
ఒంగోలు టూటౌన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్–2014 ద్వారా గ్రామ కార్యదర్శిలుగా నియామకం అయిన వారు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రొబేషనరీ డిక్లరేషన్, సర్వీస్ రెగ్యులైజషన్ చేయించుకొనుటకు కార్యదర్శిలు డీపీవో కార్యాలయానికి త్వరితిగతిన సమాచారం పంపుకోవాలని పంచాయితీ కార్యదర్శిల సంఘం అధ్యక్షుడు పి.శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 95 మంది గ్రామ కార్యదర్శిలు ఏపీపీఎస్సీ ద్వారా రెండేళ్ల క్రితం నియామకం అయ్యారన్నారు.