breaking news
secenderabad station
-
ఈజీ జర్నీ
సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఉన్నాయి. తాజాగా ఫ్లాట్‌ఫామ్‌పై ఒకచోటు నుంచి మరో చోటుకు వేళ్లేందుకు బ్యాటరీ ఆపరేటెడ్ కార్ల (బీఓసీ)ను ప్రవేశపెట్టారు. వయోధికులు, దివ్యాంగులు, మహిళలు, పిల్లలు ప్లాట్‌ఫామ్‌లకు చేరుకునేందుకు వీలుగా ఐదు వాహనాలను 24 గంటలూ అందుబాటులో ఉంచారు. బ్యాటరీతో నడిచే ఈ వాహనాల్లో ఒకేసారి ఆరుగురు వెళ్లవచ్చు. వాహనం పైన లగేజీ పెట్టుకునేందుకు తగినంత స్థలం కూడా ఉంది. వీటిలో సాంకేతిక లోపాల వల్ల ఇబ్బందులు ఏర్పడినప్పుడు హ్యాండ్ బ్రేక్‌ను వినియోగించి తగిన రక్షణ పొందవచ్చు. క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (సీయూజీ) ఫోన్లతో అనుసంధానం కలిగిన శిక్షణ పొందిన డ్రైవర్లు వీటిని నడుపుతారు. ఈ వాహనాల్లో కెమరాలు కూడా ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు పటిష్టమైన భద్రత ఉంటుంది. ఈ వాహనాలను ముందుగా బుక్ చేసుకునేందుకు 88273 31111 నంబర్లో సంప్రదించవచ్చు. ప్రయాణికుడికి రూ.45 చొప్పున చార్జీ నిర్ణయించారు. -
జార్ఖండ్‌లో ఉద్యోగాలిప్పిస్తామని మోసం..!
మరికల్: వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ కొందరు దళారులు నిరుద్యోగ యువకులకు మాయమాటలు చెప్పి అక్క డకు తీసుకెళ్లిన తర్వాత నానా ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. కోయిల్‌కొండ మండలానికి చెందిన పి.నరేష్‌కు ధన్వాడ మండలం తీలేర్‌కు చెందిన రాజుతో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పల్లెగడ్డలోని నిరుద్యోగులైన ఆంజనేయులు, రాఘవేంద్ర, మోహన్‌కు జార్ఖండ్ రాష్ట్రం లోని ప్రోడెక్ట్ కంపెనీలో ఉదోగ్యం కల్పిస్తామని, కంపెనీ నుంచి నెలకు 12 వేల రూపాయల వేతనం చెల్లిస్తామంటూ నమ్మబలికి వారి నుంచి (బ్యాంకు ఖాతా నం.62157561841కు) రూ.తొమ్మిది వేల చొప్పున డీడీ కట్టించుకుని ఈనెల 8న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైల్లో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని హజరాబాగ్‌కు తరలించి ఓ గదిలో బంధించి తమ కంపెనీలో చేరిన ప్రతి ఒక్కరూ మరో నలుగురితో డీడీ కట్టించాలని ఒత్తిడితెచ్చారు. ఇలా 16 మందిని చేర్పిస్తే ఉన్నతమైన ఉదోగ్యం ఇస్తామంటూ ఆశలు రేపారు. శిక్షణ పొందిన తర్వాత కంపెనీ నుంచి సరఫరా చేసే సబ్బులు, షాంపులు, టూత్‌పేస్ట్‌లపై ఎంఆర్ఎఫ్ స్టిక్కర్లు వేయాలని ఉచిత సలహాలిచ్చారు. ప్రతిరోజూ ఒకేపూట అన్నం పెట్టడమేగాక కుంటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినా బెదిరించేవారు. తమ సెల్ తీసుకోవడంతో అనుమానం వేసిన బాధితులు ఆంజనేయులు, రాఘవేంద్ర వారి నుంచి ఎలాగో తప్పించుకుని ఈ నెల 15న స్వగ్రామానికి చేరుకోవడంతో అసలు విషయం బయటపడింది. కోయిల్‌కొండ మం డలం కొత్లాబాద్, మక్తల్ మండలం జవ లాపూర్, దేవరకద్ర మండలం గూర కొండకు చెందిన కొందరు నిరుద్యోగు లు ఉన్నారని మంగళవారం ఇక్కడ విలేకరులకు బాధితులు తెలిపారు. కాగా, వారి బారి నుంచి తమ బిడ్డలు ప్రాణాలతో బయటపడటమే తమకు సంతోషంగా ఉందని బాధిత తల్లిదండ్రులు చెప్పారు. వారం రోజులు నరకం చూపారు వారంరోజుల పాటు కంపెనీ వారు మాకు నరకం చూపారు. సరైన సమయానికి అన్నం పెట్టే వారుకాదు. కడుపు కాల్చుకుని బిక్కు, బిక్కుమంటూ కాలం వెళ్లదీశాం. ఇది నకిలీ కంపెనీ అని తెలిసిన తర్వాత ఎలాగోలా వారం రోజులక్రితం తప్పించుకుని స్వగ్రామం చేరుకున్నాం. మాతోపాటు వివిధ జిల్లాలకు చెందినవారు సుమారు 200మంది ఉన్నారు. రోజూ ఒకరిద్దరు వచ్చి మరో నలుగురితో డబ్బులు చెల్లించి ఈ కంపెనీలో చేర్పించేలా చూడాలని ఒత్తిడి చేసేవారు. కుంటుంబ సభ్యులతో మాట్లాడితే సెల్‌ఫోన్ లాక్కునేవారు. బయటకు వెళితే వెంబడి ఏడుగురిని కాపాలా పంపిస్తుండేవారు. - ఆంజనేయులు, బాధితుడు, పల్లెగడ్డ