breaking news
secenderabad club
-
సెమీస్‌లో వైష్ణవి
జింఖానా, న్యూస్‌లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఏపీ అమ్మాయి వైష్ణవి పెద్దిరెడ్డి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. సికింద్రాబాద్ క్లబ్లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల క్వార్టర్ఫైనల్లో ైవె ష్ణవి 6-3, 6-2తో రాష్ట్రానికే చెందిన ఇస్కా తీర్థపై విజయం సాధించింది. మరో వైపు స్నేహ పడమట 3-6, 6-7తో రియా భాటియా (ఢిల్లీ) చేతిలో ఓటమి పొందగా... ఇస్కా అక్షర 5-7, 3-6తో అమృత ముఖర్జీ (పశ్చిమ బెంగాల్) చేతిలో పరాజయం పాలైంది. వానియా దంగ్వా ల్ (ఢిల్లీ) 3-6, 6-2, 6-0తో వైభవి త్రివేది (గుజరాత్)పై గెలిచింది. పురుషుల విభాగంలో శరణ్ రెడ్డి 1-6, 3-6తో విజయ్ క ణ్ణన్ (తమిళ్నాడు) చేతిలో, షేక్ అబ్దుల్లా 3-6, 2-6తో వినోద్ శ్రీధర్ చేతిలో ఓటమి చవిచూశారు. ఇతర ఫలితాలు పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్: సాగర్ అహూజ-షాబాజ్ ఖాన్ జోడి 6-7, 7-6, 10-6తో కృష్ణ సురేష్-తేజస్వి జోడిపై, విజయ కణ్ణన్-ఫరీజ్ మహ్మద్ జోడి 3-6, 6-1, 10-4తో రోహన్ భాటియా-రోహిత్ సార్వతే జోడిపై, కునాల్ ఆనంద్-సాగర్ మంజన జోడి 7-5, 7-5తో షేక్ అబ్దుల్లా-సురభ్ సింగ్ జోడిపై, అర్పిత్ శర్మ- లక్షిత్ సూద్ జోడి 6-2, 6-2తో సూరజ్ ప్రబోద్-ప్రజ్వల్ దేవ్‌పై నెగ్గారు. మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్: నిత్య రాజ్ బాబు-స్నేహ పడమట జోడి 6-4, 7-5తో సాన్య మదన్-షహనాజ్ సింగ్ జోడిపై, అమృత ముఖర్జి-లిఖిత శెట్టి 6-2, 6-1తో నిఖిత-బిందియా ఖాన్వాని జోడిపై, రియా భాటియా-వానియా దంగ్వాల్ జోడి 6-4, 6-0తో శ్వేత-అమల అమోల్ జోడిపై, అరంటాక్సా ఆండ్రెడె-అనుష్క భార్గవ జోడి 6-2, 6-2తో అర్యాలి-ఆర్తి జోడిపై గెలిచింది. -
రెండో రౌండ్లో ఇస్కా తీర్థ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రాష్ట్ర క్రీడాకారిణులు ఇస్కా తీర్థ, అక్షర ఇస్కా, వైష్ణవి శ్రీపెద్దిరెడ్డిలు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సికింద్రాబాద్ క్లబ్లో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఇస్కా తీర్థ 6-1, 6-7, 6-0 స్కోరుతో లిఖిత శెట్టి (కర్ణాటక)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో అక్షర ఇస్కా (ఏపీ) 6-2, 6-3తో నిత్య రాజ్ బాబు (తమిళనాడు)పై, శ్వేత శ్రీహరి (తమిళనాడు) 6-2, 6-3తో రష్మిత పసుల రెడ్డి(ఏపీ)పై, వైభవి త్రివేది (గుజరాత్) 6-4, 6-0తో సూర్య తేజస్విని(ఏపీ)పై, వైష్ణవి శ్రీపెద్ది రెడ్డి 6-3,6-0తో డయానా(తమిళనాడు)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ తొలి రోజు ఫలితాలు: ఎస్.పృథ్వీ (తమిళనాడు) 6-3, 6-3తో మణీందర్ సింగ్ (హర్యానా), కునాల్ ఆనంద్ (ఢిల్లీ) 6-7, 6-4, 6-1తో విఘ్నేష్ వీరభద్రన్(తమిళనాడు)పై, నిఖిల్ సాయి (ఏపీ) 6-1, 2-6, 6-2తో ప్రజ్వల్ దేవ్(కర్ణాటక)పై, అజయ్ కుమార్ (ఏపీ) 6-3, 0-6, 6-2తో చంద్రిల్ సూద్ (యూపీ)పై నెగ్గారు.