breaking news
SD
-
కేరాఫ్ వెంచపల్లి
కరోణ్యా కత్రిన్, శ్రీజిత్ లావన్ జంటగా నటించనున్న చిత్రం ‘ఎస్ డి’. ఉపశీర్షిక ‘కేరాఫ్ వెంచపల్లి’. భాను ఎంటర్టైన్ మెంట్స్, ప్రణవి ప్రొడక్షన్స్ బేనర్స్ పై శ్రీసాయి అమృత లక్ష్మీ క్రియేషన్స్ సమర్పణలో గోదారి పాలిక్ దర్శకత్వంలో భానుచందర్, తిరుపతి పటేల్ నిర్మించనున్నారు. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించనున్న సందర్భంగా పాలిక్ మాట్లాడుతూ– ‘‘1960–1980ల మధ్యలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. శివుడు, దేవకి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారుతుంది. ఆ క్రమంలో ఆ ఊరిలో ఉన్న ఓ దొర వీరి ప్రేమకు అడ్డుపడతాడు. ఆ దొరను ఎదిరించి వారి ప్రేమను ఎలా కాపాడుకున్నారు? అనేది సినిమా. షూటింగ్ మొత్తం మంచిర్యాల తదితర ప్రాంతాలలో ఉంటుంది. కొన్నేళ్లనాటి దొరలకు సంబంధించిన ఒక పురాతనమైన కోటలో షూటింగ్ చేస్తున్నాం. ఎస్ అంటే శివుడు.. డి అంటే దేవకి వారిద్దరి పేరు వచ్చేలా సినిమా టైటిల్ ఎస్.డి అని పెట్టాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రఘురామ్, పాటలు: సురేష్ ఉపాధ్యాయ, సినిమాటోగ్రాఫర్: మల్లికార్జున్ . -
మెమొరీ కార్డులపై ఆ నంబర్లెందుకు?
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎస్డీ, మైక్రో ఎస్డీ కార్డులను వాడుతున్నారు. ఎస్డీ కార్డులను కెమెరాలు, ఇతరాలకు ఉపయోగిస్తే.. మైక్రో ఎస్డీ కార్డులను మొబైల్స్, టాబ్లెట్స్ లాంటి వాటిలో వినియోగిస్తుంటాం. అయితే ఈ ఎస్డీ కార్డులను జాగ్రత్తగా గమనిస్తే వాటిపై ‘సి’ అనే అక్షరం మధ్యలో 2, 4, 6, 10, U1, U3.. ఇలా కనిపిస్తాయి. అసలు ఇవేంటి? అనే విషయం చాలా మందికి తెలియదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మెమొరీ కార్డులపై ఉండే నంబర్లు వాటి క్లాసులను సూచిస్తాయి. అంటే అవి ఎంత స్పీడ్తో పనిచేస్తాయో ఈ అంకెలు తెలియజేస్తాయి. క్లాస్ 2 కార్డులు: ఈ కార్డులతో 2 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్పీడ్తో చాలా తక్కువ కార్డులు వస్తున్నాయి. ఎందుకంటే 2 ఎంబీ స్పీడ్ చాలా తక్కువ. క్లాస్ 4 కార్డులు: వీటిలో 4 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా 4 జీబీ, 8 జీబీ కార్డులు ఈ స్పీడ్తో పనిచేస్తాయి. ఇందులో సాధారణ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. క్లాస్ 6 కార్డులు: వీటిలో 6 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. సాధారణంగా 4, 8, 16 జీబీ కార్డులు ఈ స్పీడ్తో పనిచేస్తాయి. ఇందులో షూట్ సమయంలో 720పీ తో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. క్లాస్ 10, యూ1 కార్డులు: వీటిలో 10 ఎంబీ ఫర్ సెకండ్, ఆపై స్పీడ్తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. గరిష్టంగా 60 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్ వరకు చేసుకోవచ్చు. 8, 16, 32, 64, 128, 256 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్తో పనిచేస్తాయి. ఇందులో షూట్ సమయంలో 1080పీ తో హెచ్డీ వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. యూ3 కార్డులు: ఈ మెమొరీ కార్డ్ ద్వారా 4కె వీడియోలను ఎలాంటి అంతరాయం లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు. క్లాస్ 10 కార్డుల కన్నా అత్యంత వేగవంతమైన స్పీడ్ వీటి సొంతం. -
సమాజ్వాదీపార్టీపై మండిపడ్డ మోడి