breaking news
scented flavours
-
మట్టి పరిమళం: ఈ పెర్ఫ్యూమ్తో.. బయట వర్షం పడుతుందేమో అనే అనుభూతి..
వేడి, పొడి వాతావరణంలో ఒక్కసారిగా కురిసే చినుకులతో భూమి నుండి వెలువడే ఆహ్లాదకరమైన సువాసన మనసును సేదతీరుస్తుంది. ఇది మట్టి వెదజల్లే సహజ పరిమళం కావడంతో మన మనసుల్ని సంతోష సాగరంలో విహరింపజేస్తుంది. తొలకరి చినుకులు నేలను తాకినప్పుడు వచ్చే ఈ మట్టి సువాసనను ఆస్వాదించడంలో ఆడ–మగ అనే భేదమేమీ లేదు. అందుకే, ఈ సువాసనలు ఇప్పుడు అత్తరు రూపంలో అందరినీ అల్లుకు పోతున్నాయి.ప్రకృతి నుండి ప్రేరణ పొంది, సురక్షితమైన పదార్థాలతో తయారైన మట్టి అత్తరు పరిమళాలకు వందల సంవత్సరాల నైపుణ్యం గల వారసత్వ కంపెనీలు కూడా ఉన్నాయి. చెమట వాసనను దూరం చేస్తూ విభిన్న శ్రేణి వ్యక్తులను ఆకర్షిస్తుంది. ‘ది సెంట్ ఆఫ్ రైన్’ లేదా ‘పెట్రిచోర్ ఎసెన్షియల్ ఆయిల్’గా ప్రసిద్ధి చెందినవీ ఉన్నాయి. అన్ని దేశాలలోనూ ఈ తరహా సువాసనలను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆఫ్‌లైన్–ఆన్లైన్ మార్కెట్లో వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఈ ఎర్త్ సెంటెడ్ పెర్ఫ్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి.చెక్.. తప్పనిసరి:– మనసును కదిలించే ఈ సువాసనగల అత్తరులో ఆల్కహాల్ వాడకం లేనివి ఎంచుకోవాలి.– అత్తరు లేదా పెర్ఫ్యూమ్ మన చర్మ తత్త్వానికి సరిపడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ముందుగా దూది ఉండతో మణికట్టు, చెవి వెనక భాగాన కొద్దిగా అద్ది/స్ప్రే చేసి, 30 నిమిషాలు ఉండాలి. సరిపడితే రోజూ ఉపయోగించుకోవచ్చు.ప్రయోజనాలు ఏంటంటే?– మట్టి పరిమళం గల సహజ అత్తరు/పెర్ఫ్యూమ్ను వాడి మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ కావచ్చు.– ఏకాగ్రతను మెరుగుపరుచుకోవాలనుకునేవారికి ఉత్తమమైన సాధానాలలో మట్టి పరిమళం ఒకటి లగ్జరీ హోటళ్లు, యోగా అండ్ ఆయుర్వేద రిసార్ట్‌లలో, అరోమా థెరపీ రిట్రీట్‌లలో సుగంధ లేపనాల తయారీలోనూ ఈ మట్టి అత్తరును ఉపయోగిస్తుంటారు.– మట్టి పరిమళం స్ప్రే చేసుకొని వెళితే మీ చుట్టూ ఉన్నవారు బయట వర్షం పడుతుందేమో అన్న అనుభూతికి లోనుకాకుండా ఉండలేరు.ఇవి చదవండి: Healthy Diet: ఓట్స్ – పొటాటో చీజ్ బాల్స్! -
ఎస్ఎంఎస్ నుంచి సువాసనలు
ఏదైనా సందేశం, ఈమెయిల్ లేదా ఫేస్బుక్లో ఎవరైనా మీ పోస్ట్‌కు లైక్ కొట్టిన నోటిఫికేషన్ ఫోన్‌కు వచ్చినప్పుడు.. ఆ సందేశం తనతోపాటు మీకు నచ్చిన సువాసనలను తెస్తే ఎలాగుంటుంది? చిత్రంలోని ‘సెంట్’ అనే పరికరాన్ని మీ ఫోన్‌కు తగిలిస్తే.. మీకు వచ్చే సందేశాలు సువాసనలను వెదజల్లుతాయి. ఈ పరికరంలో అమర్చే ఒక్కో క్యాట్రిడ్జ్ 100 సందేశాల వరకూ పనిచేస్తుంది. తర్వాత దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని జపాన్‌కు చెందిన సెంట్ అనే కంపెనీ తయారుచేసింది. మల్లెలు, గులాబీ, యాపిల్, కాఫీ, లావెండర్.. చివరికి కార్న్ సూప్ కూడా.. ఇలా పలు సువాసనలకు సంబంధించిన క్యాట్రిడ్జ్‌లను మనం ఎంచుకోవచ్చు. సందేశం వచ్చినప్పుడు.. ఆ పరికరం నుంచి సెంట్ స్ప్రే అవుతుందన్నమాట. పరికరం ధర రూ.2,100. క్యాట్రిడ్జ్ వెల రూ.300.