కీర్తి సురేశ్ కోర్ట్ థ్రిల్లర్ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
హీరోయిన్ కీర్తి సురేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే అక్క వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కీర్తి సురేశ్ తాజాగా మరో సినిమాతో అలరించనుంది. తాజాగా ఆమె నటించిన మరో మూవీ సత్యవాన్ సావిత్రి. ఈ సినిమాకు ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కోర్ట్ డ్రామాగా తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే భర్త కోసం భార్య చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేశ్ లాయర్‌గా కనిపించనుంది. బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పటికీ హత్య కేసులో చిక్కుకున్న భర్తను కాపాడేందుకు ఆమె ఏం చేశారనేదే ఈ స్టోరీగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.