breaking news
sathish goud
-
పట్టపగలు యువకుడి దారుణ హత్య
అంబర్‌పేట: పట్టపగలు యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం అంబర్‌పేట పోలీస్‌ష్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది. ఇన్స్పెక్టర్ ఆనంద్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోల్నాక తిరుమలనగర్‌కు చెందిన సతీష్‌గౌడ్(27) పెయింటింగ్ పనులతో పాటు ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు. ఇతనికి భార్య హిమబిందు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం సతీష్ గౌడ్ భార్యతో కలిసి బైక్‌పై దిల్‌శుక్‌నగర్ వెళుతుండగా బైక్‌ను అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు సతీష్‌గౌడ్‌ను బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. దీంతో హిమబింధులు బంధువులకు సమాచారం అందించింది. చంపి రోడ్డుపై పడేశారు.. గోల్నాక కొత్తబ్రిడ్జి అమ్మవారి ఆలయం వద్ద యువకుని మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందడంతో అంబర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. స్థానికుల సహకారంతో మృతుడిని సతీష్‌గౌడ్‌గా గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా సతీష్‌గౌడ్‌ను హత్య చేసిన వ్యక్తులు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. -
మావోయిస్టుల కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో సీఆర్ పీఎఫ్ జవాన్లు, నక్సలైట్లకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందాడు. మావోయిస్టులు జరిపిన ఎదురు కాల్పుల్లో తెలంగాణకు చెందిన జవాన్ సతీష్ గౌడ్ అమరుడయ్యాడు. జవాన్ సతీష్ గౌడ్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం మర్లపల్లి. కాగా జవాన్ సతీష్ వయసు కేవలం 23 ఏళ్లు. జవాన్ మృతదేహాన్ని ఛత్తీస్ గఢ్ నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్లో జిల్లాకు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి రోడ్డు మార్గంలో అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.