breaking news
sathesh reddy
-
రక్షణ రంగంలో లీడర్‌గా ఎదుగుతాం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రక్షణ రంగంలో ప్రపంచ లీడర్‌గా భారత్ ఎదుగుతుందని జాతీయ భద్రత సలహా మండలి సభ్యుడు, ప్రముఖ రక్షణ శాస్త్రవేత్త డా.జి.సతీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రక్షణ రంగ పరికరాల కోసం ఒకప్పుడు పూర్తిగా దిగుమతులపై భారత్ ఆధారపడిందని, ఏమీ లేని స్థితి నుంచి నేడు ఎగుమతులు చేసే స్థాయికి చేరుకున్నామని గర్వంగా చెప్పారు. మిసైల్స్, రాడార్స్, గన్స్, నిఘా.. ఇలా అన్ని విభాగాల్లోనూ సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతున్నామన్నారు.ఆదివారం జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ‘ఎమెస్కో–డా.బి.వి.పట్టాభిరామ్ అవార్డు ‘చేంజ్ మేకర్–2026’అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రక్షణ రంగంలో దేశవ్యాప్తంగా 25వేల పైచిలుకు కంపెనీలు నిమగ్నమయ్యాయి. 2025–26లో రూ.1,78,000 కోట్ల విలువైన రక్షణ రంగ పరికరాలు భారత్‌లో తయారయ్యాయి. భారత్ ఉపయోగిస్తున్న మొత్తం రక్షణ ఉత్పత్తుల్లో 65–70 శాతం దేశీయంగా ఉత్పత్తి అయినవే. మన దేశం నుంచి ఏటా ఎగుమతులు రూ.15వేల కోట్లు పెరుగుతున్నాయి. అర్మేనియా ఇటీవల నిర్వహించిన ఆర్మీ పరేడ్‌లో భారత్ సరఫరా చేసిన ఆయుధాలను ప్రదర్శించింది’అని చెప్పారు. శత్రువుకు చిక్కకుండా.. కార్గిల్ యుద్ధంలో అత్యంత ఎత్తైన, చలి ప్రదేశంలో పోరాడి సైన్యం విజయం సాధించడంలో డీఆర్డీఓ ముఖ్యభూమిక పోషించిందని సతీశ్ రెడ్డి వివరించారు. ఆపరేషన్ సిందూర్‌లో శత్రుదేశంపై వాడిన యుద్ధ పరికరాలు 80–90 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసినవేనని తెలిపారు. ‘పాక్ నుంచి వచి్చన డ్రోన్స్ ఏవీ కూడా మన దేశంలోని లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. వాటిని మనం ధ్వంసం చేశాం. యాంటీ శాటిలైట్ మిసైల్ వ్యవస్థను అభివృద్ధి చేసి రష్యా, అమెరికా, చైనా సరసన మనం నిలుచున్నాం. 155 ఎంఎం గన్స్ తయారు చేస్తున్నాం. డీఆర్డీఓ తయారు చేసిన యాంటీíÙప్ హైపర్సోనిక్ మిసైల్ ధ్వని కంటే 8రెట్లు వేగంగా దూసుకుపోతుంది. ప్రపంచంలో మరే దేశం దగ్గర ఈ వ్యవస్థ లేదు’అని తెలిపారు. భారత్‌ను యువత ముందుండి నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో మన దేశంలో 450 స్టార్టప్స్ ఉండేవని, ఇప్పుడు ఈ సంఖ్య 2,35,000 దాటిందన్నారు. స్కైరూట్ వంటి కంపెనీలు సత్తా చాటుతున్నాయని తెలిపారు. అవార్డు ప్రదానం డీఆర్డీఓకు చెందిన వేల మంది శాస్త్రవేత్త లు దశాబ్దాలుగా తమ జీవితాన్ని ధారపోస్తున్నా రని సతీశ్ రెడ్డి తెలిపారు. వారు విశేషంగా కృషి చేయడం వల్లే స్వతంత్రంగా ఈ దేశాన్ని రక్షించుకునే స్థితికి వచ్చామని కితాబిచ్చారు. వారి సేవలకు గుర్తింపుగానే తనకు ఈ అవార్డు దక్కిందని తెలిపారు. ప్రముఖ నటుడు చిరంజీవి మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం అంతటి సామర్థ్యం ఉన్న వ్యక్తి సతీశ్ రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, కేవీపీ రామచంద్ర రావు, ‘ఎమ్మెస్కో’విజయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్ర మూర్తి, జయ పట్టాభిరామ్ పాల్గొన్నారు. -
రాబందులు
► అధికారపార్టీ నాయకుల సిఫారుసు ఉంటేనే రైతు బంధు ► లేకుంటే గిడ్డంగుల్లో ఖాళీ ఉండదు ► కాసులిస్తే ఓకే..రోజూ పదుల సంఖ్యలో ► తిరిగి వెళుతున్న రైతులు కొడవలూరు(కోవూరు): నాయుడుపాళేనికి చెందిన సతీష్‌రెడ్డి అనే రైతు తాను పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు బంధు కింద ధాన్యాన్ని గిడ్డంగుల్లో నిల్వ బెట్టుకోవాలనుకున్నాడు. నార్తురాజుపాళెంలోని కోవూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఈ నెల మూడో తేదీన సంప్రదించారు. గిడ్డంగులు ఖాళీ లేవనడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లారు. రెండ్రోజుల తరువాత సిఫారుసుతో వచ్చిన ఓ రైతు ధాన్యం మాత్రం నిల్వబెట్టుకున్నాడు. ఇదీ మార్కెట్ కమిటీ అధికారుల తీరు. ∙ రైతులకు కల్పతరువు లాంటి రైతు బంధు పథకాన్ని సంబంధిత అధికారులు రైతు రాబందు పథకంగా మార్చేశారు. మార్కెటింగ్ శాఖ అధికారుల వైఖరి కారణంగా సామాన్య రైతుకు ఆ పథకం అందడం లేదు. అధికార పార్టీ నాయకుల íసిఫారుసు ఉన్నా లేక కాసులు సమర్పించుకుంటేనే పథకాన్ని సద్విని యోగం చేసుకోగలుగుతున్నారు. లేకపోతే గిడ్డంగులు ఖాళీ లేవంటూ తిప్పి పంపేస్తున్నారు. ఈ సాకుతో రోజూ మార్కెటింగ్ శాఖ కార్యాలయానికి తిరిగిపోతున్న రైతుల సంఖ్య పదుల్లో ఉంటోంది. ఇదీ రైతుబంధు పథకం.. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేనపుడు నష్టానికే తెగనమ్ముకోకుండా రైతు బంధు పథకం దోహదపడుతుంది. ధాన్యానికి ధర క్షీణించినప్పుడు రైతులు నష్టానికి అమ్ముకోకుండా రైతు బంధు పథకం కింద మార్కెటింగ్ శాఖ గిడ్డంగుల్లో భద్రపరచుకోవచ్చు. రైతులు భద్రపరచుకున్న ధాన్యానికి విలువ కట్టి అందులో 75 శాతాన్ని రైతులకు ఆర్నెల్లపాటు ఎలాంటి వడ్డీ లేకుండా ముందుగానే ఇచ్చేస్తారు. ఆ డబ్బుతో రైతుల తక్షణ అవసరాలు తీర్చుకుని ధాన్యానికి బాగా ధర వచ్చాక ధాన్యాన్ని అమ్ముకుని లాభపడవచ్చు. ధాన్యాన్ని అమ్ముకున్నప్పుడు మాత్రమే రైతు ఎలాంటి వడ్డీ లేకుండా మార్కెటింగ్ శాఖ నుంచి తీసుకున్న మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్నెల్లలోనూ మంచి ధర రాకుంటే ఆ తరువాత నిల్వ పెట్టిన ధాన్యానికి రూపాయి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్నెల్లకంటే ఎక్కువగా నిల్వ పెట్టే పరిస్థితి ఉండదు గనుక రైతులు లాభపడతారు. ఖాళీల్లేవట ప్రస్తుతం తొలి పంట వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లోకి వస్తోంది. «ధాన్యం తెలంగాణకు వెళుతుంటే బాగా గిరాకీ ఉంటుంది. కేవలం చెన్నైకి మాత్రమే వెళుతుండడం, అక్కడ కూడా ఆశాజనకమైన ధర లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి కనబరచడం లేదు. రైతులు అమ్మకోలేక రోడ్ల వెంబడి, ఖాళీ స్థలాల్లో ఆరబోసుకుంటున్నారు. బీపీటీ రకాన్నయినా కొందరు కొనుగోలు చేస్తుండగా, నెల్లూరు జిలకర రకాన్నయితే అడిగే వారు కరువయ్యారు. ధాన్యం నిల్వ బెట్టుకుందామని వెళుతున్న రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. గిడ్డంగులు ఖాళీలేవన్న సాకుచూపి తిప్పి పంపేస్తున్నారు. సిఫార్సుతో లేదా జేబులు తడిపినా ఖాళీ ఉంటోందన్న విమర్శలూ ఉన్నాయి. గిడ్డంగుల కొరత జిల్లాలో 1.85 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగులే ఉన్నాయి. కనీసం 5 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగులుంటే తప్ప జిల్లాలోని రైతుల అవసరాలు తీరవు. గిడ్డంగుల కొరత ఓ సమస్యయితే ఉన్న గిడ్డంగుల విషయంలో పక్షపాతం చోటుచేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సద్వినియోగం చేసుకోలేకున్నాం మార్కెటింగ్ గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ బెడుదామని ఎప్పుడు వెళ్లినా గిడ్డంగులు ఖాళీలేవంటారు. కొందరు రైతులు ఆ తరువాత కూడా పెడుతూనే ఉన్నారు. ఇందులో మార్కెటింగ్ అధికారుల వైఖరేమిటో అర్థం కావడం లేదు. మాకు ఎలాంటి సిఫార్సు లేదనే అలా పంపుతున్నట్లున్నారు. – కొనిజేటి శేషగిరిరావు, రైతు, నార్తురాజుపాళెం


