breaking news
Sarabjit Singhs sister Dalbir Kaur
-
Dalbir Kaur: సరబ్జిత్ సింగ్ సోదరి మృతి
అమృత్సర్: పాకిస్తాన్ జైల్లో సహచర ఖైదీలు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీ యుడు సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కన్ను మూశారు. గుండెపోటు వచ్చిన ఆమె ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సరబ్జిత్ సింగ్‌పై తప్పుడు నిందలు మోపి పాకిస్తాన్ 1991లో అదుపులోకి తీసుకుంది. అప్పట్నుంచి ఆమె తన తమ్ముడి విడుదల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. అప్పట్లోనే ఆమె దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలిచారు. చివరికి 2013లో సరబ్జిత్ పాక్ జైల్లో ప్రాణాలు కోల్పోయారు. సరబ్జిత్ సింగ్.. దల్బీర్ కౌర్ పోరాటం ఇతివృత్తం ఆధారంగానే 2016లో ఒమంగ్ కుమార్ డైరెక్షన్లో ఐశ్వర్యరాయ్-రణ్‌దీప్ హుడా ‘సరబ్జిత్’ సినిమా వచ్చింది. -
మణిరత్నం సినిమాకి ‘నో’!
అదృష్టం ముందు తలుపు తడితే, దురదృష్టం వెనక తలుపు తట్టిందని తెగ బాధపడిపోతున్నారు సోనాక్షి సిన్హా. ఆమె బాధకు కారణం మణిరత్నం సినిమాకి డేట్స్ కేటాయించలేకపోవడమే. మహేష్‌బాబు, నాగార్జున కాంబినేషన్లో మణిరత్నం ఓ సినిమాకి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్, శ్రుతిహాసన్‌లను నాయికలుగా ఎంపిక చేశారట. మరో నాయికగా సొనాక్షీ అయితే బాగుంటుందని, ఆమెను సంప్రదించారట. స్టోరీలైన్ కూడా సోనాక్షికి వినిపించారట. ఆ కథ, తన పాత్ర బాగా నచ్చినా ఈ చిత్రాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరామె. డైరీ చెక్ చేసుకుంటే, డేట్స్ ఖాళీ లేవట. దాంతో, బంగారంలాంటి ఈ అవకాశాన్ని వదులుకున్నారట. ఈ నెల ఈ అవకాశం వదులుకున్న సోనాక్షీ గత నెల సుభాష్ ఘయ్ ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరించారు. ఎలాంటి నేరం చేయకుండానే పాకిస్తానీ జైలులో 22 ఏళ్లు శిక్ష అనుభవించిన సరబ్జిత్ సింగ్ జీవితం ఆధారంగా ఘయ్ ఈ సినిమా చేయాలనుకున్నారు. నరబ్జిత్ సోదరి దల్బీర్ కౌర్ పాత్రకు సోనాక్షీని అడిగారు. అయితే డేట్స్ ఖాళీ లేక ఆ అవకాశాన్ని వదులుకున్నారామె. ఇలా రెండు నెలల గ్యాప్‌లో రెండు భారీ సినిమాలు వదులుకోవాల్సి రావడం సోనాక్షీని కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట.