breaking news
Sandaikoli 2
-
యూనిట్ అందరికీ బంగారు నాణేలను కానుకగా..
తమిళసినిమా: సహ నటీనటులకు, సాంకేతిక వర్గానికి షూటింగ్ పూర్తి కాగానే బంగారు డాలర్లను కానుకగా అందించే సంప్రదాయానికి ఆనాటి మహానటి సావిత్రి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ఎవరూ అలాంటి సంప్రదాయాన్ని పెద్దగా పాటించలేదు. అలాంటిది ఆ మహానటి పాత్రలో జీవించిన యువ నటి కీర్తీసురేశ్ ఆమె గుణగణాలను పుణికిపుచ్చుకున్నారా?అన్నంతగా మహానటి చిత్ర షూటింగ్ పూర్తి కాగానే యూనిట్ అందరికీ బంగారు నాణేలను కానుకగా అందించారు. అదే సంప్రదాయాన్ని తన తాజా చిత్రం సండైకోళి–2 చిత్ర షూటింగ్ ముగింపు రోజునా కీర్తీసురేశ్ కొనసాగించారు. ఆ ఆనందం నుంచి బయట పడకుండానే తాజాగా అదే చిత్ర కథానాయకుడు, నిర్మాత విశాల్, దర్శకుడు లింగుస్వామి యూనిట్ సభ్యులు 150 మందికి విడివిడిగా బంగారు నాణేలను కానుకగా అందించి సంతోషంలో ముంచెత్తారు. ఈ దర్శక నిర్మాతలకు నటి కీర్తీశురేశ్ స్ఫూర్తి అనిపించారేమో. విశాల్ హీరోగా నటిస్తూ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం సండైకోళి–2. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా విశాల్, దర్శకుడు లింగుస్వామి చిత్ర యూనిట్ సభ్యులకు బంగారు నాణేలను కానుకగా అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కేరళా రాష్ట్ర వరద బాధితుల సహాయార్థం ఆ రాష్ట్ర ముఖ్యమంతి సహాయనిధికి రూ.2లక్షల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న సండైకోళి–2 చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర సింగిల్ ట్రాక్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. చిత్రం తమిళం, తెలుగు భాషల్లో అక్టోబరు 18న విడుదలకు ముస్తాబవుతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
విశాల్‌తో జోడీ కుదిరింది
వయసు, అనుభవం లాంటి వాటిని పక్కన పెడితే యువ నటి కీర్తీసురేష్ ఇప్పుడు అగ్రనాయకిల పట్టికలో చేరిపోయారు. ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం ఇదు ఎన్న మాయం సక్సెస్ పరంగా పెద్దగా మాయ చేయలేకపోయినా ద్వితీయ చిత్రం రజనీమురుగన్, తృతీయ చిత్రం రెమో సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో ఏకంగా ఇలయదళపతి విజయ్‌తోనే రొమాన్స్ చేసే అదృష్టం తలుపు తట్టింది. ఆయనతో నటించిన భైరవా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా మరో స్టార్ హీరో సూర్యతో తానా సేర్న్‌దకూట్టం చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు తెలుగులో నానీతో నేను లోకల్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో డ్యూయెట్లు పాడటానికి సిద్ధం అవుతున్నారు. ఇక కోలీవుడ్‌లో మరో స్టార్ హీరో విశాల్‌తోనూ జత కట్టడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. కత్తిసండై చిత్రాన్ని పూర్తి చేసి ప్రస్తుతం మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్న విశాల్ తదుపరి సండైకోళి–2 చిత్రానికి రెడీ అవుతున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రీ పొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది పిబ్రవరిలో చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. కాగా సండైకోళి చిత్రంలో విశాల్‌కు తండ్రిగా నటించిన నటుడు రాజ్‌కిరణ్‌నే దానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న సండైకోళి–2 చిత్రంలోనూ నటించనున్నారు. ఇందులో నాయకిగా కీర్తీసురేష్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.