breaking news
Samvat 2071
-
ముహూరత్ ట్రేడింగ్‌లో జోష్.. లాభాల స్వీకరణకే మొగ్గు
ముంబై: స్టాక్ మార్కెట్లో కరెక్షన్ కొనసాగుతూనే ఉంది. సానుకూల వాతావరణంలో జరిగే ముహూరత్ ట్రేడ్‌పై కూడా కరెక్షన్ ఎఫెక్ట్ పడింది. దీంతో దేశీ సూచీలు ఓ దశలో తారాజువ్వలా రివ్వునపైకి లేచినా చివరకు మోస్తారు లాభాలతోనే ముగిశాయి. దాదాపు పది నెలలుగా కొనసాగుతున్న బుల్ జోరుకు కొంత కాలంగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. నెలల తరబడి పెట్టుబడి పెడుతూ వచ్చిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీపావళి రోజున కొత్త సంవత్ 2078కి స్వాగతం పలుకుతూ గురువారం రాత్రి 6:15 నుంచి 7:15 గంటల వరకు ప్రత్యేకంగా ముహూరత్ ట్రేడ్‌ను నిర్వహించారు. ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో ఫుల్ జోష్ కనిపించింది. సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 60,067 దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 17,916 పాయింట్ల దగ్గర ముగిసింది. ఓ దశలో నాలుగు వందల పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడినా.. వెంటనే ఇన్వెస్టర్లు లాభాల కోసం అమ్మకాలు చేపట్టారు. దీంతో చివరకు 295 పాయింట్ల లాభం దగ్గర సెన్సెక్స్ ముగిసింది. ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ టాప్ 30 కంపెనీల్లో 25 కంపెనీలు లాభాలతో మార్కెట్‌ను ముగించాయి. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. -
ఈ షేర్లు... తారాజువ్వలు!
ఇన్వెస్టర్లకు సంవత్ 2077 బంపర్‌గా గడిచింది. ప్రజలను కరోనా భయాలు వెంటాడుతున్నా.. దేశీ మార్కెట్లు మాత్రం తారాజువ్వల్లాగా దూసుకెళ్లిపోయాయి. స్మాల్, మిడ్.. లార్జ్ క్యాప్ అనే భేదం లేకుండా అన్ని విభాగాల్లోని షేర్లూ గణనీయంగా పెరిగాయి. గతేడాది దీపావళి నుంచి ఈ ఏడాది అక్టోబర్ దాకా చూస్తే నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు 40 శాతం రాబడులు అందించగా.. మిడ్‌క్యాప్ సూచీలు 60 శాతం, స్మాల్‌క్యాప్ సూచీలు 79.7 శాతం మేర రాణించాయి. కరోనా కేసుల కారణంగా అంతటా నిస్పృహ, నిరాశ నెలకొన్న పరిస్థితుల్లో ఊహకు కూడా అందని విధంగా స్టాక్ మార్కెట్లు ఎగిశాయి. కారణాలు అంతర్జాతీయంగా నిధుల లభ్యత పెరగడం, ఆర్థిక విధానాలు సానుకూలంగా ఉండటం, ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో డీమ్యాట్ ఖాతాలు (2021లో 2 కోట్ల పైచిలుకు) తెరవడం, టీకాలతో మహమ్మారిని కొంత కట్టడి చేయగలగడం, ఇంధన ధరలు పెరగడం, రిస్క్ సామర్థ్యాలు పెరగడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లో జోష్‌కి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్ 2078లోనూ మార్కెట్లు మరింత ఎగిసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చే రాబడులు తగ్గడం, దేశీ ఇన్వెస్టర్ల రిస్కు సామర్థ్యాలు పెరగడం, జీడీపీ వృద్ధి మెరుగుపడుతుండటం, టీకా ప్రక్రియ పుంజుకుంటూ ఉండటం ఇందుకు దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రంగాల్లో ట్రావెల్, టూరిజం, రియల్ ఎస్టేట్ దాని అనుబంధ రంగాలు మొదలైనవి మెరుగ్గా రాణించే అవకాశాలు ఉన్నాయని బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. మరోవైపు, హౌసింగ్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగాలు ఆశావహంగా ఉండగలవని యాక్సిస్ సెక్యూరిటీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్‌లో మెరిసే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని బ్రోకరేజి సంస్థలు సూచిస్తున్న స్టాక్స్ కొన్ని మీకోసం. బ్రోకింగ్ సంస్థ: ఎస్బీఐ సెక్యూరిటీస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 2,036 టార్గెట్ ధర రూ. 2,721 వృద్ధి: 33% దేశీయంగా ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటి. ప్రస్తుతం వ్యాపార పరిమాణం రూ. 4.8 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్, అసెట్ క్వాలిటీ, మెరుగైన మార్జిన్లు, రాబడులు దీనికి సానుకూల అంశాలు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ మొండి బాకీలు మరింత తగ్గగలవు. వ్యయాలు తగ్గించుకునే దిశగా డిజిటల్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రతి నెలా డిజిటల్ మాధ్యమం ద్వారా 5 లక్షల పైచిలుకు కస్టమర్లను చేర్చుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగించడం, లాక్డౌన్లు విధిస్తే రిటైల్ సెగ్మెంట్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం, ఫిన్‌టెక్ కంపెనీల నుంచి పోటీ వంటివి బాంకుకు ప్రతికూలాంశాలు కాగలవు. .. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రస్తుత ధర రూ. 292 టార్గెట్ ధర రూ. 358 వృద్ధి: 22% వివిధ మౌలిక రంగ ప్రాజెక్టుల అభివృద్ధిలో రెండు దశాబ్దాలపైగా అనుభవం. పటిష్టమైన ఇన్‌హౌస్ ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ సేవలు) విభాగం. ఇన్ఫ్రా రంగంలో దిగ్గజ సంస్థలతో సత్సంబంధాల కారణంగా సంయుక్తంగా బిడ్డింగ్ చేయడం ద్వారా ప్రాజెక్టులు దక్కించుకునేందుకు మెరుగైన అవకాశాలు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,786 టార్గెట్ ధర రూ. 2,151 వృద్ధి: 20% ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన కంపెనీ. దేశీయంగా విస్కస్ స్టేపుల్ ఫైబర్ (వీఎస్ఎఫ్), లినెన్, ఇన్సులేటర్స్ తయారీ సంస్థ. అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి అనుబంధ సంస్థలున్నాయి. డెకరేటివ్ పెయింట్స్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది. వచ్చే రెండేళ్లలో వ్యాపారాలపై రూ. 2,100 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఆకర్షణీయమైన వేల్యుయేషన్‌లో లభిస్తోంది. చైనా నుంచి సరఫరాపరమైన ఆటంకాలు, అంతర్జాతీయంగా డిమాండ్, ముడి వస్తువులు..విద్యుత్, ఇంధనాల ఖర్చులు పెరగడం తదితర రిస్కులు పొంచిఉన్నాయి. .. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ప్రస్తుత ధర రూ. 612 టార్గెట్ ధర రూ.774 వృద్ధి: 26% ఇది మురుగప్పా గ్రూప్‌లో భాగమైన ఆర్థిక సేవల విభాగం. గృహ, వాహన రుణాలు, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సేవలు మొదలైనవి అందిస్తోంది. నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 67000 కోట్ల పైగా ఉంది. దాదాపు 16.6 లక్షల పైచిలుకు కస్టమర్లకు సర్వీసులు అందిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏయూఎం వార్షికంగా 7 శాతం వృద్ధి నమోదు చేసింది. మహమ్మారి కారణంగా వసూళ్లపై అనిశ్చితి,హామీగా పెట్టుకున్న వాటి విలువలో అత్యధిక శాతం రుణం ఇవ్వడం తదితర అంశాలు ప్రధానమైనరిస్కులు. సుందరం ఫాజెనర్స్ ప్రస్తుత ధర రూ.836 టార్గెట్ రూ.1,059 వృద్ధి: 26% ఆటోమోటివ్, ఇన్ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్ తదితర రంగాలకు అవసరమైన పవర్ ట్రెయిన్ విడిభాగాలు, మెటల్ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్ సెగ్మెంట్లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్‌ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. బ్రోకింగ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ.100 టార్గెట్ ధర రూ.135 వృద్ధి: 35% పేరొందిన పాత తరం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటి. బ్యాంక్ మొత్తం అసెట్స్ రూ. 2.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. డిపాజిట్లు రూ. 1.72 లక్షల కోట్లుగా, ఇచ్చిన రుణాలు రూ. 1.34 లక్షల కోట్లుగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రొవిజనింగ్ తగ్గింది. అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ధర రూ.1582 టార్గెట్ ధర రూ.1,859 వృద్ధి: 17% దేశీయంగా ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం. డిపాజిట్లు రూ. 14 లక్షల కోట్లు, ఇచ్చిన రుణాలు రూ. 12 లక్షల కోట్లుగాను ఉన్నాయి. రిటైల్ రుణాల వాటా 46 శాతంగా ఉంది. రెండో త్రైమాసికంలో ఎన్పీఏలు తగ్గడంతో ఊహించిన దానికన్నా మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అసెట్ క్వాలిటీ మెరుగ్గా ఉండటం, ద్వితీయార్ధం వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండటం తదితర అంశాలు ఈ స్టాక్‌కు సానుకూలమైనవి. సుప్రజిత్ ఇంజినీరింగ్ ప్రస్తుత ధర రూ.373 టార్గెట్ ధర రూ.425 వృద్ధి: 13% సుప్రజిత్ ఇంజినీరింగ్ దేశీయంగా ద్విచక్ర వాహనాల సంస్థలు, ప్యాసింజర్ వాహనాల సంస్థలకు ఆటోమోటివ్ కేబుల్స్ సరఫరా చేస్తోంది. ఉత్పత్తులను చౌకగా అందించడం ద్వారా మార్కెట్ షేరును పెంచుకోవడంతో పాటు ప్రస్తుత కస్టమర్ల నుంచి మరింతగా ఆర్డర్లు దక్కించుకుంటోంది. వాహనాల తయారీ సంస్థలు ఉత్పత్తిని పెంచుకునే కొద్దీ సుప్రజిత్ కూడా గణనీయంగా ప్రయోజనాలు పొందగలదు. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర రూ.143 టార్గెట్ ధర రూ.175 వృద్ధి: 22% దేశీయంగా వాణిజ్య వాహనాల విభాగ దిగ్గజాల్లో ఒకటి. మధ్య, భారీ స్థాయి కమర్షియల్ వాహనాల మార్కెట్లో సుమారు 28 శాతం వాటా ఉంది. సీవీ సెగ్మెంట్ కోలుకునే కొద్దీ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలగే సత్తా ఉంది. స్క్రాపేజీ పాలసీ వల్ల కూడా కంపెనీ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. పీఐ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ.2733 టార్గెట్ ధర రూ.3,950 వృద్ధి: 44% అంతర్జాతీయ ఆగ్రోకెమికల్ కంపెనీలకు కస్టమ్ సింథసిస్, తయారీ సొల్యూషన్స్ (సీఎస్ఎం) అందిస్తోంది. కంపెనీ ఆదాయాల్లో ఈవిభాగం వాటా 70 శాతం పైగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ కెమికల్స్, ఫార్మా ఏపీఐ, ఫ్లోరో కెమికల్స్ మొదలైన వాటిల్లోకి విస్తరిస్తోంది. బ్రోకింగ్ సంస్థ: యాక్సిస్ సెక్యూరిటీస్ ఏసీసీ లిమిటెడ్ ప్రస్తుత ధర రూ. 2,420 టార్గెట్ ధర రూ. 2,570 వృద్ధి: 6% వ్యయాల తగ్గింపు చర్యలు, ఉత్పత్తులకు భారీ డిమాండ్, మెరుగైన ధర మొదలైనవి కంపెనీకి సానుకూలాంశాలు. ప్రస్తుతం ఈ రంగంలోని మిగతా సంస్థలతో పోలిస్తే షేరు ఆకర్షణీయమైన ధరలో లభిస్తోంది. సైయంట్ ప్రస్తుత ధర రూ.1,105 టార్గెట్ ధర రూ.1,300 వృద్ధి: 17% దీర్ఘకాలిక కోణంలో కంపెనీ వ్యాపార స్వరూపం పటిష్టంగా మారింది. అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు సంస్థ చేతిలో ఉన్నాయి. రూపాయి మారకం తక్కువ స్థాయిలో ఉంటడం, ప్రయాణ వ్యయాలు.. ఆన్ సైట్ వ్యయాలు తగ్గటం వంటి కారణాలతో సమీప భవిష్యత్తులో సైయంట్ ఆదాయాలు మరింత మెరుగుపడవచ్చు. మైండ్‌ట్రీ ప్రస్తుత ధర రూ.4,627 టార్గెట్ ధర రూ.5,100 వృద్ధి: 10% ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించగలగడంతో పాటు ప్రాజెక్టులను సమర్ధంగా పూర్తి చేయగలిగే ట్రాక్ రికార్డు కంపెనీకి సానుకూలాంశం. రూపాయి క్షీణత, ప్రయాణ వ్యయాలు.. ఆన్ సైట్ వ్యయాలు తగ్గుతుండటం కలిసొచ్చే అంశాలు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర రూ.744 టార్గెట్ ధర రూ.940 వృద్ధి: 26% నవీకరించిన కొత్త వ్యాపార విధానం ఊతంతో తీవ్రమైన పోటీ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడంతో పాటు మార్కెట్ వాటాను కూడా పెంచుకోగలిగే అవకాశం ఉంది. బ్రాండ్ రీకాల్, వివిధ రకాల కస్టమర్లకు వినూత్న ఆఫర్లు అందిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ధర రూ.1,178 టార్గెట్ ధర రూ.1,350 వృద్ధి: 14% ప్రైవేట్ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఎస్బీఐ లైఫ్‌కు అత్యంత విస్తృతమైన బ్యాంక్ఎష్యూరెన్స్ నెట్వర్క్ ఉంది. కార్యకలాపాలను స్వల్ప వ్యవధిలో విస్తరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వ్యయాలకు సంబంధించిన నిష్పత్తులు అత్యంత తక్కువగా ఉండటం వల్ల వ్యాపా రం నెమ్మదించినా మార్జిన్లపై ఎక్కువగా ప్రభావం పడకపోవడం, లాభదాయక పాలసీలపై దృష్టి పెడుతుండటం సంస్థకు సానుకూలాంశం. బ్రోకింగ్ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుందరం ఫాజెనర్స్ ప్రస్తుత ధర రూ. 836 టార్గెట్ రూ. 1,059 వృద్ధి: 26% ఆటోమోటివ్, ఇన్ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్ తదితర రంగాలకు అవసరమైన పవర్ ట్రెయిన్ విడిభాగాలు, మెటల్ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్ సెగ్మెంట్లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్‌ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత ధర రూ. 101 టార్గెట్ ధర రూ. 120 వృద్ధి: 18% క్రమంగా కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలను ఎత్తివేత, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం తదితర అంశాల ఊతంతో రుణ వృద్ధి మరింత పుంజుకుంటుంది. మొండిబాకీలను బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడంతో ఎన్పీఏల భారం తగ్గుతుంది. డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రావాల్సిన బాకీలు కూడా క్రమంగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ప్రస్తుత ధర రూ. 253 టార్గెట్ ధర రూ. 300 వృద్ధి: 18% మెటీరియల్ హ్యాండ్లింగ్, నిర్మాణ రంగ పరికరాల వ్యాపారం పటిష్టంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. రాబోయే మూడు–నాలుగేళ్లలో 35–30 శాతం పెరగవచ్చని అంచనా. వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీకి ఇది సానుకూలాంశం. బాటా ఇండియా ప్రస్తుత ధర రూ. 2,036 టార్గెట్ ధర రూ. 2,380 వృద్ధి: 17% వ్యయాలను తగ్గించుకోవడం, వివిధ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగించడం, ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేర్పులు మొదలైనవి కంపెనీకి లాభించగలవు. అలాగే భారం పెంచుకోకుండా ఫ్రాంచైజీ విధానంలో రిటైల్ నెట్‌వర్క్‌ను క్రమంగా పెంచుకుంటూ ఉండటం సంస్థకు సానుకూల అంశం. మహీంద్రా లైఫ్‌స్పేస్ ప్రస్తుత ధర రూ. 283 టార్గెట్ ధర రూ. 325 వృద్ధి: 14% పటిష్టమైన మాతృ సంస్థ తోడ్పాటు, కార్యకలాపాల స్థాయిని విస్తరించడంపై మేనేజ్మెంట్ మరింతగా దృష్టి పెడుతుండటం కంపెనీకి సానుకూల అంశాలు. కొత్తగా కొనుగోలు చేసిన స్థలాలతో రెసిడెన్షియల్ వ్యాపారాన్ని కూడా పెంచుకోవడానికి తోడ్పడగలదు. మధ్యకాలికంగా షేర్ టార్కెట్‌ను తాకవచ్చు. -
ఈ ఏడాదీ ‘బుల్’ దూకుడే..
* స్టాక్ మార్కెట్లో కొత్త రికార్డులకు సంవత్ 2071 రెడీ: నిపుణులు * ఐటీ, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ హవా * సిమెంట్, ఇన్ఫ్రా రంగాలకు డిమాండ్ న్యూఢిల్లీ: హిందూ కొత్త సంవత్సరం 2,071లో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పుతాయని పలువురు నిపుణులు అంచనా వేశారు. ఈ దీపావళి రోజున మొదలైన 2,071 తొలి రోజునే మార్కెట్లు లాభాలు ఆర్జించిన నేపథ్యంలో విశ్లేషకుల అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత ఏడాదిలో(దీపావళి నుంచి దీపావళికి) ఇన్వెస్టర్లకు లాభాలపంట పండుతుందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఇటీవల కొంతమేర జోరు తగ్గినప్పటికీ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీ స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. ఇటీవలే ముగిసిన 2,070 ఏడాదిలో మార్కెట్ ప్రామాణిక సూచీలు చరిత్రాత్మక గరిష్ట స్థాయిలను అందుకున్న కారణంగా నిపుణుల అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. సెన్సె క్స్ 5,590 పాయింట్లు(26%) పురోగమించి తొలిసారి 27,300ను దాటగా, నిఫ్టీ సైతం 8,180 పాయింట్ల మైలురాయిని అధిగమించిన విషయం విదితమే. రిటైల్ ఇన్వెస్టర్లు వస్తారు స్టాక్ సూచీలు కొత్త రికార్డులను అందుకుంటున్నకొద్దీ మార్కెట్లోకి రిటైల్ ఇన్వెస్టర్ల రాక పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వెరసి ఈ ఏడాది రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా జత కలుస్తాయని అంచనా వేశారు. పూర్తిగా ఎఫ్ఐఐల పెట్టుబడులపైనే ఆధారపడుతున్న దేశీ మార్కెట్లకు రిటైలర్లరాక బలాన్నిస్తుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో డెరైక్టర్ ఎస్కే గోయల్ విశ్లేషించారు. ప్రస్తుత హిందూ సంవత్సరం 2,071లో మార్కెట్ పురోగమించే పరిస్థితులున్నప్పటికీ, భారీ హెచ్చుతగ్గులకు కూడా అవకాశముందని పేర్కొన్నారు. ఇప్పటికే ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న ఐటీ, ఫార్మా, ఆటో, వినియోగ వస్తువులు, బ్యాంకింగ్ రంగాలు ఇకపై కూడా ముందంజలో ఉంటాయని అంచనా వేశారు. మరోవైపు కొత్త పట్టణాల నిర్మాణంపై ప్రధాని మోడీ దృష్టిపెట్టిన కారణంగా సిమెంట్, ఇన్ఫ్రా రంగాల షేర్లకు డిమాండ్ పుడుతుందని పేర్కొన్నారు. ఇకపై సంస్కరణల వేగం: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరలేపుతుందన్న అంచనాలు మార్కెట్లలో పెరిగాయని నిపుణులు తెలిపారు. దీంతో రాజ్యసభలోనూ బిల్లులను సులభంగా పాస్ చేయించేందుకు వీలు చిక్కుతుందని చెప్పారు. తద్వారా వేగవంత నిర్ణయాలకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ అంశాలన్నీ ఎఫ్ఐఐలకు నమ్మకాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. సుస్థిర ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ రికవరీ వంటివి మార్కెట్లలో తదుపరి ర్యాలీకి దారిచూపుతాయని జియోజిత్ బీఎన్పీ రీసెర్చ్‌హెడ్ అలెక్స్ మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. ‘ముహూరత్’ లాభాలతో మార్కెట్ షురూ దీపావళి రోజైన గురువారం గంటంపావు పాటు జరిగిన ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ ఇన్వెస్టర్లకు లాభా లను పంచింది. వెరసి నిఫ్టీ మళ్లీ 8,000 పాయింట్ల మైలురాయికిపైన నిలిచింది. 19 పాయింట్ల లాభంతో 8,014 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా 64 పాయింట్లు పెరిగి 26,851 వద్ద స్థిరపడింది. ప్రధానంగా చిన్న షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1%పైగా జంప్‌చేశాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 1,979 లాభపడగా, 533 నష్టపోయాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో విప్రో 3.6% క్షీణించింది. అయితే మరోవైపు బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, రిలయన్స్, హిందాల్కో, ఎల్అండ్టీ, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్ 1.5-0.5% మధ్య బలపడ్డాయి. దీపావళి బలిప్రతిపద కారణంగా శుక్రవారం మార్కెట్లు పనిచేయలేదు.