breaking news
Salman Khan Films
-
సల్మాన్ పేరుతో మోసం!
‘‘నా పేరుని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు సల్మాన్‌ఖాన్. ‘సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్’(ఎస్కేఎఫ్) అనే నిర్మాణ సంస్థను స్థాపించి సల్మాన్ సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎస్కేఎఫ్’లో నిర్మించనున్న సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామన్నట్లుగా పలువురికి ఫేక్ ఈ–మెయిల్స్ అందుతున్నాయట. ఈ విషయంపై సల్మాన్ స్పందించారు. ‘‘నేను నటించబోతున్న సినిమాల్లో కానీ, ఎస్కేఎఫ్ సంస్థలో నిర్మించబోతున్న సినిమాల కోసం కానీ ప్రస్తుతం ఏ క్యాస్టింగ్ (నటీనటుల ఎంపిక) జరగడం లేదు. మేం ఎటువంటి క్యాస్టింగ్ ఏజెంట్స్‌ని నియమించలేదు. మా సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామన్నట్లుగా వస్తున్న ఈ మెయిల్స్, మెసేజ్‌లను, వార్తలను నమ్మవద్దు. ఎస్కేఎఫ్ బ్రాండ్‌ను, అలాగే నా పేరును దుర్వినియోగం చేసినవారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని సల్మాన్‌ఖాన్ పేర్కొన్నారు. -
బాలీవుడ్ దిగ్గజాలకు టాక్స్ నోటీసులు
ముంబై : బాలీవుడ్ దిగ్గజాలకు సర్వీసు టాక్స్ నోటీసులు జారీ అయ్యాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్ లాంటి అధిక పేరు ప్రఖ్యాతలున్న మూవీ మేకర్లు, యాక్టర్లకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఎఫ్సీ) ఈ నోటీసులు జారీచేసింది. అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్‌లాంటి స్టార్ హీరోలకు ఎంత మొత్తంలో రెమ్యూనురేషన్ చెల్లించారో తెలపాలని ఆదేశిస్తూ టాప్ ప్రొడక్షన్ హోస్లకు ఈ నోటీసులు పంపింది. అదేవిధంగా యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ లాంటి ప్రొడక్షన్ సంస్థల నుంచి యాక్టర్లు తీసుకున్న రెమ్యూనురేషన్ వివరాలు తెలపాలని యాక్టర్లనూ సీబీఎఫ్సీ ఆదేశించింది. అధిక పేరు ప్రఖ్యాతలున్న సర్వీసు టాక్స్ ఎగవేతదారుల సమాచార ఏరివేతలో భాగంగా, పన్ను అధికారులు ఈ నోటీసులు జారీచేస్తున్నట్టు గ్లామర్ వరల్డ్ చెబుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్‌లు తాజాగా సర్వీసు టాక్స్ డివిజన్ నుంచి ఈ నోటీసులు అందుకున్నారని దీనికి సంబంధించిన ఓ అధికారి చెప్పారు. ఇంటిలిజెన్స్ ఆఫీసర్లు వారి వద్ద నుంచి చెల్లింపులు, రెమ్యూనురేషన్ వివరాలను కోరుతూ ఈ ఎంక్వయిరీ లేఖలు పంపారని ఆయన పేర్కొన్నారు. బాలీవుడ్ లో సర్వీసు టాక్స్ ఎగవేతదారులను గుర్తించే పనిలో డిపార్ట్మెంట్ ప్రస్తుతం నిమగ్నమైందని, ఈ వారంలోనే వారినుంచి సమాచారాన్ని కోరే అవకాశముందని తెలుస్తోంది. ఏక్తా టైగర్, ధూమ్ 3, బాజీరావ్ మస్తానీ, బజరంగీ భాయిజాన్, సుల్తాన్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీలను ఈ ప్రొడక్షన్ సంస్థలు, నటులు తీశారు.