నలుగురితో ప్రేమాయణం.. ముగ్గురితో పెళ్లి..ఇప్పుడు సింగిల్‌గానే స్టార్ హీరోయిన్!
చిత్రపరిశ్రమలో ప్రేమ వివాహాలు ఎంత కామనో.. విడాకులు అంతే కామన్. జీవితాంతం కలిసి ఉంటామంటూ గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని..కొన్నాళ్లకే విడాకులకు అప్లై చేసిన జంటలు చాలానే ఉన్నాయి. ఇక లవ్ బ్రేకప్‌ల గురించి చెప్పనక్కర్లేదు. ఇలా ప్రేమలో పడి..అలా విడిపోయిన వారు పదుల సంఖ్యల్లో ఉన్నారు. ప్రేమ, పెళ్లిళ్లపై విరక్తి కలిగి ఒంటరి జీవితమే బెటర్ అనుకొనే‘స్టార్స్’ సైతం ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ నటి సల్మా ఆఘా(Salma Agha) ఒకరు. నలుగురితో ప్రేమాయణం నడిపి..ముగ్గురిని పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఈ నటి..పర్సనల్ లైఫ్ ఓ విషాద ప్రేమకథ చిత్రాన్ని గుర్తు చేసేలా ఉంటుంది.1982లో వచ్చిన ‘నికాహ్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సల్మా.. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ‘దిల్ కే ఆర్మాన్’ అనే పాటను కూడా ఆలపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ‘కసమ్ పైదా కర్నేవాలేకీ’, ‘బాబీ’, ‘కోబ్రా’, ‘ఫూలన్ దేవి’'పతీ పత్నీ ఔర్ తవైఫ్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించింది.ఇలా కెరీర్ పరంగా వరుస విజయాలతో ‘స్టార్’ హీరోయిన్గా ఎదిగిన సల్మా..వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస పరాజయాలే అందుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పడు లండన్ వ్యాపారవేత్త అయ్యాజ్ సిప్రాతో ఆమె ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు రిలేషన్లో ఉన్నా.. అది పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ నటుడు జావేద్ షేక్‌ని పెళ్లి చేసుకొని..కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. తర్వాత స్క్వాచ్ ప్లేయర్ రెహ్మత్ ఖాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. 2011లో దుబాయ్ వ్యాపారతవేత్త మంజర్ షాని పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్ల తర్వాత ఆయనకు కూడా విడాకులు ఇచ్చింది. 67 ఏళ్ల వయసు ఉన్న సల్మా ప్రస్తుతం ముంబైలో ఒంటరిగానే ఉంటుంది.