breaking news
Salarjung Colony
-
హైదరాబాద్లో రూ. కోటి విలువైన వజ్రాలు చోరీ
-
హైదరాబాద్లో రూ. కోటి విలువైన వజ్రాలు చోరీ
హైదరాబాద్: నగరంలోని లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాలార్జంగ్ కాలనీలోని ఓ వ్యాపారి ఇంట్లో గురువారం భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివసిస్తున్న సునీల్ అగర్వాల్ ఇంట్లో రూ. కోటి విలువైన వజ్రాలతోపాటు భారీగా నగలు, నగదు దుండగులు అపహరించుకుని పోయారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు సునీల్ అగర్వాల్ ఇంటికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.