breaking news
Sakshi Mhadolkar
-
నాన్‌స్టాప్ వినోదానికి సై
‘‘రండి... స్వాగతం’ అంటూ సాక్షి మడోల్కర్ని ఆహ్వానించింది ఆమె నటిస్తున్న తాజా చిత్రం యూనిట్. శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సాక్షి మడోల్కర్ని కథానాయికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తెలియజేసేలా ఓ ఫన్నీ వీడియోను విడుదల చేశారు. సూపర్ హిట్ మూవీ ‘సామజవరగమన’ తర్వాత హీరో శ్రీ విష్ణు–దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ఇది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘‘ఓ వినూత్న తరహా కథాంశంతో, హై వోల్టేజ్ హ్యుమర్ ఉన్న కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నాన్–స్టాప్ వినోదాన్ని అందించేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
‘మోగ్లీ 2025’ థ్యాంక్స్ మీట్..ముఖ్య అతిథిగా హీరో సాయిదుర్గా తేజ్ (ఫొటోలు)
-
'మోగ్లీ' మూవీ రిలీజ్..ట్రెండింగ్‌లో హీరోయిన్ సాక్షి మడోల్కర్ (ఫొటోలు)


