breaking news
sagiraju rajamraju
-
సీనియర్ నటుడు ముక్కురాజు కన్నుమూత
-
సీనియర్ నటుడు ముక్కురాజు కన్నుమూత
సీనియర్ నటుడు సాగిరాజు రాజంరాజు (ముక్కు రాజు) గురువారం ఉదయం మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో ఆయన నటించారు. కొరియోగ్రాఫర్‌గా సినీ రంగంలో ప్రవేశించిన ఆయన.. పలు చిత్రాలలో అనేక పాత్రలు పోషించారు. ఆర్. నారాయణమూర్తి తీసే సినిమాల్లో దాదాపు ప్రతి దాంట్లోనూ ముక్కురాజు పాట, పాత్ర తప్పనిసరిగా కనిపిస్తుంటాయి. 1940లో ఒక గ్రామం చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ముక్కురాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శుక్రవారం నాడు ముక్కురాజు అంత్యక్రియలు జరుగుతాయి. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)