breaking news
s shekhar
-
‘థ్యాంక్స్ శంకర్.. మోదీని బాగా వెనుకేసుకొచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘ అబ్కీ బార్ ట్రంప్ సర్కార్’ వ్యాఖ్యల పట్ల విదేశాంగమంత్రి ఎస్ శంకర్ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. ‘శంకర్ గారు మీకు ధన్యవాదాలు. ప్రధాని మోదీ అసమర్థతను బాగా కప్పిపుచ్చుకొచ్చారు. ట్రంప్ అభ్యర్థిత్వానికి మోదీ మద్దతు పలికి భారత విదేశాంగ విధానాన్ని ఉల్లంఘించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య భారతానికి సమస్యలు తెచ్చేలా ఉన్నాయి. భారత దౌత్యం గురించి మోదీకి మీరైన కొంచెం చెప్పండి’ అంటూ రాహుల్ ట్విట్ చేశారు. (చదవండి : భారత్‌కు ట్రంప్ నిజమైన ఫ్రెండ్) హ్యూస్టన్ నగరంలో ఇటీవల జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్‌ని పరిచయం చేస్తూ.. ‘ట్రంప్ భారత్ సత్సంబాలు కొనసాగిస్తోంది. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరో సారి అధికారంలోకి రావాలి (అబ్కీ బార్ ట్రంప్ సర్కార్) కోరుకుంటున్నాను’ అని మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ.. ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికి భారత విదేశాంగ విధానికి ఉల్లంగించారని ఆరోపించారు. దీని వల్ల భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య బంధం దెబ్బతినే అవకాశం ఉందని విమర్శించారు. అయితే మోదీ వ్యాఖ్యలను మంత్రి జైశంకర్ సమర్థించారు. మోదీ ట్రంప్‌కు మద్దతు పలకలేదన్నారు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటున్న ట్రంప్.. అధ్యక్ష అభ్యర్థిగాను ఇండియన్ అమెరికన్లతో బంధాన్ని కోరుకుంటున్నట్లు తనకు అర్థమవుతుందని మాత్రమే మోదీ అన్నారని, అంతే కానీ మద్దతు ఇవ్వలేదని విరణ ఇచ్చారు. Thank you Mr Jaishankar for covering up our PM’s incompetence. His fawning endorsement caused serious problems with the Democrats for India. I hope it gets ironed out with your intervention. While you’re at it, do teach him a little bit about diplomacy.https://t.co/LfHIQGT4Ds — Rahul Gandhi (@RahulGandhi) October 1, 2019 -
సాయమడిగితే ఎంపీ కవిత తక్షణమే స్పందన
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేసుకునే పండగ బతుకమ్మ. అయితే ఆ పండుగ కోసం పండుగ కోసం పూలు కోసి తెచ్చేందుకు వెళ్లిన ప్రయత్నంలో తనకు కరెంట్ షాక్ తగిలిందని.. ఈ ప్రమాదంలో తాను రెండు కాళ్లు కోల్పోయానని.. తనకు సాయం చేయాలని మంచిర్యాల, నస్పూర్ కు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఎస్ శేఖర్ ట్విట్టర్ ద్వారా టీఆర్ఎస్ ఎంపీ కవితను కోరారు. ఈ ఘటన 2014 జనవరి 10వ తేదీన జరిగిందని.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసిన ఎలాంటి సాయం అందలేదని బాధితుడు శేఖర్ ట్విట్లో పేర్కొన్నాడు. బాధితుడు శేఖర్ ట్వీట్ పై ఎంపీ కవిత వెంటనే స్పందించారు. మీకు తప్పకుండా సహాయం చేస్తామని ఆమె రీట్వీట్ చేశారు. శేఖర్ పూర్తి వివరాలను సంతోష్.జాగృతి@జీమెయిల్.కామ్ కు పంపించాలని ఆమె ట్వీట్ లో సూచించారు. గత కొన్ని రోజుల నుంచి తనకు సాయం చేయాలని శేఖర్ ట్వీట్లు చేస్తుండగా ఎట్టకేలకు అతడికి సాయం అందనుంది. రెండు కాళ్లు కోల్పోయినప్పుడు ట్రీట్ మెంట్ కోసం దాదాపు రూ.18 లక్షలు ఖర్చుపెట్టామని.. ఆర్థికంగా ఆదుకోవాలని ఇటీవల వరుస ట్వీట్లు చేశాడు. ఈసీఈ విభాగంలో బీ.టెక్ పూర్తిచేసిన తనకు వికలాంగుల కోటాలో తన చదువుకు తగ్గ జాబ్ ఇప్పించాలని ఇటీవల టీఆర్ఎస్ నేతలకు మొర పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఎంపీ కవిత బాధితుడు శేఖర్ ట్వీట్లపై స్పందించి.. తప్పకుండా సాయం చేస్తామని, వివరాలు తెలపాలని చెప్పారు. Tappakunda .. pls send me your details on santosh.jagruthi@gmail.com https://t.co/Oz9RzIeeP4 — Kavitha Kalvakuntla (@RaoKavitha) 4 April 2017 @RaoKavitha madam 10.1.14 roju bathukamma flwrs ki velli curent shock valla 2legs poyayi CM fond apply chesam raledu madam plz ippinchandi pic.twitter.com/hfvYh9W3qs — s shekhar (@shekhar436) 4 April 2017