గని ప్రమాదంలో కార్మికుడి మృతి
► ఆర్కే న్యూటెక్‌లో అదుపుతప్పి ఢీకొట్టిన ఎస్డీఎల్ యంత్రం
► కాలు విరిగిన టింబర్‌మన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
► రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియాకు కార్మిక సంఘాల డిమాండ్
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : ఆర్కే న్యూటెక్ గనిలో టింబర్‌మన్ కార్మికుడు ఎడ్ల మల్లయ్య(59) ఎస్డీఎల్ యంత్రం ఢీకొని మృతి చెందా డు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి షిఫ్టు డ్యూటీకి హాజరైన మల్లయ్య గనిలోని 41 డిప్ స్లైస్ఆఫ్, 31 లెవల్, 1ఏఎస్3 ప్యానల్ వద్ద తోటి కార్మికులతో విధులు నిర్వర్తిస్తున్నాడు. కింది వైపు దిమ్మెలు కట్టాల్సి ఉంది. ఇందుకు దిమ్మెలను అక్కడున్న ఎస్డీఎల్ యంత్రం బకెట్ లో నింపి దానిని పని స్థలం వద్దకు తరలించేందుకు ఏర్పా టు చేసుకున్నాడు.
ఈక్రమంలో మరో కార్మికుడు యంత్రా ని నడుపుకుంటూ వస్తుండగా పని స్థలం వద్ద ఆపినా అదుపు కాకజారుకుంటూ వెళ్లి మల్లయ్యను ఢీకొట్టింది. దీంతో బకెట్ కింద అతడి కుడి కాలు నలిగి విరిగిపోయిం ది. తోటి కార్మికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు మల్లయ్యను రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించా రు. తీవ్ర రక్తస్రావం కావడంతో కరీంనగర్ అపోలో రీచ్‌కు పంపించారు. మల్లయ్య అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ప్రమాద స్థలాన్ని ఏజెంట్ జాన్ఆనంద్, గని మేనేజర్ వెంగళ్రావు సందర్శించారు. ప్రమాదపై జీఎం సుభాని సమీక్షించారు. మల్లయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
మృతుడి కుటుంబానికి మ్యాచింగ్ గ్రాంట్‌తో సరిపెట్టకుండా రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏఐటీయూసీ బ్రాంచీ సెక్రెటరీ కొట్టె కిషన్‌రావు ఒక ప్రకటనలో యూజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.