breaking news
Russian scientist
-
150 ఏళ్లు బతకడం సైన్స్ ఫిక్షన్ కాదు
మాస్కో: వందేళ్లు హాయిగా జీవించిన వ్యక్తులను పూర్ణాయుశ్కులు అంటుంటాం. అయితే అంతకంటే మరో 50 ఏళ్లు ఎక్కువే జీవించగల ఎంతో మంది వ్యక్తులు మన మధ్యే ఉన్నారని రష్యా శాస్త్రవేత్త విటాలీ కోవల్యోవ్ వ్యాఖ్యానించారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్న ఈయన ఈయన తాజాగా వైద్య, ఆరోగ్య సంబంధ విషయాలను వివరించే బయోపాలిటిక్స్ ఛానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘వృద్దాప్య ఛాయల్లోకి పడిపోవడం ఇటీవల తగ్గింది. 150 ఏళ్లు జీవించడం అనేది సైన్స్ ఫిక్షన్ కానేకాదు. 150 ఏళ్లు జీవించగల సత్తా ఉన్న మనుషులెందరో ఇటీవల పుట్టారు. వాళ్లలో కొందరు ఇప్పుడు 20 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల వయసులో ఉన్నారు. వృద్దాప్యాన్ని నెమ్మదింపజేసే ప్రయోగాలెన్నో జరుగుతున్నాయి. వృద్దాప్య వేగాన్ని తగ్గించడం అసాధ్యం అనేది తప్పుడు భావన. 150 ఏళ్లు పైబడిన తర్వాత కూడా మనిషి హాయిగా జీవించగలిగే ఔషధాల సృష్టికి ప్రయోగాలు జరుగుతున్నాయి’’అని ఆయన అన్నారు. గత నెలలో బీజింగ్‌లోని తియాన్మెన్స్కే్వర్లో జరిగిన చైనా సైనిక పరేడ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్యే అచ్చం ఇలాంటి అంశంపైనే మాటామంతీ జరగడం తెల్సిందే. ‘‘జీవసాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోంది. ముసలివైపోతున్న, పాడవుతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మారి్పడి చేసుకుంటూ మనిషి చాన్నాళ్లు జీవించవచ్చు. ఇలా నూతన అవయవాలతో యవ్వన ఛాయతో మెరుగైన జీవనం సాధ్యమే. బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువునూ జయించవచ్చు’’అని జిన్‌పింగ్‌తో పుతిన్ వ్యాఖ్యానించడం తెల్సిందే. -
క్యాన్సర్‌పై రామబాణం...ఎంటెరోమిక్స్
మాస్కో: క్యాన్సర్. ఏటా లక్షల మందిని పొట్టన పెట్టుకుంటున్న ప్రపంచవ్యాప్త మహమ్మారి. సరైన చికిత్స లేక జీవితాంతం క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు కోకొల్లలు. అలాంటి ప్రాణాంతక వ్యాధి నివారణకు రష్యా సైంటిస్టులు నూతన టీకా (వ్యాక్సిన్)ను అభివృద్ధి చేశారు. దీనిపై ఇప్పటికే ఏడాదిపాటు పరిశోధనలు, మూడేళ్లపాటు ముందస్తు క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. త్వరలో క్లినికల్ ప్రయోగాలు జరపనున్నట్టు తయారీ సంస్థ ఫెడరల్ మెడికల్, బయోలాజికల్ ఏజెన్సీ (ఎఫ్ఎంబీఏ) వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కు ‘ఎంటెరోమిక్స్’ అని పేరుపెట్టారు. కొన్ని రకాల కోవిడ్–19 నివారణ టీకాల తరహాలోనే దీని అభివృద్ధికి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని వాడారు. వ్యాక్సిన్ల అభివృద్ధికి సాధారణంగా నిర్జీవ వైరస్‌ను ఉపయోగిస్తారు. కానీ ఎంఆర్ఎన్ఏతో తయారైన టీకాలు మాత్రం శరీర కణాలే ప్రొటీన్లను ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి. అలా రూపొందించిన ఈ కొత్త టీకాతో శరీరంలో ఉత్పత్తయ్యే ప్రొటీన్లే క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసేలా రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు వెల్లడైంది. దీన్ని పలుమార్లు తీసుకున్నా శరీరంలో దు్రష్పభావాలేవీ కనిపించడం లేదని, పైగా అత్యంత ప్రభావవంతంగా పని చేస్తోందని తేలింది. ఈ వ్యాక్సీన్ పూర్తి సురక్షితమని పరిశోధకులు హామీ ఇస్తున్నారు. పలు కేసుల్లో క్యాన్సర్ గడ్డల పరిమాణాన్ని ఈ వ్యాక్సిన్ ఏకంగా 60 శాతం నుంచి 80 శాతం దాకా తగ్గిస్తున్నట్లు వెల్లడైంది! ప్రధానంగా పెద్ద పేగు, బ్రెయిన్, చర్మ క్యాన్సర్‌కు ఇది రామబాణమేనని అంటున్నారు. రష్యాలోని వ్లాడివోస్తోక్‌లో 10వ తూర్పు ఆర్థిక వేదిక సదస్సులో ‘ఎంటెరోమెక్స్’ టీకా గురించి ప్రకటించారు. 75 దేశాలకు చెందిన 8,400 మంది పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. -
మరో అద్భుతం ఆవిష్కరణ!
మనిషి తన మేధోశక్తితో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించాడు. సృజనాత్మకతతో ఎన్నో వింతలను సృష్టించాడు. ఊహకు అందని అరుదైన రికార్డులను లిఖించాడు. ఓ రష్యా సైంటిస్ట్ సాంకేతికతను మెరుగుపరచి అరుదైన పుస్తకాన్ని రూపొందించాడు. సిబేరియా ప్రావిన్స్‌లోని నొవోసిబిర్క్కు చెందిన వ్లాదిమిర్ అనిస్కిన్ అనే శాస్త్రవేత్త అతిచిన్న పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ప్రపంచంలో ఇదే అతిచిన్న పుస్తకమని చెబుతున్నాడు. పరిశీలన కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపనున్నాడు. ఈ మైక్రో బుక్ పేజీల కొలత 0.07 మిల్లీ మీటర్లు నుంచి 0.09 మిల్లీ మీటర్లు వరకు ఉంటుంది. దీన్ని తయారు చేయడం కోసం అవసరమయ్యే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి అనిస్కిన్కు ఐదు సంవత్సరాల సమయం పట్టింది. కాగా సాంకేతికత అందుబాటులోకి వచ్చాక నెల రోజుల్లోనే రెండు వర్సెన్లను రూపొందించాడు. ఈ రెండు వర్సెన్లలో ఓ పుస్తకానికి లెవ్షా అని పేరు పెట్టాడు. ఇది 19వ శతాబ్ధంలో రష్యాలో ప్రఖ్యాత గాథ 'ది స్టీల్ ఫ్లీ'కు సంబంధించినది. ఇక రెండో పుస్తకం పేరు అల్ఫాబెట్. ఇది రష్యా అల్ఫాబెట్‌కు సంబంధించినది. అనిస్కిన్ ఈ మైక్రో బుక్‌ను వాల్ కేలండర్ రూపంలో రూపొందించాడు. 3 నుంచి 4 మైక్రాన్ల మందం గల ఫిల్మ్ షీట్లపై లిథోగ్రఫీ (రాతి అచ్చు సంబంధమైన) పద్ధతి ప్రకారం అక్షరాలను ముద్రించినట్టు అనిస్కిన్ చెప్పాడు. అక్షరాలను ముద్రించడం కంటే ఈ పేజీలను పుస్తక రూపంలో బైండింగ్ చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని తెలిపాడు. పేజీకి ఇరువైపులా అక్షరాలుంటాయి. వీటిని నేరుగా చదవడానికి వీలుకాదు. సూక్ష్మ పరికరం సాయంతో వీటిని చదవవచ్చు. గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం ప్రపంచంలో అతిచిన్న పుసక్తం తయారు చేసిన రికార్డు ఇప్పటివరకు జపనీస్ మాస్టర్స్ పేరిట ఉంది. దీన్ని 2003లో తయారు చేశారు. ఈ పుసక్తంతో పోలిస్తే అనిస్కిన్ తాజాగా తయారు చేసిన పుస్తక పరిణామం 88 రెట్లు తక్కువ.


