breaking news
Rs500
-
రూ.500లతో ఐఏఎస్‌ల పెళ్లి
నిరాడంబరంగా విజయవాడ సబ్ కలెక్టర్ సలోని వివాహం విజయవాడ : కేవలం రూ.500లకే పెళ్లి జరిగిపోయింది. ఏంటి మరీ నిరుపేద కుటుంబంలో పెళ్లి కాబోలు అనుకుంటున్నారట..కాదండి నెలకు దంపతులిద్దరి జీతం కలిపి ఐదంకెలు ఉంటుంది. అబ్బో అయితే అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలి కదా అనే కదా మీ అనుమానం..అందరూ ఒకలా ఉండరండి..వీరు ఆదర్శ దంపతులు. అందుకే కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు. వృథా ఖర్చులకు మంగళం పాడారు. ఈ యువ జంటే విజయవాడ సబ్ కలెక్టర్ సలోని సిదాన, మధ్యప్రదేశలోని గోహడ సబ్ డివిజనల్ మేజిసే్ట్రట్ (సబ్ కలెక్టర్) ఆశిష్ వశిష్ట. వీరిద్దరూ ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో 2013లో ఐఏఎస్ పూర్తి చేశారు. ఇరు కుటుంబాల సభ్యులతో కలిసి వారు నిరాడంబరంగా నవంబర్ 28న వివాహం చేసుకున్నారు. వివాహ కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానించకపోవటం గమనార్హం. వివాహం జరిగిన రెండో రోజు సాయంత్రమే వారిద్దరూ తమ ఉద్యోగ విధుల్లో జాయిన్ అయ్యారు. -
కోటికి పైగా విలువైన పాతనోట్లు అపహరణ!
ఒడిశా : ప్రభుత్వం ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో పాత కరెన్సీ నోట్లను తీసుకోవడానికే కాదు కనీసం చూడటానికే ఎవరూ మొగ్గుచూపడం లేదు. అలాంటిది ఓ బ్యాంకు నుంచి కోటికి పైగా పాత కరెన్సీ నోట్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. సోమవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల వీకెండ్ సెలవు అనంతరం ఒడిశా గ్రామ్య బ్యాంకు శాఖను తెరిచిన అధికారులు బ్యాంకులో నగదు దొంగతనానికి గురైనట్టు గుర్తించినట్టు దెంకనల్ టౌన్ పోలీసు స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్పెస్టర్ అభినవ్ డాల్వ తెలిపారు. బ్యాంకులో మొత్తం రూ.8 కోట్ల పాత కరెన్సీ నోట్లు ఉన్నాయని, వాటిలో రూ.1.15 కోట్లు కలిగిఉన్న ఒక ఐరన్ బాక్స్ మిస్ అయినట్టు గుర్తించినట్టు ఆయన చెప్పారు. ఆ నగదంతా రద్దైన పాత కరెన్సీ నోట్లు రూ.500, రూ.1000లవేనని దెంకనల్ ఎస్పీ బసంత్ కుమాన్ పానిగ్రహి పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలను తాము పరిశీలిస్తున్నామని, ఈ దొంగతనానికి బ్యాంకులోని వ్యక్తులే సహకరించినట్టు తాము అనుమానిస్తున్నట్టు చెప్పారు. రూ.7 కోట్ల కరెన్సీని మాత్రం ఓ పటిష్టమైన గదిలో దాచిఉంచడాన్ని చూసి తాము ఆశ్చర్యానికి గురయ్యామని పోలీసులు పేర్కొన్నారు. ఈ బ్యాంకు శాఖ దెంకనల్ టౌన్ పోలీసు స్టేషన్‌కు అడుగు దూరంలోనే ఉంటుందని, దొంగతనానికి పాల్పడిన నిందితుల కోసం స్పెషల్ టీమ్ తో వెతుకులాట ప్రారంభించినట్టు దెంకనల్ ఎస్పీ చెప్పారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో బ్యాంకుల్లో భారీగా పాత నోట్లు డిపాజిట్ అవుతున్న సంగతి తెలిసిందే.