ఎస్బీఐ ఏటీఎంలలో రూ.50, 20 నోట్లు !
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో అల్లాడుతున్న ప్రజలకు బ్యాంకింగ్ సంస్థలు మరింత ఊరట నిచ్చాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారుల నుంచి వసూలు చేసే ఏటీఎం ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. డిసెంబర్ 30 వరకు ఏ ఏటీఎంలోనైనా డబ్బు డ్రా చేసిన ఛార్జీలు పడవని తెలిపింది. ఇప్పటికే ఆర్బీఐ అన్ని మనీ విత్ డ్రా పరిమితులను మార్పులు చేసిన విషయం తెలిసిందే.
నోట్ల మార్పిడి రద్దీ తగ్గిన అనంతరం ఎస్బీఐ ఏటీఎంలలో రూ.50, 20 నోట్లను అందుబాటులోకి తీసుకువస్తామని ఆ సంస్థ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. దీని వల్ల ప్రజలకు చిల్లర కొరత తీరునుంది.