breaking news
Rs 1.6 crore jewellery
-
పేర్లు చెప్పకుండా రూ.1.6 కోట్లు సమర్పించుకున్నారు
-
పేర్లు చెప్పకుండా రూ.1.6 కోట్లు సమర్పించుకున్నారు
మైసూర్: 'అమ్మను మించి దైవం ఉన్నదా?'అనేది తెలుగు పాటే అయినా, తమిళుల కోసమే రాశారేమో అనిపించక మానదు. ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితను అక్కడ చాలామంది దైవం కంటే మిన్నగా భావిస్తారు. ఆమె పాలన వర్ధిల్లాలని ప్రార్థనలు చేస్తారు. అయితే అనారోగ్యం కారణంగా రోజులుగా ఆస్పత్రికే పరిమితమైపోయిన ఆ అమ్మ.. త్వరగా కోలుకోవాలని ముక్కోటి దేవతలను వేడుకుంటున్నారు ఆమె అభిమానులు. ఆ క్రమంలోనే కర్ణాటకలోని మైసూర్ లో చోటుచేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. 'కోదండ ఎస్టేట్' అని మాత్రమే చెప్పి తమ పేర్లను వెల్లడించని తమిళ భక్త బృందం.. అమ్మపేరు మీద రూ.1.6కోట్ల విలువైన ఆభరణాలకు మైసూర్ లోని ఆలయానికి సమర్పించుకున్నారు. మైసూర్ శివారులోని చాముండీ హిల్స్ పైగల గణపతి, ఆంజనేయస్వామి ఆలయాలకు వచ్చిన జయలలిత అభిమానులు.. స్వామివార్ల విగ్రహాలకు భారీ స్థాయిలో ఆభరణాలను ఇచ్చి వెళ్లారు. ఇంత భారీ మొత్తంలో ఆభరణాలు ఇచ్చిన వారు కనీసం పేరైనా చెప్పలేదని, తమిళనాడు సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని తామీ పని చేస్తున్నామని అన్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు మీడియాకు చెప్పారు. వారి మొక్కులు ఫలించి, ఆస్పత్రి వర్గాలు ప్రకటించినట్లు దీపావళిలోపే జయలలిత కోలుకోవాలని కోరుకుందామా..