breaking news
Rooms Tonight
-
బ్రాండెడ్ హోటల్స్‌కు భలే డిమాండ్
బ్రాండెడ్ హోటల్స్‌లో విడిది చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. డిమాండ్ బలంగా ఉండడంతో బ్రాండెడ్ హోటల్స్(Hotels) పరిశ్రమ ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–12 శాతం మేర అధికంగా నమోదవుతుందని క్రిసిల్(Crisil) రేటింగ్స్ నివేదిక తెలిపింది. దేశీయంగా విహార, వ్యాపార ప్రయాణాలు ప్రధానంగా బ్రాండెడ్ హోటళ్ల డిమాండ్‌ను పెంచుతున్నాయని, ఇక ఎంఐసీ విభాగంలో (సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు) వృద్ధి, విదేశీ పర్యాటకుల సందర్శనలు పుంజుకోవడం పరిశ్రమ ఆదాయానికి మద్దతునివ్వనున్నట్టు వివరించింది.బ్రాండెడ్ హోటల్స్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం సైతం 17 శాతం మేర వృద్ధిని నమోదు చేయడాన్ని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రస్తావించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి హోటళ్లలో రూమ్‌ల పెరుగుదల వేగాన్ని అందుకున్నట్టు తెలిపింది. అస్సెట్ లైట్ (సొంతంగా కాకుండా లీజు విధానంలో) నమూనాలో ఇక ముందూ కొత్త గదుల చేరిక వేగాన్ని అందుకుంటుందని అంచనా వేసింది. దీంతో ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద కొత్త గదుల లభ్యత 20 శాతం మించుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–9 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరాలో 11–12 శాతం మేర కొత్త గదులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. బ్రాండెడ్ హోటళ్ల నిర్వహణ మార్జిన్ 100–150 బేసిస్ పాయింట్లు మేర ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో మెరుగుపడుతుందని అంచనా వేసింది. బలమైన నగదు ప్రవాహాలు, అస్సెట్ లైట్ నమూనాలో విస్తరణ, తగినంత మూలధనం సమీకరణతో బ్రాండెడ్ హోటళ్ల రుణ భారం నియంత్రిత స్థాయిలోనే కొనసాగుతుందని పేర్కొంది. ఇది ఆయా హోటళ్ల రుణ పరపతిని బలోపేతం చేస్తుందని తెలిపింది.రూమ్ రేట్లు అప్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాండెడ్ హోటళ్ల సగటు రూమ్ రేట్లు (ARR) 6–7 శాతం మేర పెరుగుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కాకపోతే వచ్చే ఏడాది 3–4 శాతం పెరుగుదలకు పరిమితం అవుతుందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో అదనపు గదులు అందుబాటులోకి రావడం ఇందుకు కారణంగా తెలిపింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11–12 శాతం చొప్పున ఆదాయంలో వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. విహార, వ్యాపార పర్యటనల్లో ఏడు ప్రధాన నగరాలు 25 శాతం వాటా ఆక్రమిస్తాయని.. మిగిలిన మేర ఆధ్యాత్మిక పర్యాటక రూపంలో ఉంటుందని తెలిపింది.ఇదీ చదవండి: నెలరోజుల్లో 13.41 లక్షల మందికి ఉపాధిఆక్యుపెన్సీ ఎలా ఉంటుందంటే..‘నాన్ మెట్రో(Non Metro) నగరాల్లో, విహార గమ్యస్థానాల్లో హోటల్ పరిశ్రమ కార్యకలాపాలు ఎక్కువగా విస్తరణకు నోచుకుంటున్నాయి. దీంతో కొత్త గదుల చేరికలో 60–65 శాతం మేర ఇక్కడే ఉండనుంది. అది కూడా అస్సెట్ లైట్ నమూనాలో కావడంతో, పెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం కూడా ఉండదు’ అని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ పల్లవి సింఘ్ తెలిపారు. పెద్ద మొత్తంలో కొత్త గదులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, అదే సమయంలో ఆక్యుపెన్సీ (రూముల వినియోగం) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 74–75 శాతం స్థాయిలో ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అది ఈ ఏడాది కంటే 1–1.5% తక్కువగా ఉంటుందని పేర్కొంది. వ్యయాలను సమర్థవంతంగా నియంత్రించడం, టెక్నాలజీ, మానవ వనరుల మెరుగైన వినియోగం, అస్సెట్ లైట్ విధానం ఫలితంగా పరిశ్రమ ఎబిటా మార్జిన్ 1–1.5% పెరిగి 2024–25లో 33–34 శాతానికి చేరవచ్చన్నది క్రిసిల్ అంచనా. -
హోటల్ గదుల బుకింగ్ స్టార్టప్ ‘రూమ్స్‌టునైట్’ మూసివేత
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో హోటల్ గదుల బుకింగ్‌కు వీలు కల్పించే మొబైల్ యాప్ ‘రూమ్స్‌టునైట్’ కార్యకలాపాలు అర్థంతరంగా నిలిచిపోయాయి. 1.5 కోట్ల డాలర్ల (రూ.100 కోట్లు) నిధుల సమీకరణలో విఫలం కావడం, ఉన్న పరిమిత నిధులు కాస్తా ఆవిరైపోవడంతో సంస్థ తన కార్యకలాపాలను నిలిపేసింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో సంస్థ యాప్ అందుబాటులో లేదు. సంస్థ వెబ్సైట్ ఓపెన్ చేసినా... బుకింగ్‌కు సంబంధించిన ఫంక్షన్లు పనిచేయడం లేదు. బెంగళూరు కేంద్రంగా రూమ్స్‌టునైట్ కార్యకలాపాలు 2015లో ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా 325 ప్రాంతాల్లోని 4,000 హోటళ్లు కంపెనీ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. సీఈఓగా దీని వ్యవస్థాపకుడు సురేష్జాన్ వ్యవహరిస్తున్నారు. 90–95 మంది ఉద్యోగులను ఐడీఎస్ నెక్స్›్ట బిజినెస్ సొల్యూషన్స్ అనే మరో కంపెనీకి బదలాయించారు.