breaking news
Romour
-
విక్కీతో కత్రినా కైఫ్ టైట్ హగ్.. వీడియో వైరల్
‘ఉరి’ ఫేమ్ విక్కీ కౌశల్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారంటూ రూమర్ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరిలో ఎవరు కూడా వారి రిలేషన్‌షిప్‌పై స్పందించలేదు. తాజాగా వారిద్దరూ టైట్ కౌగిలించుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విక్కీ హీరోగా చేసిన తాజా చిత్రం ‘సర్దార్ ఉద్దం’. ఆ సినిమా ప్రీమియర్ షోకి గెస్ట్‌గా వచ్చింది కత్రినా. ఆ షో అయిపోయిన తర్వాత క్యాట్, ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌ని గట్టిగా హగ్ చేసుకుంది. ఈ వీడియోని వారిద్దరి ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో వారి రిలేషన్షిప్ గాసిప్‌కి ఇంక బలం చేకూరినట్లయింది. ఈ విషయమై ఎవరైన రెస్పాండ్ అవుతారెమో వేచి చూడాలి. చదవండి: కత్రినా కైఫ్‌తో విక్కీ కౌశల్ రిలేషన్షిప్.. టీజ్ చేసిన కపిల్ View this post on Instagram A post shared by VickyKatrina16 (@vickykatrina16) -
కోట్లలో మోసం..? చిక్కుల్లో రజనీ, కమల్ చిత్రాలు!
చెన్నై: తమిళ సినీ రంగంలో దిగ్గజాలతో సినిమాలను నిర్మిస్తున్న లైకా సంస్థ కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిందంటూ వస్తున్న వార్తలు కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై తమిళ పత్రికల్లో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫ్రాన్స్ పోలీసులు ఆ సంస్థకు చెందిన ప్రధాన నిర్వాహకుడి సహా మొత్తం 19 మందిని అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తపాలాశాఖ ద్వారా కోట్లాది రూపాయలను లైకా సంస్థ రహస్య చిరునామాలకు పంపిందనీ, ఆ డబ్బును అక్కడి నుంచి జర్మనీకి తరలించే ప్రయత్నం జరిగిందని తెలిసింది. ఈ విషయంపై యూరప్ దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ కు చెందిన పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, లైకా సంస్థ గతంలో శ్రీలంక కేంద్రంగా టెలికాం వ్యాపారాలను నడుపుతున్నట్లు ఆరోపణలను ఎదుర్కొంది. సంస్థ యజమాని అలీరాజా సుభాష్ కరణ్ కు బ్రిటన్, ఫ్రాన్స్ లలో సిమ్ కార్డుల వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా కార్యాలయాలను కలిగివుంది. సినీరంగంలో నిర్మాణ సంస్థగా అడుగుపెట్టిన లైకా.. విజయ్ తో కత్తి చిత్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత రజనీకాంత్ తో 2.0, కమల్ హాసన్ తో శభాష్ నాయుడు చిత్రాలకు నిర్మాణసంస్థగా వ్యవహరిస్తోంది. విదేశాలకు అక్రమంగా రూ.129 కోట్లను తరలించారని, ఈ విషయం తెలుసుకున్న ఫ్రాన్స్ పోలీసులు సంస్థ ప్రధాన నిర్వహకుడిని అరెస్టు చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న రజనీ, కమల్ ల చిత్రాల నిర్మాణం చిక్కుల్లో పడతాయేమోనని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే, లైకా ఈ వార్తలను ఖండించింది. తమ సంస్థ ఎలాంటి మోసానికి పాల్పడలేదని ప్రకటన వెలువరించింది. సంస్థపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు.