breaking news
Rohtak district
-
భారత స్టార్ రెజ్లర్ భర్త అనుమానాస్పద మృతి
Commonwealth Games 2022 Bronze Medallist Pooja Sihags Husband Dies: బర్మింగ్‌హామ్ వేదికగా ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా రెజర్ల్ పూజా సిహాగ్ ఇంట్లో విషాదం నెలకొంది. నిన్న (ఆగస్ట్ 27) రాత్రి సిహాగ్ భర్త అజయ్ నందల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హర్యానాలోని రోహ్తక్ నగర పరిసర ప్రాంతంలో నందల్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. నందల్ మృతదేహం లభించిన ప్రాంతంలో అతని స్నేహితుడు రవి, మరో వ్యక్తిని అచేతనావస్థ స్థితిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా, అజయ్ నందల్ ఆకస్మిక మరణంపై అతని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. అజయ్‌కు అతని స్నేహితుడు రవి డ్రగ్స్ అలవాటు చేశాడని, డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే అజయ్ మృతి చెంది ఉంటాడని ఆరోపించాడు. అజయ్ తండ్రి ఆరోపణలు పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని వెల్లడించారు. స్వతహాగా రెజ్లర్ అయిన అజయ్ నందల్.. క్రీడల కోటాలో ఇటీవలే ఆర్మీ ఆఫీసర్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అజయ్ నందల్ భార్య, భారత స్టార్ మహిళా రెజ్లర్ పూజా సిహాగ్.. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో 76 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. చదవండి: డోపింగ్‌లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్ -
హరియాణాలో ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి
-
ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి
రొహతక్: హరియాణాలో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పూర్వికుల గ్రామంలో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం సంచలనం రేపింది. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ప్రఖ్యాత హరియాణావి గాయకురాలు మమతా శర్మ రొహతక్ జిల్లా బాలియాని గ్రామంలో శవమై కనిపించారు. జనవరి 14న గొహనాలో కార్యక్రమం ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆమె తర్వాత కనిపించకుండా పోయారు. బాలియాని గ్రామంలోని పొలాల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె గొంతు కోసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. కల్‌నౌర్ ప్రాంతవాసి అయిన మమత ప్రముఖ హరియాణావి గాయకురాలిగా సుపరిచితులు. భజన పాటలు పాడటంలో ఆమె పేరుగాంచారు. గత ఐదు రోజుల్లో ఆరు రేప్ కేసులు, గ్యాంగ్ రేప్ చోటు చేసుకోవడంతో హరియాణా పేరు జాతీయస్థాయిలో పతాక శీర్షికల్లో నిలిచింది. మహిళలపై అఘాయిత్యాలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జాట్ల ఆందోళనలపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ : హరియాణాలో జాట్ల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతను శనివారం అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. రాజ్‌నాథ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజు హజరయ్యారు. హరియాణాలోని భద్రతా ఏర్పాట్లపై రాజ్‌నాథ్ సింగ్...వారితో సమీక్ష జరిపారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ.. జాట్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నిరసనకారుల ఆందోళన శనివారం కూడా హింసాత్మకంగా మారింది. జింద్ రైల్వే స్టేషన్‌ను ఆందోళనకారులు తగులబెట్టారు. అంతేకాకుండా బీజేపీ ఎంపీ షైనీ నివాసంపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో రోహ్తక్, భివాని, ఝజ్జర్లలో కర్ఫ్యూ కొనసాగుతోందని డీజీపీ వైపీ సింఘల్ తెలిపారు. కాగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హరియాణాలో 10 కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించాయి. మరో 23 కంపెనీల బలగాలను కూడా కేంద్రం అక్కడకు పంపిస్తోంది. అలాగే ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న జాట్లకు ప్రత్యేక వెనుకబడిన తరగతుల (ఎస్బీసీ) కోటా ఇవ్వాలని నిర్ణయించినట్లు హరియాణా వ్యవసాయమంత్రి ఓపీ ధంకార్ ప్రకటించినా ...ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. -
కొనసాగుతున్న జాట్ల ఆందోళన
రోహ్తక్: జాట్ల ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ హరియాణాలో జాట్లు శనివారం కూడా విధ్వంసానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్ కార్యాలయంతో పాటు హోటల్స్, పలు దుకాణాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు అనంతరం రహదారులపై బైఠాయించారు. ఇవాళ ఉదయం కూడా పలు బస్సులను దగ్ధం చేశారు. జాట్లు ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధం చేయడంతో ఆర్మీ జవాన్లు హెలికాప్టర్ ద్వారా హరియాణా చేరుకుంటున్నారు. కాగా ఆందోళన హింసాత్మకంగా మారడంతో రోహ్తక్, భివాని ప్రాంతాల్లో పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్వర్వులు జారీ చేశారు. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు. అలాగే కేంద్రం కూడా పారామిలటరీ బలగాలను హరియాణాకు పంపుతోంది. ఇక ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు గాల్లోకి జరిపిన కాల్పుల్లో నిన్న ఓ ఆందోళనకారుడు మృతి చెందిన విషయం తెలిసిందే. -
జాట్ ఉద్యమం హింసాత్మకం
కాల్పుల్లో ఒకరి మృతి.. 25 మందికి గాయాలు ♦ హరియాణాలోని 9 జిల్లాల్లో ఆందోళనలు.. పలుచోట్ల కర్ఫ్యూ ♦ మంత్రి స్కూలు, ఎమ్మెల్యే కార్యాలయానికి ఆందోళనకారుల నిప్పు.. రోహ్తక్: ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ.. హరియాణాలో జాట్లు చేస్తున్న ఆందోళన ఉధృతంగా మారింది. పరిస్థితి చేయిదాటుతుండటంతో.. హరియాణా సర్కారు తొమ్మిది జిల్లాల్లో ఆర్మీని రంగంలోకి దించింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి స్కూలుతో పాటు పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ ఘటనలో గుర్తుతెలియని ఆందోళనకారుడు.. ఓ బీఎస్ఎఫ్ జవానుపై దాడికి ప్రయత్నించాడు. తప్పించుకోవడానికి జవాను కాల్పులు జరపటంతో ఆందోళనకారుడు మృతిచెందాడని డీజీపీ యశ్పాల్ సింఘాల్ వెల్లడించారు. వేర్వేరుచోట్ల జరిగిన గొడవల్లో 25 మందికి ఆందోళనకారులకు గాయాలయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును ఆసుపత్రికి తీసుకెళ్తున్న ఓ వ్యక్తిపై దాడిచేసి ఆ వాహనాన్ని కూడా జాట్లు దగ్ధం చేశారు. మరోవైపు రోహ్‌తక్‌తోపాటు ఝాజ్జర్, హంసీ, భివానీ, కైతాల్, పానిపట్, గురుగావ్ ప్రాంతాల్లోనూ జాట్ కార్యకర్తల ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు 3300 మంది పారామిలటరీ బలగాలను కేంద్రం.. హరియాణాకు పంపించింది. శాంతి భద్రతల విషయంపై సీఎం ఖట్టర్‌తో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. సాధారణ పరిస్థితులు నెలకొనేంతవరకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. మరోవైపు ఢిల్లీ-హిస్సార్, ఢిల్లీ-అంబాలా జాతీయ రహదారిపై మూడోరోజూ ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హరియాణా రాష్ట్ర మంత్రి కెప్టెన్ అభిమన్యుకు చెందిన స్కూలు, షాపింగ్‌మాల్‌ను నిరసనకారులు తగులపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే మనిష్ కుమార్ క్యాంప్ ఆఫీసును నిరసనకారులు తగులపెట్టారు. రోహ్తక్, భివానీ నగరాల్లో కర్ఫ్యూ విధించారు. పలుచోట్ల కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను కూడా జారీచేసింది. ఆందోళనలు ఆపితే.. రిజర్వేషన్ అంశాన్ని పరిశీలిస్తామని.. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు కాపాడాలని పిలుపునిచ్చారు. సీఎం ప్రకటనను జాట్ నాయకులు తిరస్కరించారు. రిజర్వేషన్‌పై అసెంబ్లీలో బిల్లు పెట్టేంతవరకు ఆందోళన ఆపేదిలేదని హెచ్చరించారు. కాగా, మూడ్రోజులుగా జరుగుతున్న ఆందోళనలతో రూ. 200 కోట్ల నష్టం వాటిల్లిందని, దాదాపు 600 రైళ్లు రద్దయ్యాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పలుచోట్ల వందల సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న రోహ్తక్లో అధికారులు ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపేశారు. రాష్ట్రంలోని శాంత్రి భద్రతలు అదుపు తప్పడంతో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ పరీకర్, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు శుక్రవారం రాత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, హోంశాఖ కార్యదర్శి, ఐబీ డైరక్టర్లు పాల్గొన్నారు. స్పెషల్ బీసీ హోదా ఇస్తాం రిజర్వేషన్లకోసం ఆందోళన చేస్తున్న జాట్లకు ప్రత్యేక వెనుకబడిన తరగతుల (ఎస్బీసీ) కోటా ఇవ్వాలని నిర్ణయించినట్లు హరియాణా వ్యవసాయమంత్రి ఓపీ ధంకార్ (జాట్) వెల్లడించారు. జాట్లు లేవనెత్తిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమని.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఆర్థిక పరిస్థితి ఆధారంగా.. తక్షణమే.. 10-20 శాతం రిజర్వేషన్లు పొందుతారని వెల్లడించారు.