breaking news
robots Next generation
-
ఇకపై.. రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు తేలిగ్గా..!
మానవ మణికట్టు ఒక పరిమితి వరకే తేలిగ్గా తిరుగుతుంది. కానీ ఓ రోబో మణికట్టు ఎటువైపైనా దాదాపు 270 డిగ్రీల వరకు తిరిగేలా రూపొందుతుంది. దాంతో అత్యంత నిశితంగా అనుకున్నంత మేరకే కోసేలా, కుట్లు వేసేలా చేసే శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబోకు ఆదేశాలిస్తూ డాక్టర్లు ‘ఆపరేట్’ చేస్తుంటారు. ఆ సర్జరీలో శస్త్రచికిత్స జరుగుతున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్‌ను) 3–డీ ఇమేజ్ తెరపై చూస్తుంటారు.మరింత సురక్షితమెందుకంటే... కోత చాలా చిన్నగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోత, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. ఇవేకాదు... శస్త్రచికిత్సకు పట్టే సమయమూ, ఇవ్వాల్సిన మత్తుమందూ, రక్తస్రావమూ అన్నీ తక్కువే. ఇవన్నీ రోబోతో జరిగే శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా మార్చేస్తాయి.ఏయే శాఖల్లో ఈ శస్త్రచికిత్సలు?మూత్ర వ్యవస్థకు సంబంధించి... మూత్రపిండాల శస్త్రచికిత్సలో:– కిడ్నీ నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) మూత్రం తీసుకొచ్చే పైపులైన యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఉన్నప్పుడు (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అంటారు.) చేసే ‘పైలో΄్లాస్టీప్రొíసీజర్’ అనే శస్త్రచికిత్సలో ∙కిడ్నీల్లో గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు ∙కిడ్నీ పూర్తిగా తొలగించాల్సిన కేసుల్లో (నెఫ్రెక్టమీ). ప్రోస్టెక్టమీ: ప్రోస్టేట్ గ్రంథి తొలగింపులో.గైనకాలజీలో:గర్భసంచికీ అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మ్యాలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడుఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి ∙ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్తో ఆ భాగం ఇతర శరీర భాగాలకు అతక్కుపోవడాన్ని విడదీయడానికి.యూరో–గైనకాలజీ శస్త్ర చికిత్సల్లో: – పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు మరో అవయవంలోకి చొచ్చుకునిపోయే హెర్నియా కేసుల్లో ‘సాక్రోకాల్పోపెక్సీ’ చేసేందుకు– దగ్గినప్పుడూ, ఒత్తిడికి మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ∙ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించడానికి.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి..విపుల్ ప్రొసీజర్:ప్రాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్నూ, బైల్డక్ట్ను తొలగించే ‘ప్రాంక్రియాటికో–డియోడనెక్టమీ’ వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో.ప్రాంక్రియాస్, చిన్నపేగులు, గాల్‌బ్లాడర్‌లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో (ఉదా: క్రానిక్ ప్రాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో)థైరాయిడెక్టమీ: క్యాన్సర్‌కు గురైన థైరాయిడ్ గ్రంథిని తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా పడకుండా శస్త్రచికిత్స చేసేందుకు. (అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు ఇదో వరం). బ్రెయిన్ సర్జరీస్: మెదడులోని సంక్లిష్టమైన భాగాల్లోకి ఏర్పడ్డ ట్యూమర్స్‌ను సంప్రదాయ శస్త్రచికిత్సతో తొలగింపు వీలుకాని సందర్భాల్లో.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో అన్ని వర్గాల ప్రజలకూ కొద్దిరోజుల్లోనే కారు చవగ్గా రోబో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.– డాక్టర్ వి. చంద్రమోహన్, సీనియర్ రోబోటిక్ యూరో సర్జన్ -
ఈ రోబోలు ఏం చేస్తాయంటే..
వాషింగ్టన్ : శాటిలైట్లను రిపేర్ చేయడంతో పాటు అంతరిక్ష యుద్ధాలు తలెత్తితే శత్రు స్పేస్‌క్రాఫ్ట్‌లను ధ్వంసం చేయగల అత్యాధునిక రోబోల తయారీకి అమెరికా సంసిద్ధమైంది. ఈ మేరకు అమెరికన్ డిఫెన్స్ రీసెర్చి ఏజెన్సీతో నాసా చేతులు కలిపింది. ‘సర్వీస్ స్టేషన్స్ ఇన్ ఆర్బిట్’ గా వ్యవహరించే ఈ రోబోటిక్ శాటిలైట్స్ ఉపగ్రహాల జీవితకాలాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఉపగ్రహాలకు చిన్నపాటి మరమ్మత్తులు చేసి వాటిని నిర్వహించే సామర్ధ్యం ఉండేలా రోబోలను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం అంతరిక్షంలో ఉపగ్రహాల్లో లోపాలు తలెత్తితే రిపేర్ చేయడం అసాధ్యం. వాటిని రీప్లేస్ చేయడం అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో నెక్ట్స్‌జెన్ రోబోలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నాసా చెబుతోంది. -
రోబో WONDERS
ఈ తరం విద్యార్థుల ప్రతిభ ఘట్కేసర్ సమీపంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతిబింబిస్తోంది. కాలేజ్‌లో జరుగుతున్న రోబో వేదా-2014 విద్యార్థుల సృజనకు వేదికగా నిలిచింది. విద్యార్థి దశలోనే వీరు రూపొందించిన రోబోలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. డిఫరెంట్ థీమ్స్‌తో అలరిస్తున్న రోబోలు నెక్ట్స్ జనరేషన్‌ను కళ్లముందు ఆవిష్కృతం చేస్తున్నాయి. కో-ఆర్డినేషన్ రోబో రోబోలు సమన్వయం కోల్పోతే జరిగే ఉత్పాతం ఎలా ఉంటుందో వునం చాలా సినివూల్లో చూశాం. అవి మన అదుపాజ్ఞలో నడవాలంటే మెదడుకు పదునుపెట్టాల్సిందే. ఆ ఆలోచనల నుంచి వచ్చిందే ‘సమన్వయ రోబో’.. హ్యూమన్ కంట్రోల్లో నడిచే ఈ రోబో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. హ్యూవున్ కంట్రోలింగ్‌తో ఒక రోబో పాత్ ఫాలో అవుతుంది. ఆ రోబో వెళ్లి వురో రోబోను టచ్ చేస్తుంది. రెండో రోబో కూడా ఆటోమేటిక్‌గా వుుందు వునం ఇచ్చిన పాత్లో వెళ్లడమే.. కో ఆర్డినేషన్ రోబోల్లో ప్రత్యేకత. సంవిదిత రోబో ఈ రోబో మెటల్ కాయిన్స్ ని డిటెక్ట్ చేసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. నియంత్రణ్ రోబో మనిషి చేతి కదలికలకు అనుగుణంగా ఈ రోబో కంట్రోల్ అవుతుంది. యాక్సిలరో మీటర్ చేతికి పెట్టుకొని మనిషి ఆపరేట్ చేస్తున్నప్పుడు రోబో ఒక పాత్లో వెళ్తుంది. ఆర్మీకి వీటి సేవలు అవసరం ఉంటాయి. -వాంకె శ్రీనివాస్