breaking news
rm chandrashaker
-
డయల్ యువర్ ఆర్ఎంకు 14 ఫిర్యాదులు
మంకమ్మతోట: కరీంనగర్ రీజియన్‌లోని ప్రయాణికుల సమస్యల సత్వర పరిష్కారారం కోసం బుధవారం నిర్వహించిన డయల్ యువర్ ఆర్ఎంకు 14 మంది ఫోన్లు చేశారు. కరీంనగర్ నుంచి కామారెడ్డికి రాత్రి 7నుంచి 8గంటల మధ్య బస్సు నడిపించాలని దేవయ్య అనే వ్యక్తి కోరారు. కరీంనగర్ నుంచి బెజ్జంకి వెళ్లే బస్సులను వాగేశ్వరి కళాశాల వద్ద ఆపాలని మన్మోహన్ అనే ప్రయాణికుడు కోరారు. శాతవాహన యూనిర్సిటీకి వచ్చేబస్సులో సమయాన్ని సూచించేలా బోర్డు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరినట్లు అధికారులు తెలిపారు. -
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ మంకమ్మతోట : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కృష్ణ పుష్కరాలకు కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీచుపల్లికి రోజూ ఐదు బస్సులు – ఉదయం 8:30 నుంచి 10:30 వరకు అరగంటకో బస్సు నాగార్జునసాగర్‌కు రెండు బస్సులు – ఉదయం 8 గంటలు, 10 గంటలకు విజయవాడకు రెండు బస్సులు – ఉదయం 7 గంటలు, 11 గంటలకు వడపల్లికి రెండు బస్సులు – ఉదయం 8:30, 10: 30 గంటలకు ఈ సర్వీస్‌లకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. 36 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వెళ్తే ప్రత్యేక బస్సు వేయనున్నట్లు తెలిపారు. వివరాల కోసం 9959225931 నెంబరులో సంప్రదించాలని కోరారు.