breaking news
Ringo
-
టెలికం ఆపరేటర్లపై రింగో ఆరోపణలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆధారిత కాలింగ్ సేవల యాప్ ‘రింగో’ తన నెట్‌వర్క్‌కు టెలికం ఆపరేటర్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్ ఇంటర్కనెక్షన్ పాయింట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసింది. దీనిపై ఆపరేటర్లకు లేఖలు రాయగా ఎలాంటి స్పందన లేదని, ట్రాయ్‌కు కూడా ఫిర్యాదు చేశామని రింగో సీఈవో భవీన్ తురాఖియా చెప్పారు. బీఎస్ఎన్ఎల్ మినహా మిగిలిన ఆపరేటర్లు ఇంటర్ కనెక్షన్‌కు అవకాశం కల్పించడం లేదన్నారు. విమొబి అనే తమ సబ్సిడరీ ద్వారా ఫిబ్రవరిలో యూనిఫైడ్ లెసైన్స్ తీసుకున్నామని, అయితే ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలు ప్రారంభించకుండా ఉంటేనే మా నెట్‌వర్క్‌కు ఇంటర్ కనెక్షన్ కల్పిస్తామని ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్‌లు చెప్పాయని వివరించారు. నిమిషానికి 20పైసలే: ప్రస్తుతం వాయిస్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసల నుంచి రూపాయిన్నర వరకు కంపెనీలు వసూలు చేస్తున్నాయని, తాము 20 నుంచి 35 పైసలకే అందిస్తామన్నారు. లేవాస్తవానికి రింగో తన చౌక యాప్ కాలింగ్ సేవలను 2015 నవంబర్లోనే ప్రారంభించింది. 90 శాతం చౌకగా కాల్స్ అందిస్తుండడంతో టెలికం ఆపరేటర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ట్రాయ్ సూచన మేరకు రింగో తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. రింగో మొబైల్ యాప్ యాప్ 3జీ, 4జీ నెట్‌వర్క్‌లపై, వైఫై మోడ్‌లోనూ పనిచేస్తుంది. ఈ యాప్ కస్టమర్లను వారి మొబైల్ నంబర్ ఆధారంగా నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తుంది. దీంతో దేశంలోని ఏ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నంబర్‌కు అయినా కాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. -
ఇంటర్నెట్, వైఫై అవసరం లేదు
*రింగో... స్మార్ట్ ఇంటర్నేషనల్ కాలింగ్ యాప్ ముంబై: రింగో... స్మార్ట్ ఇంటర్నేషనల్ కాలింగ్ యాప్ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ రింగో యాప్‌తో ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఇంటర్నేషనల్కాల్స్ చేసుకోవచ్చు. 16 దేశాల్లో విజయవంతమైన ఈ యాప్ ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ రింగో యాప్ కారణంగా ఇంటర్నేషనల్ కాలింగ్‌లో 90% పొదుపు చేయవచ్చు. తమ రింగో యాప్‌తో ప్ర పంచంతో భారతీయుల కమ్యూనికేషన్ విషయంలో పెనుమార్పు వస్తుందన్న ధీమాను రింగో సీఈఓ భవిన్ తురకియా వ్యక్తం చేశారు. ఇతర ఓటీటీ వాయిస్ యాప్‌ల వలె రింగో కాల్స్‌కు ఇంటర్నెట్, వైఫై, డేటా అవసరం లేదని వివరించారు. భారత్‌లోని రింగో యూజర్, ఇంగ్లాండ్‌లోని వ్యక్తికి ఫోన్ చేయాలనుకున్నట్లైతే, రింగో భారత యూజర్‌కు లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. అలాగే ఇంగ్లాండ్‌లోని యూజర్‌కు కూడా లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. ఈ ఇరువురిని కేరియర్ సర్క్యూట్ల ద్వారా అనుసంధానం చేస్తుందని వివరించారు. ఏడాదికి భారతీయులు 200 కోట్ల డాలర్లు విదేశీ కాల్స్ కోసం వెచ్చిస్తున్నారని భవిన్ పేర్కొన్నారు. ఇది వొడాఫోన్, ఎయిర్‌టెల్‌ల కంటే 70 శాతం తక్కువని, స్కైప్, వైబర్‌తో పోల్చితే 25% తక్కువని తెలిపారు.