breaking news
Rights Limited
-
ఉద్యోగ సమాచారం
బీఎస్ఎన్ఎల్లో టెక్నికల్ అసిస్టెంట్లు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్).. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వ చేసిన టెలికం టెక్నికల్ అసిస్టెంట్ (టీటీఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 147 (ఎస్సీ-25, ఎస్టీ-77, ఓబీసీ-45). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 10. పూర్తి వివరాలకు http://bsnl.co.in చూడొచ్చు. హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్లో అప్రెంటీస్‌లు హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఏడాది కాలం శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 61 (ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు-24, డిప్లొమా అప్రెంటీస్‌లు-28, వొకేషనల్ అప్రెంటీస్‌లు-9). దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 30. పూర్తి వివరాలకు www.hindpaper.in చూడొచ్చు. రైట్స్‌లో వివిధ పోస్టులు రైట్స్ లిమిటెడ్.. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రిజర్వ చేసిన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 22 (ఫైనాన్స జూనియర్ మేనేజర్-6, పర్సనల్ అసిస్టెంట్/స్టెనోగ్రాఫర్-5, హెచ్ఆర్ జూనియర్ అసిస్టెంట్-11). ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 27. పూర్తి వివరాలకు http://rites.com చూడొచ్చు. ఎడ్సిల్లో మేనేజ్మెంట్ ట్రైనీలు ఎడ్సిల్ (ఇండియా) లిమిటెడ్.. మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టుల భర్తీకి ‘గేట్-2015’ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20 (సివిల్ ఇంజనీరింగ్-10, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-10). ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 11. పూర్తి వివరాలకు http://edcilindia.co.in చూడొచ్చు. హిందుస్థాన్ కాపర్‌లో అసిస్టెంట్ మేనేజర్లు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్).. వికలాంగులకు రిజర్వ చేసిన గ్రూప్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 16 (అసిస్టెంట్ మేనేజర్-13, సీనియర్ మెడికల్ ఆఫీసర్-3). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 5. పూర్తి వివరాలకు www.hindustancopper.com చూడొచ్చు. సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థలో పోస్టులు సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 6 (ప్రాజెక్ట్ ఫెలో-3, రీసెర్చ అసోసియేట్-1, యానిమల్ అటెండెంట్-1, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో-1). దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 11. ఇంటర్వ్యూ తేది నవంబర్ 24. పూర్తి వివరాలకు www.igib.res.in చూడొచ్చు. వెజిటబుల్ రీసెర్చ ఇన్స్టిట్యూట్లో వేకెన్సీ ఐసీఏఆర్ అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ (ఐఐవీఆర్).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు-6 (రీసెర్చ అసోసియేట్-1, సీనియర్ రీసెర్చ ఫెలో-2, ప్రాజెక్ట్ అసిస్టెంట్-2, యంగ్ ప్రొఫెషనల్-1). ఇంటర్వ్యూ తేది నవంబర్ 21. పూర్తి వివరాలకు www.iivr.org.in చూడొచ్చు. -
అప్రెంటీస్‌షిప్, జాబ్స్
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో అప్రెంటీస్‌షిప్ శిక్షణ అందించడానికి దరఖాస్తులు కోరుతోంది. టెక్నీషియన్ అప్రెంటీస్‌షిప్ ట్రెయినింగ్ కాలపరిమితి: ఏడాది. విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్-70, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-60, సివిల్ ఇంజనీరింగ్-20, ఇన్స్ట్రుమెంటేషన్ - 10, కెమికల్ ఇంజనీరింగ్-10, మైనింగ్ ఇంజనీరింగ్-10, సీఎస్ఈ-10, ఈసీఈ-10, కమర్షియల్ ప్రాక్టీస్ - 10. అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ ట్రెయినింగ్ కాలపరిమితి: ఏడాది. విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్-50, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-50, సివిల్ ఇంజనీరింగ్-15, ఇన్స్ట్రుమెంటేషన్-10, కెమికల్ ఇంజనీరింగ్-10, మైనింగ్ ఇంజనీరింగ్-10, సీఎస్ఈ-10, ఈసీఈ-10, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్ -15. అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: డిసెంబర్ 15 - 24 వెబ్సైట్: www.nlcindia.com రైట్స్ లిమిటెడ్ గుర్గావ్లోని రైట్స్ లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనరల్ మేనేజర్ (సివిల్) జాయింట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పీజీ లేదా ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31 వెబ్సైట్: http://rites.com/vacancy/ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పైలట్ (క్లాస్-1) ఖాళీలు: 3 వయసు: 40 ఏళ్లు దాటకూడదు. అర్హత: కాంపిటెన్సీ యాజ్ మాస్టర్ ఆఫ్ ఫారెన్ గోయింగ్ సర్టిఫికెట్తో పాటు మాస్టర్/ చీఫ్ ఆఫీసర్‌గా ఏడాది పని అనుభవం ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: జనవరి 20 వెబ్సైట్: www.vizagport.com