పాపానివారిపల్లెలో విషాదఛాయలు
హిమాచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన విద్యార్థిని తిరిగి రావాలని సొంతూరులో పూజలు
వృత్తి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబం
బంగారుపాళెం: హిమాచల్‌ప్రదేశ్ విహారయాత్రలో విద్యార్థులు గల్లంతు కావడం తో మండలంలోని పాపానివారిపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. పా పానివారిపల్లెకు చెందిన శ్రీనివాస్పాపా ని, రమ దంపతుల కుమారై పాపాని రిధియా హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతోంది.
ఈనెల 3వ తేదీ కళాశాలకు చెందిన విద్యార్థులతో కలసి రిధియా విహారయాత్రకు వెళ్లింది. హిమాచల్‌ప్రదేశ్ సమీపంలో జరి గిన సంఘటనలో రిధియా గల్లంతైన విష యం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయా రు. శ్రీనివాసపాపాని కాంట్రాక్టరుగా పని చేస్తూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. గత నెల 31న రిధియా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నట్లు బంధువులు తెలి పారు. గ్రామానికి వచ్చినప్పుడు బంధువులతో కలివిడిగా ఉండేదని, రిధియా క్షేమంగా తిరిగి రావాలని భగవంతున్ని వేడుకుంటూ, పూజలు చేస్తూ, పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.