breaking news
Rice traders
-
కరువు పేరుతో ధరల దరువు!
సాక్షి, హైదరాబాద్: వర్షాభావ పరిస్థితులను బియ్యం వ్యాపారులు అవకాశంగా మలుచుకున్నారు. కరువు పేరు చెప్పి, గోదాముల్లో ఉన్న గత ఖరీఫ్ సీజన్ బియ్యానికే ధరలు రెట్టింపు చేశారు. కిలో రూ.50 నుంచి రూ.60 మించని బియ్యాన్ని రూ.90 నుంచి రూ.100, అంతకన్నా అధిక ధరలకు అమ్ముతున్నారు. మరీ దారుణం ఏంటంటే... చౌకధరల దుకాణాల ద్వారా వినియోగదారులు తీసుకున్న బియ్యాన్ని రూ.20 లోపు కిలో చొప్పున కొనుగోలు చేసి, అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి రూ.80 నుంచి వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. కరువు నేపథ్యంలో బియ్యానికి డిమా ండ్ పెరిగిందని ప్రచారం చేస్తూ, మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, బియ్యం డిపోల యజమానులు కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, పాలిష్ పట్టించి, పేరున్న బ్రాండ్ల సంచుల్లో నింపి సన్న బియ్యంగా డిపోలకు సరఫరా చేస్తున్నారు. పౌరసర ఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు గురువారం హైదరా బాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో చేపట్టిన తనిఖీల్లో ఈ దందా బట్టబయలైంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు విజిలెన్స్ విభాగం, తూనికలు కొలతల శాఖ, జీఎస్టీ, పోలీసులతో ఉదయం 9 గంటల నుంచి 20 బృందాలతో దాడులు నిర్వహించి మిల్లర్లు, వ్యాపారుల గుట్టును రట్టు చేశారు.క్వింటా రూ.5,400.. అమ్మేది రూ.10 వేలకు⇒ గత ఖరీఫ్ సీజన్లో పండించిన పంటకు సంబంధించి క్వింటాల్ బియ్యాన్ని రూ.4,000 నుంచి రూ.5000 వరకు విక్రయించారు. గత జూలై నెల వరకు కూడా బియ్యం ధర సుమారు రూ.5,400 నుంచి సూపర్‌ఫైన్ బియ్యం రూ.6000లోపే ఉంది. కానీ ఆ సీజన్ బియ్యం ఆగస్టు నుంచి ధర పెరుగుతూ వచ్చి ప్రస్తుతం మార్కెట్లో రూ.9,000 నుంచి రూ.9,500లకు చేరింది. కొన్ని రకాలు కిలో రూ.55 నుంచి రూ.80–85కు చేరాయి. జై శ్రీరామ్ వంటి సన్నరకాలు కిలో రూ.100 దాటాయి. నగరంలోని మౌలాలిలో బుధవారం ఓ బ్రాండ్ సన్న బియ్యం కిలో రూ.101కి అమ్ముడైంది. హెచ్ఎంటీ, తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్) రకాలు క్వింటా రూ.9 వేలు దాటాయి. హోల్‌సేల్, రిటైల్ ధరల మధ్యే కిలోకు రూ.5 నుంచి రూ.20 వరకు తేడా ఉంటోంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యే రాష్ట్రంలో బియ్యం చిల్లర ధరలు 13.3 శాతం పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి.రేషన్ బియ్యానికి కొత్త రంగు⇒ పౌరసరఫరాల శాఖ జరిపిన తనిఖీల్లో అత్యంత విస్తుపోయే అంశం రేషన్ బియ్యం రీసైక్లింగ్. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని రేషన్ కార్డుదారుల నుంచి రూ.15 నుంచి రూ.20కి కిలో చొప్పున బియ్యం కొనుగోలు చేసి, ఇబ్రహీంపట్నంలోని ఓ మిల్లుల్లో రీ సైక్లింగ్ చేసి, జైశ్రీరాం, కర్నూలు సోనా, హెచ్ఎంటీ, బీపీటీ పేర్లతో వివిధ బియ్యం బ్రాండ్ల 26 కిలోల సంచుల్లో నింపినట్టు తేలింది. ఇబ్రహీంపట్నం సమీపంలోని మంగల్‌పల్లి, శేరిగూడ, పోచారం, యాచారం ప్రాంతాల్లోని మిల్లుల్లో రీసైక్లింగ్ అయిన బియ్యం కార్పొరేట్ బ్రాండ్లను పోలిన పేర్లతో సంచుల్లో నింపి డిపోలకు పంపుతున్నారు. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ తనిఖీల్లో మిల్లుల్లో ఉన్న బియ్యం సంచులే కర్మన్‌ఘాట్ బియ్యం డిపోల్లో కూడా ఉన్నట్టు గుర్తించారు.కర్మన్‌ఘాట్‌లో షట్టర్లు మూసి పరార్రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ పరిధి కర్మన్‌ఘాట్‌లోని పలు బియ్యం డిపోలపై పౌరసరఫరాల, విజిలెన్స్ అధికారులు గురువారం బృందాలుగా ఏకకాలంలో దాడులు చేసి నిల్వలు, అమ్మకాల రికార్డులను పరిశీలించారు. రేషన్ బియ్యం కలిపారా లేదా తేల్చేందుకు పలు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. అధికారులు వస్తున్నారని తెలియగానే కొందరు డిపోల నిర్వాహకులు షట్టర్లు దించి వెళ్లిపోయారు. పౌరసరఫరాల శాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని సరూర్‌నగర్ పోలీసులు తెలిపారు.26 కిలోల ట్యాగ్‌తో 25 కిలోల బియ్యం విక్రయాలు.. జీఎస్టీ ఎగవేతబియ్యం తూకంలోనూ మిల్లర్లు, వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. సంచులపై 26 కిలోలు అని ట్యాగ్ వేసి లోపల 25 కిలోల బియ్యమే నింపుతున్నట్టు అధికారులు గుర్తించారు. మరికొన్నిచోట్ల 25 కిలోల సంచుల్లో 23–24 కిలోలే ఉంటున్నాయని అధికారులు గుర్తించారు. 25 కిలోల బియ్యం సంచులకు జీఎస్టీ 5 శాతం చెల్లించాల్సి వస్తున్నందున 26 కిలోల ట్యాగ్ వేస్తే జీఎస్టీ ఉండదు. అమ్మకాలకు బిల్లులు ఇవ్వకుండా, లెక్కల్లో చూపకుండా జీఎస్టీ ఎగవేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల మూడు జిల్లాల్లో బయటపడిన ఈ అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఇదే స్థాయిలో సాగుతున్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. -
తూకాల్లో కనికట్టు!
హిందూపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా బియ్యం వ్యాపారుల మాయూజాలంతో ప్రజలు మోసపోతున్నారు. ఫైన్ క్వాలిటీ పేరుతో మధ్య రకం బియ్యం అంటగడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. 25 కిలోలు, 50 కిలోల బస్తాల్లో ఒకటి నుంచి మూడు కి లోల వరకు నొక్కేస్తున్నారు. ఈ విషయం తెలిసినా తూనికలు, కొలతల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బియ్యం, బేడలను వ్యాపారులు 25 కేజీలు, 50 కేజీల బస్తాల్లో విక్రయాలు సాగిస్తున్నారు. 25 కేజీల బస్తాకొంటే అందులో ఉండే బియ్యం 23.5 కేజీలు మాత్రమే. 50 కేజీల బస్తాలో 47 కేజీల బియ్యం ఉంటున్నారుు. ఇదేమని ప్రశ్నిస్తే అది అంతే.. ఆ ప్యాకెట్లు మేం తెరిచి.. తిరిగి కుట్లు వేయలేదు.. మిషన్‌తో కుట్టేసివుంది కదా అని వ్యాపారులు దబారుుస్తున్నారు. మోసపోతున్నామని తెలిసినా వినియోగదారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో పెద్ద రైస్ మిల్లులు 98 దాకా ఉన్నాయి. ప్రతిఏటా సీజన్లో ప్రతిరోజూ సుమారు 2 వేల క్వింటాళ్ల వరకు బియ్యం బస్తాలను జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్ణాటకకు తరలిస్తుంటారు. వీటితో పాటు కర్నూలు జిల్లా నుంచి కూడా దాదాపు వెయ్యి క్వింటాళ్ల బియ్యం జిల్లాకు వస్తారుు. జిల్లాలో 900 మందికి పైగా బియ్యం వ్యాపారులున్నారు. ఇందులో హిందూపురంలోనే సుమారు 28 మంది వ్యాపారులున్నారు. హిందూపురం పట్టణంలో ప్రతిరోజు దాదాపు 200 క్వింటాళ్ల వరకు బియ్యం వ్యాపారం సాగుతోంది. అనంతపురంలో 300-400 క్వింటాళ్ల బియ్యం ప్రతిరోజూ అమ్ముడవుతున్నారుు. ఇంత భారీ ఎత్తున బియ్యం క్రయవిక్రయూలు సాగుతుండడాన్ని వ్యాపారులు అవకాశంగా తీసుకున్నారు. బియ్యం బస్తా కొనుకోలు చేసిన వారు నమ్మకంతో ఇంటికి తీసుకెళ్తారు. బస్తాపైన 25 కిలోలు అని రాసి ఉంటుంది. అరుుతే తూకం వేసి చూస్తే మాత్రం 23.5 కిలోలు మాత్రమే ఉంటున్నాయని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కొందరు వినియోగదారులు తూనికలు, కొలతల శాఖాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. అప్పుడప్పుడు మొక్కుబడిగా తనిఖీలకు వస్తున్నట్లు ముందే సూచించి.. ఆనక దుకాణాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు నాలుగు రోజుల్లో అధికారులు తనిఖీలకు వస్తున్నారని అసోసియేషన్ నేతలు దుకాణాల వారికి సూచించారు. ఈ కొద్ది రోజులు తూకం సరిగ్గా ఉండేట్లు చూసుకోవాలని జాగ్రత్తలు చెబుతున్నట్లు తెలిసింది. ప్యాకింగ్‌లోనే మాయూజాలం.. వ్యాపారులు విక్రయస్తున్న 25, 50 కేజీల బస్తాల బియ్యం ప్యాకెట్లు.. వ్యాపారుల ముందస్తు సూచనల మేరకు ప్యాక్ చేస్తున్నట్లు సమాచారం. చాలా మంది వ్యాపారులు ప్యాకెట్లలో ఎన్ని కిలోల బియ్యం ఉండాలో ముందే చెబుతున్నారు. పాతిక కిలోల బ్యాగులో కనీసం కిలో నుంచి రెండు కిలోలు, 50 కిలోల బ్యాగులో రెండు నుంచి నాలుగు కిలోలు తక్కువగా ప్యాక్ చేరుుస్తున్నారని తెలిసింది. మిల్లర్లు సైతం వారి వ్యాపారం కోసం కిక్కురుమనకుండా వ్యాపారులు చెప్పినట్లు చేస్తున్నారు. పైగా అనుమతికి మించి పెద్ద పరిమాణంలో బస్తాలు నిల్వ చేసుకున్నప్పటికీ అడిగే అధికారే కరువయ్యూరు. తూకాల్లో తక్కువ ఉంటే కేసులు తప్పవు : కె.ఎస్ రాజు, తూనికలు కొలతల శాఖాధికారి బియ్యం ప్యాకెట్ల తూకాల్లో తక్కువ ఇస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందాయి. సరిచేసుకోవాలని అసోసియేషన్ వారికి హెచ్చరించాము. అకస్మాత్తుగా తనిఖీలు చేస్తాం. తూకాల్లో వ్యత్యాసం ఉంటే చర్యలు తప్పవు.


