breaking news
The results of the second year
-
రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు!
తెలంగాణ హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 27 లేదా 28వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. 26వ తేదీనే ఫలితాలు వెల్లడించాలని తొలుత భావించినప్పటికీ... సంబంధిత పనులు పూర్తికాకపోవడంతో ఒకటి రెండు రోజుల పాటు వాయిదా వేశారు. అయితే సోమవారం జేఈఈ మెయిన్స్ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇంటర్ ఫలితాలను కూడా ప్రకటిస్తారా, లేక మంగళవారానికి వాయిదా వేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. -
ఫలితాల్లో ‘ప్రభుత్వ’ జోరు
నిజామాబాద్అర్బన్ : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా సగటు 53 శాతం ఉండగా.. ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత 62.64 శాతంగా నమోదైంది. గతేడాది ప్రభు త్వ కళాశాలల్లో 59.69 శాతమే ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో అత్యధికంగా మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 94 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ కళాశాలలో 164 మంది పరీక్షలు రాయగా 160 మంది పాసయ్యారు. అత్యల్పంగా నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర)లో 12 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. ఈ కళాశాలలో 238 మంది విద్యార్థులకుగాను 30 మందే పాసయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లోనూ బాలికలే జోరు కొనసాగించారు. జిల్లావ్యాప్తంగా 4,904 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయగా 3,072 మంది పాసయ్యారు. ఇందులో బాలురు 2,269 మంది పరీక్షలు రాయ గా 1,266 మంది ఉత్తీర్ణులయ్యారు. 55.80 శాతంగా ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలికల్లో 2,635 మంది పరీక్షలు రాయగా 1,806 మంది పాసయ్యారు. 68.54 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్ కళాశాల్లో 18 శాతం జిల్లాలో ఎయిడెడ్ కళాశాలలు మూడున్నాయి. 220 మంది పరీక్షలు రాయగా 39 మంది పాసయ్యారు. 18 శాతమే ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇందులో బాలురలో 137 మందికి 18 మంది విద్యార్థులు, బాలికల్లో 83 మందికిగాను 21 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 13.14 శాతం, బాలికల్లో 25.30 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. నగరంలోని సీఎస్ఐ జూనియర్ కళాశాలలో 99 మంది విద్యార్థులుండగా నలుగురు విద్యార్థులే పాసయ్యారు. ఆదర్శ హిందీ విద్యాలయంలో 64 మందికిగాను 20 మంది విద్యార్థులు, కామారెడ్డిలోని జీవీఎస్ జూనియర్ కళాశాలలో 57 మందికిగాను 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.