breaking news
regional airline
-
విమానయాన రంగంలోకి మరో కంపెనీ
ముంబై: విమాన యాన రంగానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరో కంపెనీ దేశీయ విమానయాన రంగంలోకి అడుగు పెట్టనుంది. వీఆర్ఎల్ లాజిస్టిక్స్ కంపెనీ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. సంస్థ చైర్మన్ విజయ్ శంకేశ్వర్, ఎండీ ఆనంద్ శంకేశ్వర్‌లు.. బోర్డు డెరైక్టర్లకు రాసిన ఒక లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము రీజినల్ ఎయిర్‌లైన్ ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదిస్తున్నా మని తెలియజేశారు. 1400 కోట్ల రూపాయలతో చాలా చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టునున్నట్టు వెల్లడించిన ప్రమోటర్లు.... పెట్టుబడిదారులు, విశ్లేషకుల సలహాలకు భిన్నంగా తాము ముందుకుపోమని స్పష్టం చేశారు. కాగా గత ఏడాది ఏప్రిల్ లో ఐపీవో కి వచ్చిన వీఆర్ ఎల్ భారీ లాభాలను ఆర్జించింది. పరిశ్రమ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నామని, అలాగే అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. కొత్త ఎయిర్‌లైన్ ఏర్పాటు తమ అభిమతమని చెప్పారు. ప్రభుత్వ ఆమోదం, నియంత్రణ సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. వీఆర్‌ఎల్‌లో తమకున్న వాటాలో కొంత భాగాన్ని తగ్గించుకుంటామని చెప్పారు. దీంతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ కంపెనీ షేరు భారీగా కుప్పకూలింది. చివరికి ఎన్ఎస్ఈ 20 శాతం నష్టాలతో 315 దగ్గర లోయర్ సర్క్యూట్ అయింది. -
విమానయాన రంగంలోకి వీఆర్ఎల్ లాజిస్టిక్స్!
న్యూఢిల్లీ: ‘వీఆర్ఎల్ లాజిస్టిక్స్’ తాజాగా విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. కంపెనీ చైర్మన్ విజయ్ శంకేశ్వర్, ఎండీ ఆనంద్ శంకేశ్వర్‌లు బోర్డు డెరైక్టర్లకు రాసిన ఒక లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తాము రీజినల్ ఎయిర్‌లైన్ ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదిస్తున్నామని తెలియజేశారు. పరిశ్రమ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నామని, అలాగే అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. కొత్త ఎయిర్‌లైన్ ఏర్పాటు తమ అభిమతమని, దీని ప్రారంభమనేది.. ప్రభుత్వ ఆమోదం, నియంత్రణ సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కొత్త వెంచర్ ఏర్పాటుకు అవసరమైన నిధుల కోసం కావాల్సివస్తే.. వీఆర్‌ఎల్‌లో తమకున్న వాటాలో కొంత భాగాన్ని తగ్గించుకుంటామని పేర్కొన్నారు.