breaking news
rebate offers
-
ఓట్ల కోసం రిబేట్లు.. ప్రోత్సాహక పథకం షురూ!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ ‘ఓటు వేయండి- డిస్కౌంట్ పొందండి’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఢిల్లీ ఓటర్లు మే 25 న ఓటు వేశాక, కొన్ని మార్కెట్లలో షాపింగ్ చేస్తే వారికి కొంతమేరకు రాయితీ ఇవ్వనున్నారు. అలాగే వివిధ వస్తువులపై ఆఫర్లు అందజేయనున్నారు. ఫలితంగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుంటారని ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ భావిస్తోంది.ఢిల్లీలోని 50కి పైగా చిన్న, పెద్ద మార్కెట్లలోని వ్యాపారులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభించారు. కశ్మీర్ గేట్, కమలా నగర్, లజ్‌పత్ నగర్, చాందినీ చౌక్, రోహిణి, కరోల్ బాగ్, నెహ్రూ ప్లేస్ తదితర ప్రాంతాల్లోని పలు మార్కెట్లలో ఇటువంటి ఆఫర్లు అందించనున్నారు. ఓటర్లు తమ ఓటువేశాక, వారి వేలిపై పెట్టే సిరా గుర్తును చూపిస్తే ఈ మార్కెట్లలో కొనుగోళ్లపై 15 నుంచి 25 శాతం రాయితీ అందించనున్నారు.ఇటువంటి ఆఫర్ ఆహారపానీయాలపై కూడా ఇవ్వనున్నారు. గత నాలుగు దశల ఓటింగ్ ట్రెండ్లను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ వ్యాపారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రత్యేక తగ్గింపు కేవలం ఢిల్లీ ఓటర్లకు మాత్రమే కాదని, ఐదవ దశలో ఓటు వేసిన సమీప ప్రాంతాల ఓటర్లు కూడా మార్కెట్లలో ఈ తగ్గింపు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ తెలిపింది. -
ఇక ‘తుక్కు’ రేగుతుంది..!
న్యూఢిల్లీ: కాలుష్యకారక పాత వాహనాల వినియోగాన్ని తగ్గించి, కొత్త వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాత వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ఇచ్చి, స్క్రాప్ సర్టిఫికెట్ తీసుకుంటే కొత్త కారుకు రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేయాలని భావిస్తోంది. అలాగే, వ్యక్తిగత వాహనాలకు 25 శాతం దాకా, వాణిజ్య వాహనాలకు 15 శాతం దాకా రోడ్ ట్యాక్స్‌లో రిబేటు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించనుంది. ఇక స్క్రాపింగ్ సర్టిఫికెట్ గల వాహనదారులకు కొత్త వాహనాలపై అయిదు శాతం మేర డిస్కౌంటు ఇచ్చేలా వాహనాల తయారీ సంస్థలకు కూడా సూచించనుంది. వాహనాల స్క్రాపేజీ విధానంపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటులో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విధానంపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాబోయే కొన్ని వారాల్లో ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రచురించనున్నట్లు ఆయన తెలిపారు. రిజిస్టర్డ్ తుక్కు కేంద్రాల్లో పాత, అన్‌ఫిట్ వాహనాలను స్క్రాప్ కింద ఇచ్చేసి, స్క్రాపింగ్ సర్టిఫికెట్ పొందే యజమానులకు ఈ స్కీమ్ కింద పలు ప్రోత్సాహకాలు లభిస్తాయని గడ్కరీ తెలిపారు. స్క్రాప్ కింద ఇచ్చేసే వాహనాల విలువ.. కొత్త వాహనాల ఎక్స్‌షోరూం రేటులో సుమారు 4–6% దాకా ఉండేలా స్క్రాపింగ్ సెంటర్ సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు. దేశీ వాహన పరిశ్రమ టర్నోవరు ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెరిగేందుకు స్క్రాపేజీ పాలసీ తోడ్పడగలదని మంత్రి తెలిపారు. అందరికీ ప్రయోజనకరం..: స్క్రాపేజీ విధానం అన్ని వర్గాలకూ ప్రయోజనకరంగా ఉండబోతోందని గడ్కరీ తెలిపారు. ఇంధన వినియోగ సామర్థ్యం మెరుగుపడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు, కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పాత, లోపభూయిష్టమైన వాహనాల సంఖ్యను తగ్గించడం ద్వారా కాలుష్య కారక వాయువుల విడుదలను నియంత్రించేందుకు, రహదారి.. వాహనాల భద్రతను మెరుగుపర్చేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. ప్రాణాంతకంగా రోడ్డు ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కోవిడ్–19 మరణాల కన్నా ఎక్కువ ఉండటం ఆందోళనకరమని గడ్కరీ తెలిపారు. గతేడాది కోవిడ్–19తో 1.46 లక్షల మంది మరణించగా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడ్డారని ఆయన పేర్కొన్నారు. వీరిలో అత్యధిక శాతం 18–35 ఏళ్ల మధ్య వయస్సున్న వారేనని మంత్రి చెప్పారు. తుక్కు పాలసీ ప్రతిపాదనల్లో మరికొన్ని... ► వాహనాల ఫిట్నెస్ టెస్టులు, స్క్రాపింగ్ సెంటర్ల సంబంధ నిబంధనలు 2021 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. పదిహేనేళ్లు పైబడిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను తుక్కు కింద మారుస్తారు. ► 2023 ఏప్రిల్ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేస్తారు. మిగతా వాహనాలకు దశలవారీగా 2024 జూన్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెస్తారు. ► ఫిట్నెస్ టెస్టులో విఫలమైనా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైనా సదరు వాహనాల జీవితకాలం ముగిసినట్లుగా పరిగణిస్తారు. 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడంలో విఫలమైన వాణిజ్య వాహనాలను డీ–రిజిస్టర్ చేస్తారు. ఇలాంటి వాహనాల వినియోగాన్ని తగ్గించే దిశగా 15 ఏళ్ల పైబడిన కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ టెస్టు, సర్టిఫికెట్ల ఫీజును భారీగా పెంచుతారు. ► ప్రైవేట్ వాహనాల విషయానికొస్తే .. 20 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ టెస్టులో లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైన పక్షంలో డీ–రిజిస్టర్ చేస్తారు. 15 ఏళ్ల నుంచే రీ–రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచుతారు. ► ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రిజిస్టర్డ్ వాహనాల స్క్రాపింగ్ కేంద్రాల (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సాహమిస్తుంది. స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటుకు మార్గదర్శకాల ముసాయిదా.. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రం (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 100 స్క్రాపింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. ఆర్వీఎస్ఎఫ్ ఏర్పాటుకు రూ. లక్ష లేదా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు నిర్దేశించే మొత్తం ప్రాసెసింగ్ ఫీజుగా ఉంటుంది. ప్రతీ ఆర్వీఎస్ఎఫ్కు ముం దస్తు డిపాజిట్‌గా రూ.10 లక్షల బ్యాంక్ గ్యా రంటీ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కో సం దరఖాస్తు చేసుకున్న 60 రోజులల్లోగా అనుమ తులపై నిర్ణయం తీసుకోవాలి. ఈ ముసా యిదా నిబంధనలపై సంబంధిత వర్గాలు 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలి. -
రైల్వే ప్రయాణికులకు ఆకర్షణీయ ఆఫర్లు
న్యూఢిల్లీ: మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో భర్తీకాని సీట్లను నింపేందుకు రైల్వే శాఖ గురువారం తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది. రిజర్వేషన్ చార్ట్ తుది ఖరారు అనంతరం మిగిలిపోయే సీట్లపై బేసిక్ చార్జీలో 10 శాతం తగ్గింపునిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఏసీ, స్లీపర్ క్లాస్‌తో సహా అన్ని రిజర్వ్ సీట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని, జనవరి 1, 2017 నుంచి ఆరు నెలలు పాటు తగ్గింపు కొనసాగుతుందని తెలిపింది. రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో తాత్కాల్ కోటాలో 10 శాతం సీట్లు తగ్గించినట్టు వెల్లడించింది. రెండు వారాలకొకసారి తాత్కాల్ కోటాపై జోనల్ రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ సమీక్ష జరుపుతారని, ఒకవేళ తాత్కాల్ టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటే 30 శాతం వరకు పెంచుతారని వివరించింది. న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్ ప్రెస్, మైసూర్-చెన్నై సెంట్రల్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో రూ. 140 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.