చాలా రోజులకు కనిపించిన రవితేజ కూతురు.. ఫొటోలు వైరల్
‘ఇరుముడి’తో హిట్ ట్రాక్ ఎక్కాడు రవితేజ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌కు ఓ కొత్త ఊపునిచ్చింది. ఇప్పుడు అదే జోష్‌తో కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు (అక్టోబర్ 11) ఈ చిత్రం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినిమా టైటిల్‌ని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘తులాభారం’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి రవితేజ కూతురు మోక్షద కూడా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు జె.డి. చక్రవర్తి విలన్ పాత్రలో కనిపిస్తుండగా డైరెక్టర్ కమ్ నటుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో మెరవనున్నాడు.(ఇదీ చదవండి: ‘జైలర్2’ రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎంతంటే..?)Ravi Teja’s Daughter at the #RT78 Launch Event with #AnaswaraRajan❤️✨ Watch Here : The Title Documentary https://t.co/XJE0KPnizt #RaviTeja #VivekAthreya #Laxman https://t.co/5M9mJ2eRnN— YouWe Media (@MediaYouwe) October 11, 2026